Mumbai Businessman: అమ్మాయిని ‘ఐటమ్’ అన్న వ్యాపారి.. జైలు శిక్ష విధించిన కోర్టు

స్కూలు నుంచి ఇంటికి వెళ్తున్న పదహారేళ్ల అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తించాడో వ్యక్తి. ఆమె జుట్టు పట్టుకుని వేధిస్తూ, ఐటమ్ అని పిలిచాడు. దీనిపై బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ అంశంపై కోర్టు విచారణ జరిపి, నిందితుడికి జైలు శిక్ష విధించింది.

Mumbai Businessman: అమ్మాయితో అసభ్యంగా ప్రవర్తిస్తూ, ఐటమ్ అని పిలిచినందుకు ఒక వ్యాపారికి జైలు శిక్ష విధించింది కోర్టు. ముంబైకి చెందిన పోక్సో కోర్టు నిందితుడికి శిక్ష ఖరారు చేసింది. 2015లో 16 ఏళ్ల ఒక అమ్మాయి, స్కూలు నుంచి మధ్యాహ్నం ఇంటికి వెళ్తోంది.

Andhra Pradesh Fire: ఏపీలో అగ్ని ప్రమాదం.. 36 ఈ-బైకులు దగ్ధం

ఆ సమయంలో ముంబైకి చెందిన ఒక వ్యాపారి స్నేహితులతో కలిసి రోడ్డు పక్కన కూర్చున్నాడు. ఇంటికి వెళ్తున్న బాలికను గమనించిన ఆ వ్యక్తి బైకుపై ఆమెను అనుసరించాడు. ఆ అమ్మాయి జుట్టు పట్టుకుని అసభ్యంగా ప్రవర్తించాడు. ‘హలో.. ఐటమ్ ఎక్కడికి వెళ్తున్నావు’ అని ప్రశ్నించాడు. ‘నేను కావాలనుకుంటే నిన్ను ఏమైనా చేస్తాను’ అంటూ వేధించాడు. ఈ క్రమంలో అమ్మాయి అతడి నుంచి తప్పించుకునేందుకు ప్రయత్నించింది. కొద్ది దూరం జరిగి, వెంటనే 100కు డయల్ చేసింది. అయితే, పోలీసులు ఆలస్యంగా అక్కడికి చేరుకున్నారు. ఆ లోపు బాలిక అక్కడ్నుంచి వెళ్లిపోయింది. కానీ, ఆ తర్వాత తన తండ్రితో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసింది.

Mumbai: చూసినందుకే హత్య.. తనను చూస్తున్నాడని యువకుడిపై ముగ్గురు దాడి.. తీవ్ర గాయాలతో బాధితుడి మృతి

దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకుని, విచారణ జరిపారు. కోర్టులో అప్పటినుంచి ఈ కేసు విచారణ సాగుతోంది. ఇటీవల ఆ యువతి కూడా తన వాంగ్మూలం ఇచ్చింది. అయితే, నిందితుడు ప్రస్తుతం సత్ప్రవర్తనతో ఉన్నాడని, అందువల్ల అతడ్ని వదిలేయాలని అతడి తరఫు లాయర్లు వాదించారు. దీనికి కోర్టు నిరాకరించింది. బాలిక అతడిపై మోపిన అభియోగాలన్నీ నిజమని నమ్మిన కోర్టు.. తాజాగా అతడికి ఏడాదిన్నర జైలు శిక్ష విధిస్తూ తీర్పునిచ్చింది.

 

 

ట్రెండింగ్ వార్తలు