ఈ 3 నియోజక వర్గాల్లో వైఎస్ జగన్ ఎన్నికల ప్రచార సభలు

Ys Jagan: అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని పాయకరావుపేట నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొని ప్రసంగిస్తారు.

ఈ 3 నియోజక వర్గాల్లో వైఎస్ జగన్ ఎన్నికల ప్రచార సభలు

Updated On : May 1, 2024 / 12:29 PM IST

CM Jagan Bus Yatra: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇవాళ మూడు నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఉదయం 10 గంటలకు విజయనగరం లోక్‌సభ పరిధిలోని బొబ్బిలిలో మెయిన్‌రోడ్ సెంటర్‌లో వైసీపీ నిర్వహించే ప్రచార సభలో పాల్గొంటారు.

ఆ తర్వాత మధ్యాహ్నం 12.30 గంటలకు అనకాపల్లి పార్లమెంట్ పరిధిలోని పాయకరావుపేట నియోజకవర్గంలో ప్రచారంలో పాల్గొని ప్రసంగిస్తారు. పాయకరావుపేట సూర్య మహల్ సెంటర్‌లో ఈ సభ జరుగుతుంది. ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు ఏలూరు పార్లమెంట్ పరిధిలో జగన్ పర్యటిస్తారు. ఏలూరు నగరం ఫైర్ స్టేషన్ సెంటర్‌లో వైసీపీ సభ నిర్వహిస్తోంది.

ఎన్నికల వేళ జగన్ ప్రతిరోజు మూడు నియోజక వర్గాల చొప్పున ప్రచారంలో పాల్గొంటున్నారు. నిన్న జగన్ కడప పార్లమెంట్ పరిధిలోని మైదుకూరు నియోజకవర్గం, ఒంగోలు పార్లమెంట్ పరిధిలోని కొండెపి నియోజకవర్గం, రాజంపేట పార్లమెంట్ పరిధిలోని పీలేరు నియోజకవర్గంలో ప్రచార సభల్లో పాల్గొన్న విషయం తెలిసిందే.

Also Read : టీడీపీకి బీజేపీ బిగ్ షాక్‌..! ఉమ్మడిగా మ్యానిఫెస్టో విడుదలకు దూరం అందుకేనా?