Prabhas – Hanu Raghavapudi : ప్రభాస్ – హను రాఘవపూడి సినిమా వర్క్ మొదలు.. షూటింగ్ ఎప్పట్నించి అంటే..?

హను రాఘవ పూడి ప్రభాస్ సినిమా త్వరలో మొదలుపెట్టబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది.

Prabhas Hanu Raghavapudi Movie Work Updates Shooting Starting Details

Prabhas – Hanu Raghavapudi : ప్రభాస్ తాజాగా కల్కి సినిమాతో వచ్చి మెప్పించాడు. థియేటర్స్ లో భారీ హిట్ తో కల్కి సినిమా దూసుకుపోతుంది. ఎంతో ఆతృతగా ఎదురుచూసిన కల్కి వచ్చి హిట్ అవ్వడంతో ప్రభాస్ నెక్స్ట్ సినిమాల కోసం ఎదురుచూస్తున్నారు అభిమానులు. ప్రభాస్ చేతిలో ప్రస్తుతం సలార్ 2, రాజా సాబ్, కల్కి 2, స్పిరిట్, హను రాఘవపూడి సినిమాలు ఉన్నాయి.

ప్రశాంత్ నీల్ – ఎన్టీఆర్ సినిమా అయ్యాకే సలార్ 2 మొదలవుతుంది. స్పిరిట్ వచ్చే సంవత్సరమే. రాజా సాబ్ షూట్ నడుస్తుంది. కల్కి 2 కూడా వచ్చే సంవత్సరం షూట్ ఉంటుంది. ఇక హను రాఘవ పూడి సినిమా త్వరలో మొదలుపెట్టబోతున్నట్టు టాక్ వినిపిస్తుంది. ప్రస్తుతం హను రాఘవపూడి – ప్రభాస్ సినిమాకు సంబంధించిన సెట్ వర్క్స్ జరుగుతున్నాయని టాలీవుడ్ సమాచారం. ప్రభాస్ రాజా సాబ్ సినిమాకి డేట్స్ ఇవ్వనున్నాడు. ఆగస్టు వరకు రాజా సాబ్ షూటింగ్ పూర్తిచేసి సెప్టెంబర్ నుంచి హను రాఘవపూడి సినిమాకి డేట్స్ ఇస్తాడు అని తెలుస్తుంది. దీంతో సెప్టెంబర్ లో హను రాఘవపూడి – ప్రభాస్ సినిమా షూటింగ్ మొదలవుతుందని సమాచారం.

Also Read : Deepika Padukone : ‘కల్కి’ సినిమాలో దీపికా పదుకోన్‌కి డబ్బింగ్ చెప్పింది ఈ స్టార్ హీరోయిన్ అని తెలుసా?

ఇక హను రాఘవపూడి – ప్రభాస్ సినిమా యుద్ధం బ్యాక్‌డ్రాప్ తో లవ్ స్టోరీ కథ అని, ఆల్రెడీ మూడు సాంగ్స్ వర్క్ కూడా పూర్తయిందని ఈ సినిమా మ్యూజిక్ డైరెక్టర్ విశాల్ చంద్రశేఖర్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో తెలిపాడు. మంచి క్లాసిక్ లవ్ స్టోరీలు తీసే హను రాఘవపుడి మాస్ కటౌట్ ప్రభాస్ ని ఎలా చూపిస్తాడో చూడాలి.