Nothing Ear (3a) : 42 గంటలు నాన్‌స్టాప్ మ్యూజిక్.. కొత్త ఇయర్‌బడ్స్‌లో ఇవే హైలైట్స్.. ధర జస్ట్ ఎంతంటే?
Nothing Ear (3a) : నథింగ్ ఇయర్ 3ఎ బడ్స్ స్పెషల్ ఆడియో స్నాప్‌షాట్ ఫీచర్‌తో లాంచ్ అయింది. 42 గంటల బ్యాటరీతో అత్యంత ఆకర్షణీయంగా ఉంది. ఈ ఇయర్ బడ్స్ ధరపై ఓసారి లుక్కేయండి..
Nothing Ear 3a
- నథింగ్ ఇయర్ (3ఎ) 12mm డైనమిక్ డ్రైవర్లతో వస్తుంది
- 45dB అడ్వాన్స్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ ఫీచర్
- 17 శాతం మెరుగైన సౌండ్ రెసిస్టెన్స్ అందిస్తుంది
Nothing Ear (3a) : నథింగ్ లవర్స్‌కు గుడ్ న్యూస్.. కంపెనీ లేటెస్ట్ ఇయర్‌బడ్స్ మార్కెట్లోకి వచ్చేసింది. నథింగ్ ఇయర్ (3a) అద్భుతమైన నాయిస్ క్యాన్సిలేషన్, బ్యాటరీ లైఫ్‌తో సహా అనేక అడ్వాన్స్ ఫీచర్లతో ఆకట్టుకునేలా ఉంది.
ఈ ఇయర్ బడ్స్ ప్లే అవుతున్నప్పుడు ఆడియో క్లిప్ సేవ్ చేసుకోవచ్చు. ఆడియో స్నాప్‌షాట్ అనే స్పెషల్ ఫీచర్ (Nothing Ear (3a) కూడా ఉంది. కంపెనీ ఇంటర్నల్ కాల్ రికార్డింగ్ ఆప్షన్ కూడా అందిస్తుంది. 10 గంటల బ్యాటరీ లైఫ్‌తో వస్తుంది. నథింగ్ ఇయర్ 3ఎ ధర, ఇతర ముఖ్య ఫీచర్లకు సంబంధించి పూర్తి వివరాలను ఓసారి పరిశీలిద్దాం.
నథింగ్ ఇయర్ (3ఎ) ధర :
నథింగ్ ఇయర్ (3ఎ) ధర 99 డాలర్లు (సుమారు రూ. 9వేలు). కంపెనీ బ్లాక్, వైట్, ఎల్లో, రోజ్ కలర్ ఆప్షన్లలో అందిస్తుంది. కంపెనీ అధికారిక వెబ్సైట్లో కొనుగోలుకు అందుబాటులో ఉంటాయి.
నథింగ్ ఇయర్ (3ఎ) స్పెసిఫికేషన్లు :
నథింగ్ ఇయర్ (3ఎ)లో 12mm డైనమిక్ డ్రైవర్లు ఉన్నాయి. హై-రెస్ ఆడియో వైర్లెస్ సర్టిఫైడ్ ఎల్డీఏసీ కోడెక్‌కు సపోర్టు ఇస్తాయి. ఇందులో అడ్వాన్స్ 8-బ్యాండ్ ఈక్వలైజర్ కూడా ఉంది. తమకు నచ్చిన విధంగా ఆడియోను అడ్జెస్ట్ చేసుకోవచ్చు.
వైడ్ ఫ్రీక్వెన్సీ రేంజ్ కవర్ చేస్తూ.. 45dB అడ్వాన్స్ యాక్టివ్ నాయిస్ క్యాన్సిలేషన్ అందిస్తాయి. గత మోడల్ కన్నా 17శాతం మెరుగైన నాయిస్ క్యాన్సిలేషన్‌ను అందిస్తాయని కంపెనీ పేర్కొంది. కంపెనీ ఈ ఇయర్‌బడ్స్‌లో ఆడియో స్నాప్‌షాట్ అనే స్పెషల్ ఫీచర్ చేర్చింది.
తద్వారా మీరు మ్యూజిక్ వింటున్నప్పుడు, ఆడియో చిన్న క్లిప్‌ను సేవ్ చేసుకోవచ్చు. ఇందులో 32MB ఫ్లాష్ స్టోరేజ్ ఉంది. పించ్ జెస్చర్ ద్వారా క్లిప్‌లను సేవ్ చేసుకోవచ్చు. నథింగ్ ఎక్స్ యాప్ ద్వారా రన్ అవుతుంది. 2 గంటల వరకు మీటింగ్స్ కూడా రికార్డ్ చేయగలవు.
ఈ ఇయర్‌బడ్స్‌లో బ్లూటూత్ 6.0 కనెక్టివిటీని అందించారు. డ్యూయల్ డివైస్ పెయిరింగ్ ఫీచర్ కూడా ఉంది. కంపెనీ డస్ట్, వాటర్ రెసిస్టెన్స్ నుంచి ప్రొటెక్షన్ కల్పించింది. IP54 డస్ట్ వాటర్ రెసిస్టెన్స్‌తో వస్తాయి. బ్యాటరీ బ్యాకప్ విషయానికి వస్తే.. నథింగ్స్ న్యూ ఇయర్‌బడ్స్ 10 గంటల ప్లేబ్యాక్ టైమ్ అందిస్తాయి.
అయితే, ఛార్జింగ్ కేస్‌తో కలిపి 42 గంటల బ్యాకప్ అందిస్తుంది. ఏఎన్సీ ఆన్‌లో ఉంచితే 25 గంటల వరకు రన్ అవుతాయి. కంపెనీ క్విక్ ఛార్జ్ ఫీచర్ కూడా అందిస్తోంది. కేవలం 5 నిమిషాల ఛార్జింగ్‌లో గంట ప్లేబ్యాక్ టైమ్ అందిస్తుంది. ఛార్జింగ్ కేస్‌లో త్రి ఫ్యాక్టర్ ఎల్ఈడీ ఇండికేటర్ కూడా ఉంది. మిగిలిన బ్యాటరీ ఎంత ఉందో కూడా చూపిస్తుంది.
