BSNL New Offer : BSNL సూపర్ ప్లాన్.. రూ.51కే 2GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఈ నెల 30 వరకే ఆఫర్!
BSNL New Offer : ఉచిత సిమ్, 28 రోజుల వ్యాలిడిటీ, రోజుకు 2GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్, 100 SMSలతో లభించే ఈ ప్రత్యేక ఆఫర్ ఎలా పొందాలో ఇప్పుడు తెలుసుకుందాం..
BSNL New Offer
- బీఎస్ఎన్ఎల్ అదిరిపోయే ఆఫర్.. వెంటనే కొత్త సిమ్ తీసుకోండి
- నెలకు రూ.300 అవసరం లేదు.. కేవలం రూ.51కే రీఛార్జ్ ప్లాన్
- కొత్త సిమ్ ఫ్రీ.. 28 రోజుల పాటు బెనిఫిట్స్..
BSNL New Offer : మొబైల్ రీఛార్జ్ ధరలు రోజురోజుకూ పెరుగుతున్నాయి. నెలనెలా ఫోన్‌కు రీఛార్జ్ చేయాలంటేనే సామాన్యులకు అదనపు ఖర్చు అవుతోంది. ఇలాంటి సమయంలో ప్రభుత్వ రంగ టెలికాం సంస్థ బీఎస్ఎన్ఎల్ (BSNL) కొత్త కస్టమర్ల కోసం ఆకర్షణీయమైన ఆఫర్‌ను తీసుకొచ్చింది. కేవలం రూ.51తో 28 రోజుల పాటు మొబైల్ సేవలు పొందే అవకాశం కల్పిస్తోంది. పైగా కొత్త సిమ్ కార్డును కూడా ఫ్రీగా అందిస్తోంది… అది ఎలాగో ఇప్పుడు చూద్దాం..
ఈ ఆఫర్లో కొత్తగా బీఎస్ఎన్ఎల్ నెట్‌వర్క్‌లోకి వచ్చే కస్టమర్లకు అనేక బెనిఫిట్స్ లభిస్తాయి. రూ.51 చెల్లించి ఈ ప్యాకేజీ తీసుకుంటే 28 రోజుల వ్యాలిడిటీతో పాటు ప్రతిరోజూ 2GB హైస్పీడ్ డేటా పొందవచ్చు. ఇంటర్నెట్ వాడకంతో పాటు ఫోన్ కాల్స్ ఎక్కువగా మాట్లాడేవారికి కూడా బాగుంటుంది.
ఇక కాలింగ్ విషయానికి వస్తే.. :
దేశంలోని ఏ నెట్‌వర్క్‌కైనా అన్లిమిటెడ్ వాయిస్ కాల్స్ చేసుకోవచ్చు. రోజుకు 100 SMS కూడా పొందవచ్చు. చౌకైన ధరకే కాల్స్, డేటా, మెసేజ్‌లు పొందవచ్చు.
ముఖ్యంగా ఇతర టెలికాం కంపెనీల నుంచి బీఎస్ఎన్ఎల్కు నంబర్ పోర్ట్ చేయాలనుకునేవారికి ఈ ఆఫర్ అద్భుతంగా ఉంటుంది. తక్కువ ధరలో కొత్త కనెక్షన్ తీసుకోవాలనుకునే వారికి కూడా సూపర్ ఆఫర్..
అయితే, ఈ ఆఫర్‌కు గడువు ఉంది. 2026 నవంబర్ 30 వరకు మాత్రమే ఉంటుంది. ఆసక్తి ఉన్నవారు దగ్గరలోని బీఎస్ఎన్ఎల్ కస్టమర్ సర్వీస్ సెంటర్‌ను సంప్రదించాలి. మీ ప్రాంతాన్ని బట్టి ఆఫర్ నిబంధనలు మారే అవకాశం ఉన్నందున రీఛార్జ్ చేసే ముందు అన్ని వివరాలు చెక్ చేసుకోండి..
