Cyberabad Police : దేశంలోనే భారీ సైబ‌ర్ క్రైమ్.. ముఠా గుట్టురట్టు.. 14మంది అరెస్ట్!

దేశరాజధాని ఢిల్లీలో భారీ సైబర్ చీటింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఉత్తమ్ నగర్‌లో ఎస్బీఐ పేరుతో నకిలీ కాల్ సెంటర్ నడుపుతున్న ముఠా గుట్టురట్టు చేశారు సైబరాబాద్ పోలీసులు.

Cyberabad Police : దేశరాజధాని ఢిల్లీలో భారీ సైబర్ చీటింగ్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఉత్తమ్ నగర్‌లో ఎస్బీఐ పేరుతో నకిలీ కాల్ సెంటర్ నడుపుతున్న ముఠా గుట్టురట్టు చేశారు సైబరాబాద్ పోలీసులు. ఈ మేరకు సైబ‌రాబాద్ సీపీ స్టీఫెన్ ర‌వీంద్ర వెల్లడించారు. దేశంలోనే ఇది అతిపెద్ద సైబ‌ర్ మోసమని ఆయ‌న తెలిపారు.

దేశ వ్యాప్తంగా ఈ నకిలీ ముఠా 33 వేల ఫోన్ కాల్స్ ద్వారా వంద‌ల కోట్లు దోచుకున్నారని పేర్కొన్నారు. ఈ సైబర్ మోసం కేసులో ఇప్పటివరకూ 14 మందిని అరెస్టు చేసినట్టు తెలిపారు. ముఠాలోని సభ్యుల నుంచి 30 సెల్‌ఫోన్లు, 3 ల్యాప్‌టాప్‌లు, ఒక కారు, బైక్‌ను సైబరాబాద్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కాల్ సెంట‌ర్ ముఠాపై దేశ వ్యాప్తంగా 209 కేసులు వరకు న‌మోదు అయినట్టు సీపీ స్టీఫెన్ ర‌వీంద్ర‌ వెల్లడించారు.

SBI ఏజెంట్ల నుంచి అకౌంట్‌దారుల వివ‌రాలు సేకరించి ఈ ముఠాకు పాల్ప‌డిన‌ట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసులో ఫ‌ర్మాన్ హుస్సేన్ ప్ర‌ధాన నిందితుడుగా పేర్కొన్నారు. స్పూఫింగ్ అప్లికేష‌న్ల ద్వారా బ్యాంకు అకౌంట్లలోని నగదును కాజేసినట్టు గుర్తించారు. ఎస్బీఐ కాల్ సెంటర్ పేరుతో 1860 180 1290 నంబ‌ర్ నుంచి ఫోన్ చేస్తారని, వినియోగదారుల కార్డుల వివ‌రాలు సేక‌రించి నగదు దొంగిలించారని సీపీ స్టీఫెన్ ర‌వీంద్ర వెల్లడించారు.

Read Also : Akhanda Movie : అఖండ సినిమా ప్రదర్శిస్తున్న థియేటర్‌లో అగ్నిప్రమాదం

ట్రెండింగ్ వార్తలు