Delhi Robbery : ఢిల్లీలో పట్టపగలే దోపిడీ .. కారులో ఉన్నవారికి గన్ చూపించి క్యాష్‌బ్యాగ్‌తో పరార్

ఓ వ్యక్తి రూ.2లక్షలు ఉన్న క్యాష్ బ్యాగును వేరొకరికి అప్పగించటానికి క్యాబ్ లో బయలుదేరారు. క్యాబ్ రెండు బైకులపై వచ్చిన నలుగురు వ్యక్తలు నడిరోడ్డుపై క్యాబ్ ను అటకాయించారు. గన్ పట్టుకుని కారులో ఉన్న వ్యక్తిని బెదిరించారు. అంతే బ్యాగు అందిపుచ్చుకుని అక్కడనుంచి ఉడాయించారు.

Robbery In Delhi Pragati Maidan tennel

Robbery  IN Delhi : ఢిల్లీ(Delhi)లో పట్టపగలే దోపిడీ (Robbery)జరిగింది. బైక్ పై వచ్చిన దుండగులు కారులో ఉన్నవారిని అడ్డుకుని తుపాకీతో బెదిరించి మరీ దోచుకుపోయారు. ఇదంతా తమ పక్కనే పట్టపగలే జరిగినా తోటి వాహనాదారులు ఎవ్వరు పట్టించుకోకపోవటం గమనించాల్సిన విషయం. కళ్లముందే దోపిడీ జరుగుతున్నా పట్టించుకోలేదు. దీంతో దుండగుల పని ఈజీ అయిపోయింది. చక్కగా బైకులపై వచ్చి కూల్ గా గన్ చూపించి కారు వెనుక సీట్ లో ఉన్న బ్యాగ్ పట్టుకుని ఉడాయించారు. దీనికి సంబంధించిన సీసీటీవీ ఫుటేజీలు వైరల్‌ (Viral Video)గా మారాయి. ప్రగతి మైదాన్ టన్నెల్ కింద జరిగిన ఈ దోపిడీ గురించి ఢిల్లీ సీఎం (Delhi CM) అరవింద్ కేజ్రీవాల్ ( Arvind Kejriwal)స్పందిస్తు లెప్టినెంట్ గవర్నర్ (LG) రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు.

Video Viral: కర్ణాటకలో మరో దారుణం.. భార్యపై అనుమానంతో భర్త ఏం చేశాడంటే…

ఈ దోపిడీ గురించి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఓ వ్యక్తి రూ.2లక్షలు ఉన్న క్యాష్ బ్యాగును గురుగ్రామ్ లో ఉన్నవారికి అప్పగించటానికి క్యాబ్ లో బయలుదేరారు. ఈ క్రమంలో క్యాబ్ ప్రగతి మైదాన్ టన్నెల్ లోపలికి ప్రశ్నించింది. సరిగ్గా అదే సమయంలో రెండు బైకులపై వచ్చిన నలుగురు వ్యక్తలు నడిరోడ్డుపై క్యాబ్ ను అటకాయించారు. గన్ పట్టుకుని కారులో ఉన్న వ్యక్తిని బెదిరించారు. అంతే బ్యాగు అందిపుచ్చుకుని అక్కడనుంచి ఉడాయించారు. తుపాకీతో బెదిరించి కారు వెనుక సీటులో ఉన్న నగదు బ్యాగుతో అక్కడి నుంచి ఉడాయించారు. దోపిడికి వచ్చినవారు మంకీ క్యాప్ లు ధరించారు గుర్తు తెలియకుండా.

ఇదంతా అక్కడున్న సీసీ కెమెరాల్లో రికార్డయ్యింది. ఈ దోపిడీపై కేసు నమోదు చేసి విచారిస్తున్నామని తెలిపారు. నిందితులను గుర్తించి అరెస్ట్ చేస్తామని తెలిపారు. పట్టపగలు నడిరోడ్డుపై జరిగిన ఈదోపిడీని సీఎం కేజ్రీవాల్ నగరంలో శాంతిభద్రతల నిర్వహణపై ఆందోళన వ్యక్తంచేశారు. ఇది శాంతి భద్రతల వైఫల్యమని ఎల్జీ రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. కేంద్ర ప్రభుత్వం ఢిల్లీని సురక్షితంగా ఉంచలేకపోతే.. ఆ బాధ్యతలను ఆప్‌ ప్రభుత్వానికి అప్పగించాలంటూ ట్వీట్‌ చేశారు. కానీ ప్రగతి మైదాన్ టన్నెల్ 1.5 కి.మీల పొడవుంటుంది. ఈ టన్నెల్‌లో దాదాపు 16 మంది భద్రతా సిబ్బంది కాపలాగా ఉంటారని..పోలీసులు తెలిపారు.

Nepal Hindu Temple : నేపాల్ హిందూ దేవాలయంలో భారీగా బంగారం మాయం

 

 

ట్రెండింగ్ వార్తలు