Hyderabad Drugs : హైదరాబాద్‌లో డ్రగ్స్ పట్టివేత-నైజీరియన్ అరెస్ట్

వీసా గడువు  ముగిసి పోయినా ఇండియాలోనే ఉంటూ డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న నైజీరియన్‌ను  హైదరాబాద్   సెంట్రల్ జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు. 

Hyderabad Drugs :  వీసా గడువు  ముగిసి పోయినా ఇండియాలోనే ఉంటూ డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తున్న నైజీరియన్‌ను  హైదరాబాద్   సెంట్రల్ జోన్ పోలీసులు అరెస్ట్ చేశారు.  నైజీరియా‌కు చెందిన ఒసీగ్వే చుక్వెంక జేమ్స్ అనే వ్యక్తిని అరెస్టు చేసి అతని   వద్ద  నుంచి 30 గ్రాముల ఎండిఎంఏ, 4 సెల్ ఫోన్లు, ఖతార్, కెమెన్ ఐల్యాండ్  దేశాలకు చెందిన కరెన్సీ స్వాధీనం చేసుకున్నట్లు  సెంట్రల్ జోన్ డీసీపీ రాజేష్ చెప్పారు. తెలిపారు. శుక్రవారం కింగ్ కోఠీలో    డ్రగ్స్ సరఫరా చేయటానికి వచ్చిన జేమ్స్ ను వలపన్ని పట్టుకున్నట్లు డీసీపీ తెలిపారు.

జేమ్స్ 2013లో మొదటి సారి ఇండియా వచ్చి తిరిగి వెళ్లిపోయాడని తిరిగి 2022 లో వచ్చి వీసా గడువు ముగిసిపోయినా హైదరాబాద్‌లో ఉంటూ డ్రగ్స్ అమ్మకాలు చేస్తున్నాడని చెప్పారు. గతంలో గోవాలో డ్రగ్స్ స్మగ్లింగ్ చేస్తూ పట్టుబడ్డాడని.. మూడు నెలలు జైలులో ఉండి బయటకు వచ్చిన తర్వాత పేరు మార్చుకొని డ్రగ్స్ దందా కొనసాగిస్తున్నాడని రాజేష్ వివరించారు.

పట్టుబడ్డ జేమ్స్ గోవా నుండి హైదరాబాద్ కు డ్రగ్స్ తీసుకువచ్చి అమ్ముతున్నాడు. అతని వద్ద డ్రగ్స్ కొనుగోలు చేసే 108 మంది వినియోగదారులను గుర్తించామని వారితో కలిసి ఒక వాట్సప్ గ్రూప్ ఏర్పాటు చేసి డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్లు ఆయన తెలిపారు.

డగ్స్ వినియోగిస్తున్న వారిపైనా కఠిన చర్యలు ఉంటాయని ఆయన అన్నారు. నైజీరియాలో ఉన్న స్నేహితుడి  ద్వారా డ్రగ్స్ తెప్పించి… గ్రాము 7 వేల రూపాయలకు  విక్రయిస్తున్నాడని ఆయన అన్నారు. నైజీరియాకు చెందిన డ్రగ్స్ అమ్మే వారు ఏడుగురు ఇక్కడ ఉన్నారని…అందులో నలుగురిని వారి దేశాలకు పంపించామని ఇంకా ముగ్గురు మాత్రమే ఉన్నారని డీసీపీ తెలిపారు.

Also Read : Delhi : ఢిల్లీలో ఆయుధాలు, మందుగుండు సామాగ్రి ర‌వాణా..ఆరుగురు అరెస్ట్

ట్రెండింగ్ వార్తలు