OSSS OTT: ఓటీటీలో ఓం శాంతి శాంతి శాంతిః.. స్ట్రీమింగ్ ఎక్కడంటే?
తరుణ్ భాస్కర్ ఓం శాంతి శాంతి శాంతిః(OSSS OTT) మూవీ ఓటీటీ స్ట్రీమింగ్ పై అధికారిక ప్రకటన వచ్చేసింది.
om shanti shanti shantihi ott streaming update
OSSS OTT: టాలీవుడ్ దర్శకుడు, నటుడు తరుణ్ భాస్కర్ ప్రధాన పాత్రలో వచ్చిన లేటెస్ట్ మూవీ ఓం శాంతి శాంతి శాంతిః. ఈషా రెబ్బ హీరోయిన్ గా నటించిన ఈ సినిమాను దర్శకుడు సజీవ్ తెరకెక్కించాడు. మలయాళ సూపర్ హిట్ మూవీ జయ జయ జయహే సినిమాకు ఇది రీమేక్. పక్కా ఫ్యామిలీ అండ్ కామెడీ ఎంటర్టైనర్ గా వచ్చిన ఈ సినిమా జనవరి 30న ప్రేక్షకుల ముందుకు వచ్చింది.
Priyanka Chopra: అందుకే బాలీవుడ్ ను వదిలేశాను.. షాకింగ్ కామెంట్స్ చేసిన ప్రియాంక చోప్రా
టీజర్, ట్రైలర్ తో ఆకట్టుకున్న సినిమాపై మంచి అంచనాలు క్రియేట్ అయ్యాయి కానీ, ఆ అంచనాలను అందుకోవడంలో మాత్రం సినిమా విఫలం అయింది అనే చెప్పాలి. ఆడియన్స్ నుంచి ఈ సినిమాకు నెగిటీవ్ టాక్ వచ్చింది. కామెడీ అక్కడక్కడా వర్కౌట్ అయినా సినిమా అంతగా మెప్పించలేదని కామెంట్స్ వచ్చాయి. ఇక జయ జయ జయహే సినిమాను కూడా ఇప్పటికే చాలా మంది చూసేసి ఉన్నారు. అది కూడా ఒక మైనస్ పాయింట్ గా మారింది.
ఈ నేపధ్యంలోనే తాజాగా ఓం శాంతి శాంతి శాంతిః(OSSS OTT) సినిమాను ఓటీటీ విడుదలపై అధికారిక ప్రకటన చేశారు మేకర్స్. ఈ సినిమా ఓటీటీ హక్కులను ప్రముఖ సంస్థ ఆహా దక్కించుకున్న విషయం తెలిసిందే. మార్చ్ 4వ తేదీ నుంచి ఈ సినిమాను స్ట్రీమింగ్ చేయనున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అయితే, థియేటర్స్ లో ఈ సినిమాను ఎక్కువ మంది చూడలేదు కాబట్టి ఓటీటీలో మంచి స్పందన వచ్చే అవకాశం ఉంది. మరి ఈ సినిమా ఓటీటీలో అయినా హిట్ కొడుతుందా చూడాలి.
