Personal Loan : శాలరీ స్లిప్ లేకున్నా పర్సనల్ లోన్ వస్తుందా? అప్లయ్ చేసే ముందు జాగ్రత్త.. బ్యాంకులు చూసేది ఇవే..!
Personal Loan : శాలరీ స్లిప్ లేకుండా పర్సనల్ లోన్ పొందవచ్చా? ఇన్ కమ్ ప్రూఫ్‌కు ప్రత్యామ్నాయాలేంటి? క్రెడిట్ స్కోర్, రుణ అర్హతలు, మోసపూరిత లోన్ యాప్‌లపై ఓసారి లుక్కేయండి..
Personal Loan Without Salary Slip
- జీతం స్లిప్ లేకుండానే పర్సనల్ లోన్ పొందవచ్చా?
- ఆదాయ రుజువు లేకుండా పర్సనల్ లోన్ కావాలా?
- అప్లయ్ చేసే ముందు ఇవి తప్పక తెలుసుకోండి
Personal Loan : ఆకస్మికంగా డబ్బు అవసరమైతే చాలామంది పర్సనల్ లోన్ (Personal Loan) వైపు మొగ్గు చూపుతారు. అయితే, శాలరీ స్లిప్ లేదా ఆదాయ ప్రూఫ్ లేకపోతే పర్సనల్ లోన్ లభిస్తుందా? అనే సందేహం చాలామందిలో ఉంటుంది.
నిజానికి, శాలరీ స్లిప్ లేకపోయినా కొన్ని సందర్భాల్లో పర్సనల్ లోన్ పొందే అవకాశం ఉంది. అయితే, బ్యాంకు నిబంధనలు, మీ ఆర్థిక పరిస్థితి, క్రెడిట్ హిస్టరీ అనేది మీ లోన్ అప్రూవల్‌పై ఆధారపడి ఉంటుంది. పూర్తి వివరాలను ఓసారి పరిశీలిద్దాం..
జీతం స్లిప్ లేకపోతే లోన్ ఎలా పొందాలి? :
సాధారణంగా బ్యాంకులు వ్యక్తిగత రుణం మంజూరు చేసే ముందు దరఖాస్తుదారుడి ఆదాయం, ఉద్యోగ స్థిరత్వం, గత రుణ చెల్లింపులు వంటి అంశాలను పరిశీలిస్తాయి. ఇందుకోసం శాలరీ స్లిప్‌లు, బ్యాంక్ స్టేట్మెంట్లు, ఆదాయపు పన్ను రిటర్నులు (ITR) వంటి డాక్యుమెంట్లను అడుగుతాయి.
మీ దగ్గర శాలరీ స్లిప్ లేకపోతే, బ్యాంక్ ఖాతాలో జరిగే లావాదేవీలు, ఆదాయం డిపాజిట్, వ్యాపారానికి సంబంధించిన డాక్యుమెంట్లు, క్రెడిట్ స్కోర్ ఆధారంగా మీ ఫైనాన్షియల్ స్టేటస్ అంచనా వేయవచ్చు. అయితే, ఇవన్నీ ప్రతి బ్యాంకు అంగీకరిస్తుందని చెప్పలేం. రుణదాత నిబంధనలను బట్టి నిర్ణయం మారుతుంది.
Read Also : Multiple Credit Cards : మల్టిపుల్ క్రెడిట్ కార్డులు వాడుతున్నారా? ఈ తప్పు అస్సలు చేయకండి!
క్రెడిట్ స్కోర్ కీలకం :
మీ క్రెడిట్ హిస్టరీ బాగుంటే లోన్ పొందే అవకాశాలు ఎక్కువే.. ఇప్పటికే ఉన్న ఈఎంఐలు, క్రెడిట్ కార్డు బకాయిలు, గతంలో రుణాలను సకాలంలో చెల్లించారా లేదా అనే అంశాలను కూడా బ్యాంకులు పరిశీలిస్తాయి. మీ సమ్మతితో అకౌంట్ అగ్రిగేటర్ సర్వీసుల ద్వారా ఆర్థిక సమాచారాన్ని వెరిఫై చేసే ఛాన్స్ కూడా ఉంటుంది.
మోసపూరిత రుణ యాప్‌లతో జాగ్రత్త :
ఎలాంటి డాక్యుమెంట్లు, వెరిఫికేషన్ అవసరం లేదంటూ ఇన్ స్టంట్ లోన్ ఇస్తామని చెప్పే యాప్‌లను గుడ్డిగా నమ్మకండి. లోన్ తీసుకునే ముందు ఆ సంస్థ విశ్వసనీయత, వడ్డీ రేటు, ప్రాసెసింగ్ ఫీజులు, ఇతర ఛార్జీలను చెక్ చేయండి.
రుణదాత ఆర్బీఐ నియంత్రణలో ఉన్న బ్యాంకు లేదా సంబంధిత నిబంధనలకు లోబడి పనిచేసే సంస్థనా అనేది చెక్ చేసుకోండి. శాలరీ స్లిప్ లేకపోవడం వల్లనే లోన్ రిజెక్ట్ అవుతుందని కాదు.. సరైన ఆర్థిక రికార్డులు, మంచి క్రెడిట్ హిస్టరీ, రీపేమెంట్ సామర్థ్యం వంటివి రుణ ఆమోదంలో కీలక పాత్ర పోషిస్తాయి.
