PM Narendra Modi : దేశ సంస్కృతి, సంప్రదాయాలను ద్వేషించేవారు దేశానికి పెద్ద శత్రువులు : ప్రధాని నరేంద్ర మోదీ
PM Modi Attended Vijayadashami Celebrations : రామరాజ్యం అంటే ఎలాంటి వివక్ష లేకుండా ప్రతి ఒక్కరికీ న్యాయం, సమాన అవకాశాలు కల్పించే పాలన అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
PM Narendra Modi Attended Dussehra celebrations
PM Modi Attended Vijayadashami Celebrations : రామరాజ్యం అంటే ఎలాంటి వివక్ష లేకుండా ప్రతి ఒక్కరికీ న్యాయం, సమాన అవకాశాలు కల్పించే పాలన అని ప్రధాని నరేంద్ర మోదీ పేర్కొన్నారు. అధికారంలో ఉండటమే పాలన లక్ష్యం కాదని, ప్రజల సంక్షేమమే ప్రధాన ఉద్దేశమని స్పష్టం చేశారు. విజయదశమి సందర్భంగా మంగళవారం ఢిల్లీలోని ఇంద్రప్రస్థ రామ్లీలా మైదానంలో జరిగిన దసరా వేడుకల్లో పాల్గొన్న ప్రధాని.. శ్రీరాముడి ఆదర్శాలు, దేశ స్వావలంబన, పేదల సంక్షేమం గురించి మాట్లాడారు
#WATCH | Delhi: Ravan Dahan is being performed at IP Extension in East Delhi on the occasion of #Dussehra.
PM Narendra Modi attended the Dussehra celebrations here.
(Source: DD News) https://t.co/ODKvGqvmj1
— ANI (@ANI) October 20, 2026
ప్రధాని నరేంద్ర మోదీ మాట్లాడుతూ.. ‘‘రామరాజ్యం అంటే వివక్షకు తావులేని పాలనా వ్యవస్థ. అక్కడ న్యాయం అందరికీ అందుతుంది. ప్రతి ఒక్కరికీ సమాన అవకాశాలు లభిస్తాయి. అలాంటి పాలనలో అధికారం ఉద్దేశం కేవలం పాలించడం మాత్రమే కాదు.. ప్రజల సంక్షేమాన్ని నిర్ధారించడం కూడా. పేదలు, సమాజంలోని అణగారిన వర్గాల సంక్షేమానికి అత్యున్నత ప్రాధాన్యం ఇవ్వాలి. శ్రీరాముడి జీవితం మనకు ఒక గొప్ప పాఠాన్ని నేర్పిస్తుంది. సంక్షోభం ఎంత పెద్దదైనా, సవాలు ఎంత క్లిష్టమైనదైనా మనం ఇతరులపై ఆధారపడకూడదు. మనలోని సామర్థ్యాన్ని గుర్తించాలి. మన వనరులపై నమ్మకం ఉంచాలి. మన సంకల్పాన్ని శక్తిగా మార్చుకోవాలి. స్వయంకృషితో సమస్యలకు పరిష్కారాలను కనుగొనాలి. నేడు మనం కూడా ఇదే స్ఫూర్తితో ముందుకు సాగాలి. వికసిత్ భారత్ (అభివృద్ధి చెందిన భారత్), ఆత్మనిర్భర్ భారత్ (స్వావలంబన భారత్) నిర్మాణమే మన ముందున్న లక్ష్యాలు.” అని ప్రధాని మోదీ అన్నారు.
#WATCH | Delhi: At the #Dussehra celebrations, Prime Minister Narendra Modi says, “Ramrajya signifies a system of governance free from discrimination—a realm where justice prevails, and everyone is afforded equal opportunities. In such a system, the purpose of authority is not merely to rule, but to ensure the welfare of the people… Serving the poor and the marginalized must remain our highest priority. The life of Lord Ram offers us a profound lesson: no matter how great the crisis or how daunting the challenge, we must not rely on others. We must recognise our own potential, trust in our own resources, transform our resolve into strength, and forge solutions through our own hard work… Today, we too must move forward, guided by this very mantra. We have set before us the goals of a Viksit Bharat and an Atmanirbhar Bharat…”
(Source: DD News)
— ANI (@ANI) October 20, 2026
మన సంస్కృతిని ద్వేషించే వారి మానసికత ఈ దేశానికి శత్రువు. విజయదశమి శుభ పర్వదినం సందర్భంగా మనం మన సంకల్పాన్ని మరోసారి పునరావృతం చేయాలి. మనం భారతమాత శత్రువులను గుర్తించాలి, వారిని ఓడించాలి. ఇండియా ఫస్ట్ అనే సంకల్పాన్ని తీసుకుంటూ అందరం కలిసికట్టుగా ముందుకు సాగాలి. అయోధ్య మందిరంలో ప్రాణప్రతిష్ఠ మహోత్సవం సందర్భంగా ‘రామ్ సే రాష్ట్రీయ’, ‘దేవ్ సే దేశ్’ అనే భావనతో మనం చేసిన సంకల్పాన్ని కచ్చితంగా నెరవేరుస్తామని ప్రధాని నరేంద్ర మోదీ అన్నారు.
