Nagababu: గొప్ప మనసు చాటుకున్న నాగబాబు.. పసివాడి గుండె ఆపరేషన్ కోసం ఆర్ధిక సహాయం
జనసైనికుడి కుటుంబానికి అండగా మెగా బ్రదర్ నాగబాబు(Nagababu).
Nagababu provided 1 lakh rupees for a child's heart operation.
Nagababu: జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఆంధ్రప్రదేశ్ శాసన మండలి సభ్యులు నాగబాబు మరోసారి తన గొప్ప మనసును చాటుకున్నాడు. గుండె సంబధింత సమస్యతో భాదపడుతున్న చిన్నారికి ఆర్ధిక సహాయం అందించాడు. దీంతో, ఆ కుటుంబ సభ్యులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఖమ్మం జిల్లా తాటిపూడి గ్రామానికి చెందిన కట్టా రామకృష్ణ చాలా కాలం నుంచి జనసేన కార్యకర్తగా ఉంటున్నాడు. అతిని కుమారుడు శ్రీహర్ష గుండె సమస్యతో బాధపడుతున్నాడు.
Kalki 2: ప్రభాస్ ఫ్యాన్స్ కి గుడ్ న్యూస్.. నాగ్ అశ్విన్ కమల్ తో మొదలెట్టేశాడు
గత 26 రోజులుగా కూకట్పల్లిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అతని గుండె కేవలం 10 శాతం మాత్రమే రక్తం పంపింగ్ చేస్తుందట. ఈ వైద్యం కోసం ఇప్పటివరకు సుమారు రూ.13 లక్షల వరకు ఖర్చు చేసిందట ఆ కుటంబం. ఇంకా రూ.10 లక్షల వరకు అవసరం అవుతుందని డాక్టర్స్ చెప్పాడట. ఇక ఆ చిన్నారి పరిస్థితి తెలుసుకున్న నాగబాబు ఆ కుటుంబానికి అండగా నిలబడుతూ.. లక్ష రూపాయల ఆర్ధిక సహాయాన్ని అందించాడు. అలాగే, పసివాడి శ్రీహర్ష ప్రాణాలు కాపాడేందుకు దాతలు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. అలాగే బాధిత కుటుంబానికి సంబందించిన బ్యాంకు డీటెయిల్స్, క్యూఆర్ కోడ్ ను కూడా షేర్ చేశాడు నాగబాబు. దీంతో ఈ న్యూస్ ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
