APSRTC Privatization: ఆర్టీసీ ఉద్యోగులకు గుడ్ న్యూస్.. సర్కార్ కీలక ప్రకటన.. ఆ వార్తలు నమ్మకండి
APSRTC Privatization: ఏపీఎస్ఆర్టీసీ సంస్థను ప్రైవేటుపరం చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని రవాణాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు (MT Krishna Babu)స్పష్టం చేశారు.
MT Krishna Babu key remarks regarding APSRTC privatization
- ఆర్టీసీ ప్రైవేటీకరణ ఆలోచన లేదు
- వస్తున్నాయి ఏడువందల యాభై బస్సులు
- ఉద్యోగులకు పూర్తి ఉద్యోగ భద్రత
APSRTC Privatization: ఏపీఎస్ఆర్టీసీ ప్రైవేటీకరణపై వస్తున్న వార్తలను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తీవ్రంగా ఖండించింది. సంస్థను ప్రైవేటుపరం చేసే ఆలోచన ప్రభుత్వానికి లేదని రవాణాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి ఎంటీ కృష్ణబాబు (MT Krishna Babu) స్పష్టం చేశారు. రాష్ట్ర సచివాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఆర్టీసీ ఆస్తులను విక్రయించడం కానీ, లీజుకు ఇవ్వడం కానీ చేయడం లేదని, సంస్థపై జరుగుతున్న దుష్ప్రచారాన్ని ప్రజలు, సిబ్బంది నమ్మవద్దని కోరారు.
Also Read – ఇతను కదా రియల్ హీరో.. ప్రాణాలకు తెగించి.. పట్టాల మీదకు దూకి.. షాకింగ్ వీడియో వైరల్
కేంద్ర ప్రభుత్వ విధానాలకు అనుగుణంగానే రాష్ట్రంలో పీఎం ఈ-బస్ సేవా స్కీమ్ కింద 11 నగరాల్లో 750 ఎలక్ట్రిక్ బస్సులను ప్రవేశపెడుతున్నట్లు ఆయన వెల్లడించారు. దీనివల్ల రాష్ట్రానికి ప్రోత్సాహకాల రూపంలో రూ.1,774 కోట్లు వస్తాయని తెలిపారు. ఈ సరికొత్త ఎలక్ట్రిక్ బస్సులకు డ్రైవర్లుగా ఆర్టీసీ ఉద్యోగులే వ్యవహరిస్తారని, సంస్థలోని ఏ ఒక్క సిబ్బందినీ తొలగించే ప్రసక్తే లేదని ఆయన స్పష్టమైన హామీ ఇచ్చారు.
ఆర్టీసీ ఉద్యోగులందరికీ పూర్తి ఉద్యోగ భద్రత కల్పిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. సిబ్బంది జీతభత్యాలతో పాటు ప్రభుత్వ ప్రతిష్టాత్మక పథకాలైన ‘స్త్రీశక్తి’, ‘దివ్యాంగ శక్తి’ ఉచిత ప్రయాణాల ఆర్థిక భారాన్ని పూర్తిగా ప్రభుత్వమే భరిస్తుందని కృష్ణబాబు వివరించారు. ఈ నిర్ణయంతో ఆర్టీసీ భవిష్యత్తుపై ఉద్యోగుల్లో నెలకొన్న ఆందోళనలకు తెరపడింది.
