5 Best Smartphones : కొంటే ఇలాంటి ఫోన్లు కొనాలి.. రూ.12వేల లోపు ధరకే టాప్ 5 స్మార్ట్ఫోన్లు.. ఫీచర్ల కోసమైన కొనేసుకోవచ్చు!
5 Best Smartphones : భారీ 7000mAh బ్యాటరీతో రూ. 12వేల లోపు ధరలో అద్భుతమైన స్మార్ట్ఫోన్లు అందుబాటులో ఉన్నాయి. ఇలా కొన్నారంటే అదనపు డిస్కౌంట్లతో ఇంటికి తెచ్చుకోవచ్చు..
5 Best Smartphones
- రియల్‌మి నార్జో 100 లైట్ 5జీ అమెజాన్‌లో రూ.16,999 ధరకే
- వన్‌ప్లస్ N6x బ్యాంకు ఆఫర్‌తో ధర రూ.18,895కు లభిస్తోంది
- మోటో G06 పవర్ ఫ్లిప్‌కార్ట్‌లో రూ.11,999 ధరకు మీ సొంతం
5 Best Smartphones : కొత్త స్మార్ట్‌ఫోన్ కొనేందుకు ప్లాన్ చేస్తున్నారా? భారీ బ్యాటరీతో కొత్త ఫోన్ కొనేందుకు ఇదే బెస్ట్ టైమ్.. రూ.20వేల లోపు ధరలో లభించే మోటో జీ06 పవర్, పోకో M7 ప్లస్ 5జీ, వన్‌ప్లస్ N6x, రియల్‌మి నార్జో 100 లైట్ 5జీ, ఒప్పో A6c వంటి అద్భుతమైన ఫోన్లు అందుబాటులో ఉన్నాయి.
ఈ స్మార్ట్ఫోన్లన్నింటిలో 7000mAh బ్యాటరీలు అత్యంత ఆకర్షణీయంగా ఉన్నాయి. సింగిల్ ఛార్జ్‌పై లాంగ్ బ్యాటరీ లైఫ్‌ను అందిస్తాయి. ఈ స్మార్ట్ఫోన్లు ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌లో భారీ డిస్కౌంట్లతో లభిస్తున్నాయి.. ఇందులో మీ ఫేవరెట్ ఫోన్ కొనేసుకోండి..
మోటో జీ06 పవర్ (ధర రూ.11,999) :
ఈ-కామర్స్ సైట్లో (4GB+64GB) స్టోరేజ్ వేరియంట్ ధర రూ.11,999కి అందుబాటులో ఉంది. ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్‌తో రూ.600 తగ్గింపు పొందవచ్చు. ఆ తర్వాత అసలు ధర రూ.11,399 అవుతుంది. మోటో జీ06 పవర్లో 7,000mAh బ్యాటరీ ఉంది. 18W ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది.
ఈ ఫోన్లో మీడియాటెక్ హీలియో G81 ఎక్స్ట్రీమ్ ప్రాసెసర్ అందించారు. మోటో జీ06 పవర్ బ్యాక్ కెమెరా సెటప్‌లో ఎఫ్/1.8 అపర్చర్‌తో 50MP ప్రైమరీ కెమెరా ఉంది. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం, ఎఫ్/2.0 అపర్చర్‌తో 8MP ఫ్రంట్ కెమెరా అందించారు.
Read Also : Gold Price Today : బంగారం కొనేవారికి ఇదే బెస్ట్ టైమ్.. భారీగా తగ్గిన పసిడి ధరలు.. వెండి రేటు ఏకంగా ఎంతంటే?
పోకో ఎమ్7 ప్లస్ 5జీ (ధర రూ.19,999) :
ఫ్లిప్‌కార్ట్‌లో 4GB/128GB స్టోరేజ్ వేరియంట్ రూ.19,999 ధరకు అందుబాటులో ఉంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ క్రెడిట్ కార్డులతో రూ.1,350 తగ్గింపు పొందవచ్చు. బ్యాంక్ ఆఫర్లతో ఈ ఫోన్ ధర రూ.18,649 అవుతుంది. పోకో M7 ప్లస్ 5జీ ఫోన్ 7,000mAh బ్యాటరీతో రన్ అవుతుంది. 33W వైర్డ్ ఛార్జింగ్, 18W రివర్స్ వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. క్వాల్కామ్ స్నాప్‌డ్రాగన్ 6s జెన్ 3 ప్రాసెసర్‌తో రన్ అవుతుంది.
వన్‌ప్లస్ N6x (ధర రూ.18,895) :
ఈ వన్‌ప్లస్ (4GB+128GB) స్టోరేజ్ వేరియంట్ ధర రూ.18,895గా ఉంది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో పేమెంట్ చేస్తే రూ.1,350 తగ్గింపు లభిస్తుంది. అసలు ధర నుంచి రూ.17,545 తగ్గింది. వన్‌ప్లస్ N6xలో 7,000mAh బ్యాటరీ ఉంది. 15W వైర్డ్ ఫాస్ట్ ఛార్జింగ్, 5W వైర్డ్ రివర్స్ ఛార్జింగ్‌కు సపోర్ట్ చేస్తుంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6360 అపెక్స్ ప్రాసెసర్ ఉంది.
రియల్‌మి నార్జో 100 లైట్ 5జీ ( ధర రూ.16,999) :
అన్ని బ్యాంకుల కార్డులతో చేసే పేమెంట్లపై రూ.1,000 ఫ్లాట్ డిస్కౌంట్ వర్తిస్తుంది. అసలు ధర రూ.15,999 అవుతుంది. నార్జో 100 లైట్ 5జీలో 7000mAh బ్యాటరీ ఉంది. మీడియాటెక్ డైమెన్సిటీ 6300 చిప్సెట్తో రన్ అవుతుంది.
ఒప్పో ఎ6సి (ధర రూ.17,999) :
ఈ ఒప్పో ఎ6సి ఫోన్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్ ఈఎంఐతో 2.5శాతం ఇన్స్టంట్ డిస్కౌంట్ పొందవచ్చు. ఆ తర్వాత ధర రూ.17,550కి తగ్గుతుంది. ఒప్పో ఎ6సిలో 7000mAh బ్యాటరీ ఉంది. తద్వారా 15W వైర్డ్ ఛార్జింగ్‌కు సపోర్టు ఇస్తుంది. ఈ ఫోన్లో బ్యాక్ సైడ్ ఎఫ్/2.2 అపర్చర్‌తో 13MP ప్రైమరీ కెమెరా, ఫ్రంట్ సైడ్ ఎఫ్/2.2 అపర్చర్‌తో 5MP సెల్ఫీ కెమెరా ఉన్నాయి.
