Dehradun : కుళ్లిపోయిన అమ్మానాన్నల మృతదేహాల మధ్య సజీవంగా పసికందు..

డెహ్రాడూన్ లో హృదయాలను కలచివేసే ఘటన వెలుగులోకి వచ్చింది. కుళ్లిపోయిన మృతదేహాల మధ్యలో శిశువు సజీవంగా ఉంది. నాలుగు రోజులుగా పాలు లేకుండా బిడ్డ ఆరోగ్యంగా ఉండటం చూసి డాక్టర్లు ఆశ్చర్యపోయారు.

Dehradun

Dehradun incident : డెహ్రాడూన్ లో హృదయాలను కలచివేసే ఘటన వెలుగులోకి వచ్చింది. కుళ్లిపోయిన మృతదేహాల మధ్యలో నాలుగు రోజుల శిశువు బయపడింది. ఆ బిడ్డ సజీవంగా ఉండటంచూసి పోలీసులు, డాక్టర్లు ఆశ్చర్యపోయారు. మంగళవారం (జూన్ 13) కుళ్లిపోయిన మృతదేహాలు ఆ శిశువు తల్లిదండ్రులవే అని పోలీసులు గుర్తించారు. తల్లిదండ్రులు ఆత్మహత్య చేసుకున్నారు.

దీంతో ఆ శిశువు ఆలనాపాలనా చూసేవారు లేకపోయారు. అలా పుట్టి కేవలం నాలుగు రోజులకే తల్లిదండ్రులను పోగొట్టుకున్న ఆ శిశువు దీనావస్థలో తల్లిదండ్రుల కుళ్లిపోయిన మృతదేహాల మధ్యలో పడి ఉంది. ఆ శిశువును పోలీసులు ఆస్పత్రికి తరలించారు. మూడు రోజులుగా కుళ్లిపోయిన స్థితిలో ఉన్న తల్లిదండ్రుల మృతదేహాల మధ్య నాలుగు రోజుల వయస్సున్న ఓ నవజాత శిశువు సజీవంగా.. తల్లిపాలు లేకపోయినా ఆరోగ్యంగా ఉండటం చూసి డాక్టర్లు ఆశ్చర్యపోయారు.

ఉత్తరాఖండ్‌లోని డెహ్రాదూన్‌లో మంగళవారం వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు మృతులు ఇద్దరిని కాసిఫ్‌, ఆనమ్‌లుగా గుర్తించారు. క్లెమెంట్ టౌన్ ఏరియాలో ఓ ఇంటినుంచి దుర్వాసన రావటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించారు. వెంటే ఘటనాస్థలానికి వచ్చిన పోలీసులు తలుపులు పగులగొట్టి లోపలికి వెళ్లి చూడగా దారుణమైన దుర్వాసన వారి ముక్కుపుటాలను తాకింది. దాంతో తగిన జాగ్రత్తలు తీసుకుని లోపలికి వెళ్లి పరిశీలించారు. రెండు మృతదేహాల మధ్య ఓ పసికందు పడి ఉండటం సజీవంగా ఉండటం గుర్తించి వెను వెంటనే ఆస్పత్రికి తలిరించారు. ఆ బిడ్డను పరీక్షించిన డాక్టర్లు ఆరోగ్యంగానే ఉందని తెలిపారు. కానీ మృతదేహాల మధ్య ఉండటంతో శిశువుకు తగిన వైద్యం అందించారు.

ఆ రెండు మృతదేహాలు నాగల్‌ జిల్లా సహరాన్‌పుర్‌కు చెందిన 25 ఏళ్ల కాసిఫ్‌, 22 ఏళ్ల ఆనమ్ లుగా గుర్తించారు. కాసిఫ్ సహరాన్ పూర్ లో జేసీబీ మెషిన్ నడిపే పనిచేస్తుంటాడు. ఆనమ్‌ కాసిఫ్ కు రెండోభార్య. ఆనమ్ జూన్‌ 9న స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆసుపత్రిలో మగశిశువుకు జన్మనిచ్చింది. అదే రోజు సాయంత్రం ఆస్పత్రినుంచి డిశ్చార్జి అయి ఇంటికొచ్చారు భార్యాభర్తలు ఇద్దరు శిశువును తీసుకుని. ఆ తరువాతే వీరు ఆత్మహత్య చేసుకున్నట్లుగా పోలీసులు భావిస్తున్నారు. మృతుల శరీరంపై ఎటువంటి గాయాలు లేవు. విషపూరిత పదార్ధం తీసుకుని ఆత్మహత్యకు పాల్పడినట్లుగా తెలుస్తోంది.

ఎందుకంటే కాసిఫ్‌కు అప్పులు చాలా ఉన్నాయని గుర్తించారు. బాబు పుట్టాక అంటే జూన్‌ 11న కూడా ఓ వ్యక్తి దగ్గర రూ.5 లక్షలు అప్పుగా తీసుకున్నాడని అతని మొదటిభార్య నుస్రత్‌ తెలిపింది. ఆమెకు ఐదేళ్ల కూతురు ఉంది. కాసిఫ్‌కు నుస్రత్‌తో గొడవలు ఉన్నాయని..దీంతో అతను ఏడాది క్రితం ఆనమ్ ను పెళ్లి చేసుకున్నాడు. మృతదేహాలను పోస్టు మార్టం కోసం తరలించామని..పసిబిడ్డ ఆరోగ్య పరిస్థితిని డాక్టర్లు పర్యవేక్షిస్తున్నారని క్లెమెంట్ టౌన్ పోలీస్ స్టేషన్ ఇన్‌ఛార్జ్ తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామని పోస్టు మార్టం రిపోర్టు వచ్చాక మరణాలకు కారణం తెలుస్తుందని వెల్లడించారు.

 

ట్రెండింగ్ వార్తలు