Shamshabad Airport : వామ్మో.. శంషాబాద్ ఎయిర్‌పోర్టులో మరోసారి భారీగా బంగారం పట్టివేత.. 93లక్షల విలువైన కిలోన్నర గోల్డ్ సీజ్

శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కేంద్రంగా స్మగ్లింగ్ దందా కొనసాగుతోంది. అరబ్ దేశాల కేంద్రంగా అక్రమ బంగారం, విదేశీ కరెన్సీ, సిగరెట్ల స్మగ్లింగ్ జరుగుతోంది. Shamshabad Airport

Shamshabad Airport(Photo : Google)

Shamshabad Airport – Gold Smuggling : శంషాబాద్ ఎయిర్ పోర్టు గోల్డ్ స్మగ్లింగ్ కు అడ్డాగా మారింది. అధికారులు ఎంత నిఘా పెట్టినా బంగారం అక్రమ రవాణ మాత్రం ఆగడం లేదు. విదేశాల నుంచి వచ్చే వారు అక్రమ పద్దతుల్లో గోల్డ్ ను తీసుకుని వస్తున్నారు. రకరకాల పద్ధతుల్లో గోల్డ్ స్మగ్లింగ్ కు పాల్పడుతున్నారు. అయినా వారి ఆటలు సాగడం లేదు. అధికారుల తనిఖీల్లో అడ్డంగా దొరికిపోతున్నారు.

Also Read..Cyberabad Traffic Police : ‘హైడ్రో ప్లానింగ్’ అంటే ఏంటి? సైబరాబాద్ పోలీసులు షేర్ చేసిన వీడియోలో దాని గురించి ఏం చెప్పారు?

తాజాగా మరోసారి శంషాబాద్ ఎయిర్ పోర్టులో భారీగా బంగారం పట్టుబడింది. అధికారులు ఏకంగా కిలోన్నర గోల్డ్ సీజ్ చేశారు. నలుగురు ప్రయాణికుల నుంచి బంగారం స్వాధీనం చేసుకున్నారు. దాని విలువ 93లక్షల రూపాయలు ఉంటుందని అంచనా వేశారు. ఆ నలుగురు ప్రయాణికులు దుబాయ్ నుండి వచ్చారు. నలుగురి వద్ద అక్రమ బంగారాన్ని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ఆ నలుగురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఎవరికీ అనుమానం రాకుండా, దొరికిపోకుండా పక్కా ప్లాన్ వేశారు. దుస్తుల మధ్యలో బంగారాన్ని ఉంచుకున్నారు. అయినా అధికారుల తనిఖీల్లో దొరికిపోయారు.

Also Read..Assam: ఫేస్‌బుక్ ప్రేమ.. మూడేళ్ల తరువాత భార్య, ఆమె తల్లిదండ్రులను హత్యచేసిన భర్త .. అసలేం జరిగిందంటే?

కాగా, శంషాబాద్ ఎయిర్ పోర్ట్ కేంద్రంగా స్మగ్లింగ్ దందా కొనసాగుతోంది. అరబ్ దేశాల కేంద్రంగా అక్రమ బంగారం, విదేశీ కరెన్సీ, సిగరెట్ల స్మగ్లింగ్ జరుగుతోంది. కువైట్ నుంచి హైదరాబాద్ తరలిస్తున్న 704 గ్రాముల బంగారం సీజ్ చేశారు. దాని విలువ 42.8 లక్షలుగా తేల్చారు. ఇక మరో కేసులో 7.56 లక్షల రూపాయల విదేశీ కరెన్సీ సీజ్ చేశారు సీఐఎస్ఎఫ్ పోలీసులు. ఇంకో కేసులో బహ్రెయిన్ నుంచి హైదరాబాద్ కు స్మగ్లింగ్ చేసిన 15వేల సిగరెట్లు పట్టుకున్నారు అధికారులు. పట్టుబడిన సిగరెట్ల విలువ రూ.2.25 లక్షలుగా నిర్ధారించారు.

ట్రెండింగ్ వార్తలు