RC 17 : సుక్కు, చర్రీ.. తెలంగాణ రూటెడ్ స్టోరీ..!?
త్వరలో స్టార్ట్ కాబోయే రామ్‌చరణ్, సుకుమార్ సినిమాపై (RC 17) కూడా లేటెస్ట్ గాసిప్ ఒకటి చక్కర్లు కొడుతోంది.
Ram Charan And Sukumar Movie Update RC17
RC 17 : కొంతకాలంగా టాలీవుడ్లో తెలంగాణ నేపథ్యం ఉన్న సినిమాలను ఎక్కువగా చూస్తున్నాం. బలగం, దసరా, లేటెస్ట్గా ఎల్లమ్మ, ఇడుపు కాగితం.. ఇవ్వే కాదు ఓటీటీల్లో రిలీజ్ అయిన తెలంగాణ బేస్డ్ సినిమాలెన్నో. ఇలా తెలంగాణ రూటెడ్ స్టోరీస్ మీద ఫోకస్ పెరుగుతోందనే టాక్ ఇండస్ట్రీలో గట్టిగా వినిపిస్తోంది.
ఈ మధ్య హిట్ అయిన కొన్ని సినిమాలు తెలంగాణ బ్యాక్‌డ్రాప్‌లో ఉండటంతో, మేకర్స్ కూడా అదే ట్రెండ్‌ను ఫాలో అవుతున్నారు. చిన్న సినిమాల నుంచి పెద్ద స్టార్ హీరోల ప్రాజెక్ట్స్ వరకు తెలంగాణ నేటివిటీ, స్లాంగ్, కల్చర్‌కు ప్రాధాన్యం ఇచ్చే కథలపై చర్చలు జరుగుతున్నాయట. ఆడియన్స్ కూడా తెలంగాణ నేటివిటీకి కనెక్ట్ అవుతుండటంతో మేకర్స్ థింకింగ్ కూడా మారిందంటున్నారు.
Maanasa Choudhary : సూపర్ సుబ్బు వర్కింగ్ స్టిల్స్‌ను షేర్ చేసిన మానస చౌదరి
త్వరలో స్టార్ట్ కాబోయే రామ్‌చరణ్, సుకుమార్ సినిమాపై కూడా లేటెస్ట్ గాసిప్ ఒకటి చక్కర్లు కొడుతోంది. ఈ మూవీ కూడా తెలంగాణ నేపథ్యంలో పక్కా రూటెడ్ స్టోరీగా ఉండబోతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే పెద్ది సినిమా ఉత్తరాంధ్ర బ్యాక్‌డ్రాప్‌లో వచ్చిన నేపథ్యంలో, చరణ్ మళ్లీ ఇలా తెలంగాణా నేటివిటీకి షిఫ్ట్ అవుతాడా లేదా అన్నది ఆసక్తిగా మారింది. అయితే ఈ విషయం పై ఎలాంటి అధికారిక క్లారిటీ లేకపోవడంతో, ఇది నిజమా లేక రూమర్స్ మాత్రమేనా అన్నది తెలియాల్సి ఉంది.
