Manipur Violence: మీరు చర్యలు తీసుకోకుంటే మేం రంగంలోకి దిగుతాం.. మణిపూర్ దారుణంపై కేంద్రానికి సుప్రీకోర్టు వార్నింగ్

ఈ ఘటనపై తీవ్రంగా కలత చెందానని, ఇది రాజ్యాంగ వైఫల్యమని చీఫ్ జస్టిస్ పేర్కొన్నారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం, మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నివేదికలను డిమాండ్ చేశానని సుప్రీం చీఫ్ తెలిపారు

CJI Chandrachud: మణిపూర్ ఉన్మాద ఘటనపై సుప్రీంకోర్టు తీవ్ర స్థాయిలో స్పందించింది. అల్లర్లు సృష్టించడానికి మహిళల్ని పావులుగా చేసుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేసిన భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ చంద్రచూడ్.. మణిపూర్ విషయమై కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని, లేదంటే తాము చర్యల్లోకి దిగుతామని హెచ్చరించింది. ఈ విషయమై సీజేఐ స్పందిస్తూ ‘‘ఇది రాజ్యాంగ దుర్వినియోగంలో అత్యంత దారుణ పరిణామం. బయటకు వచ్చిన వీడియోల వల్ల మేము తీవ్ర ఆందోళనకు గురయ్యాము. ప్రభుత్వం రంగంలోకి దిగి చర్యలు తీసుకునే సమయం ఆసన్నమైంది. ప్రభుత్వం చర్యలు తీసుకోకపోతే మేం చర్యలకు దిగుతాం. రాజ్యాంగం అమలులో ఉన్న ప్రజాస్వామ్యంలో ఇది ఆమోదయోగ్యం కాదు. ఇది తీవ్రంగా కలవరపెడుతోంది’’ అని అన్నారు.

Pakistani national Seema Haider : సీమా హైదర్ కేసులో వెలుగుచూసిన సంచలన విషయాలు

మణిపూర్ లో ఇద్దరు మహిళలను కొందరు వ్యక్తులు ఊరేగించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయిన నేపథ్యంలో దీనిపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని భారత సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి డీవై చంద్రచూడ్ గురువారం ఆదేశించారు. తాను ఈ ఘటనపై తీవ్రంగా కలత చెందానని, ఇది రాజ్యాంగ వైఫల్యమని చీఫ్ జస్టిస్ పేర్కొన్నారు. ఈ ఘటనపై కేంద్ర ప్రభుత్వం, మణిపూర్ ముఖ్యమంత్రి ఎన్ బీరెన్ సింగ్ నేతృత్వంలోని రాష్ట్ర ప్రభుత్వాల నుంచి నివేదికలను డిమాండ్ చేశానని సుప్రీం చీఫ్ తెలిపారు. మణిపూర్ అంశంపై జూలై 28వ తేదీన తాము విచారణ చేపడతామని సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ చెప్పారు. నిందితులపై కేసు నమోదు చేసేందుకు తీసుకుంటున్న చర్యల గురించి తెలియజేయాలని సుప్రీంకోర్టు ప్రభుత్వాన్ని కోరింది. ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని అత్యున్నత న్యాయస్థానం స్పష్టం చేసింది.

Viral News : 14 మందిలో ఎవరిని పెళ్లి చేసుకోను? సోషల్ మీడియాలో సంచలనంగా మారిన యువతి పోస్టు

కాగా, ఈ ఘటనపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఎట్టకేలకు గురువారం స్పందించారు. సోషల్ మీడియాలో వైరల్ కావడంతో తన హృదయం బాధతో నిండిపోయిందని ఆయన అన్నారు. మణిపూర్‌ కుమార్తెలకు జరిగిన దురాగతాన్ని ఎప్పటికీ క్షమించలేమని పేర్కొన్నారు. ఈ ఘటన దేశానికి సిగ్గుచేటని, దోషులను వదిలిపెట్టబోమని పార్లమెంట్‌ వర్షాకాల సమావేశాల ప్రారంభానికి ముందు ప్రధాని మోదీ వ్యాఖ్యానించారు. మణిపూర్‌లో ఘర్షణలు చెలరేగిన ఒక రోజు తర్వాత మే 4న ఈ ఘటన జరిగింది. వీడియోలో ఇద్దరు మహిళలను ఒక గుంపు నగ్నంగా ఊరేగించి, వేధింపులకు గురి చేసి, పొలంలోకి లాగి, అక్కడ వారిపై సామూహిక అత్యాచారానికి పాల్పడ్డారు. మానవత్వానికి మాయని మచ్చగా జరిగిన ఈ నేరంపై వెంటనే కఠిన చర్యలు తీసుకుంటామని మణిపూర్ ముఖ్యమంత్రి ప్రకటించారు.

ట్రెండింగ్ వార్తలు