Himachal Pradesh: హిమాచల్ ప్రదేశ్‌లో మణిపూర్ లాంటి ఘటన.. సీఎం సొంత ప్రాంతంలోనే ఉన్మాదపు ఘటన

ఈ ఘటనలో గ్రామంలోని వ్యక్తుల ప్రమేయం కూడా ఉందని మహిళ అత్తమామలు ఆరోపించారు. ఇక ఈ అంశంపై రాజకీయాలు కూడా మొదలయ్యాయి. సీఎం సొంత జిల్లాలోనే ఈ ఘటన జరగడంతో మరింత తీవ్రమవుతోంది

Hamirpur: కొద్ది నెలల క్రితం మణిపూర్ లో ఇద్దరు మహిళలతో వ్యవహరించిన తీరు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైన ఆ విషయం.. పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను సైతం ప్రభావితం చేసింది. తాజాగా అలాంటి ఉదంతమే హిమాచల్ ప్రదేశ్‌లోని హమీర్‌పూర్‌లో వెలుగు చూసింది. సీఎం సుఖు సొంత జిల్లా హమీర్‌పూర్‌లోని భోరంజ్ గ్రామంలో మొదట ఓ మహిళ జుట్టును కత్తిరించి, ఆ తర్వాత ఆమె ముఖం నల్లగా చేసి ఊరంతా ఊరేగించారు. విషయం 10 రోజుల క్రితం జరిగిందట.

SP vs Congress: ఇండియా కూటమిలో చీలిక మొదలైందా? అఖిలేష్ యాదవ్ మీద విరుచుకుపడ్డ కాంగ్రెస్ చీఫ్

దానికి సంబంధించిన ఘటన తాజాగా సోషల్ మీడియాలో వైరల్‌గా మారడంతో విషయం వెలుగులోకి వచ్చింది. కాగా, ఈ కేసులో ఇప్పటి వరకు 5 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు వెల్లడించిన సమాచారం ప్రకారం.. మహిళకు కొద్ది రోజుల క్రితం వివాహమైంది. ఆ తర్వాత కొన్ని రోజులకు ఆమె తన ఇంటికి వెళ్లింది. అయితే ఆమె తిరిగి రాగానే అత్తమామలు ఆమెతో అసభ్యంగా ప్రవర్తించారు. ఘటన సమయంలో గ్రామానికి చెందిన మరికొందరు కూడా ఉన్నట్టు వీడియోలో చూడవచ్చు.

CJI DY Chandrachud: సుప్రీంకోర్టు కొలీజియంపై కీలక ప్రకటన చేసిన సీజేఐ డీవై చంద్రచూడ్

3 నిమిషాల 42 సెకన్ల వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ కేసులో బాధిత మహిళ వాంగ్మూలాన్ని పోలీసులు తీసుకున్నారు. ఈ ఘటనలో గ్రామంలోని వ్యక్తుల ప్రమేయం కూడా ఉందని మహిళ అత్తమామలు ఆరోపించారు. ఇక ఈ అంశంపై రాజకీయాలు కూడా మొదలయ్యాయి. సీఎం సొంత జిల్లాలోనే ఈ ఘటన జరగడంతో మరింత తీవ్రమవుతోంది. శాంతిభద్రతలు పూర్తిగా స్తంభించాయని హిమాచల్ బీజేపీ కార్యదర్శి నరేంద్ర అత్రి అన్నారు. ఎలాంటి భయం లేకుండా సంఘ వ్యతిరేకులు నేరాలకు పాల్పడుతున్నారని ప్రభుత్వంపై విరుచుకుపడ్డారు.

ట్రెండింగ్ వార్తలు