Cm Revanth Reddy
లోక్‌సభ ఎన్నికల్లో తమ అభ్యర్థుల తరఫున ప్రచారం చేసేందుకు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇవాళ కరీంనగర్, వరంగల్, చేవెళ్ల నియోజకవర్గాల్లో పర్యటించనున్నారు. జమ్మికుంటలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో నిర్వహిస్తున్న భారీ బహిరంగ సభలో పాల్గొంటారు.
ఇవాళ మధ్యాహ్నం 2 గంటలకు హుజూరాబాద్ జనజాతర సభకు హాజరుకానున్నారు. సాయంత్రం 4 గంటలకు భూపాలపల్లి జనజాతర సభలో పాల్గొంటారు. అనంతరం రాత్రి 7 గంటలకు బాలాపూర్, బడంగ్‌పేట్ కార్నర్ మీటింగ్‌లో పాల్గొననున్నారు.
ఆ తర్వాత రాత్రి 9 గంటలకు ఆర్కేపురం, సరూర్ నగర్ కార్నర్ మీటింగ్ కు హాజరుకానున్నారు. తెలంగాణలోని 17 స్థానాల్లో జరగనున్న లోక్‌సభ ఎన్నికలకు మరో 13 రోజులే గడువు ఉండడంతో కాంగ్రెస్ పార్టీ ప్రచార వేగాన్ని పెంచింది. తెలంగాణ కాంగ్రెస్ ముఖ్యనేతలు అందరూ ప్రచార కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు.
దక్షిణాదిన కాంగ్రెస్ పార్టీ తెలంగాణతో పాటు కర్ణాటకపై ఆశలు పెట్టుకుంది. వీలైనన్ని అధిక సీట్లు సాధించడమే లక్ష్యంగా వ్యూహాలు రచించుకుంది. ఈ మేరకు ఆయా ప్రాంతాల్లో ఏఐసీసీ అగ్రనేతలూ ప్రచారంలో పాల్గొంటున్నారు.