APPSC Notification: APPSC నుంచి మరో నోటిఫికేషన్.. AEE పోస్టులకు దరఖాస్తులు, రూ.1.47 లక్షల జీతం.. పూర్తి వివరాలు ఇవే!
ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC Notification) నిరుద్యోగ అభ్యర్థులకు మరొక బంపర్ ఆఫర్ అందించింది.
Appsc aee recruitment notification released for 40 posts apply online
APPSC Notification: ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (APPSC) నిరుద్యోగ అభ్యర్థులకు మరొక బంపర్ ఆఫర్ అందించింది. పొల్యూషన్ కంట్రోల్ బోర్డులో ఖాళీగా ఉన్న అసిస్టెంట్ ఎన్విరాన్మెంటల్ ఇంజినీర్ (AEE) ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తూ అధికారిక నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ రిక్రూట్మెంట్ ద్వారా మొత్తం 40 పోస్టులను భర్తీ చేయనున్నారు. సంబంధిత విభాగంలో ఇంజినీరింగ్ డిగ్రీ పూర్తి చేసిన అభ్యర్థులు ఈ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. ఎంపికైన వారికి నెలకు రూ.57,100 నుంచి రూ.1,47,760 వరకు ఆకర్షణీయమైన వేతనం లభిస్తుంది.
పరీక్షా విధానం – ఎంపిక ప్రక్రియ వివరాలు:
ఈ పోస్టుల ఎంపిక కోసం సింగిల్ లెవెల్ కంప్యూటర్ బేస్డ్ రిక్రూట్మెంట్ టెస్ట్ నిర్వహిస్తారు. ఈ రాత పరీక్షలో రెండు పేపర్లు ఉంటాయి. పేపర్-1లో జనరల్ స్టడీస్, మెంటల్ ఎబిలిటీ ప్రశ్నాపత్రం ఉండగా, పేపర్-2లో కామన్ సబ్జెక్ట్ ప్రశ్నలు ఉంటాయి. ప్రతి తప్పు సమాధానానికి 1/3 వంతు నెగెటివ్ మార్కింగ్ వర్తిస్తుంది. ఈ నియామకంలో ఎటువంటి స్క్రీనింగ్ టెస్ట్ ఉండదు. రాత పరీక్షలో మెరిట్ సాధించిన అభ్యర్థులు కంప్యూటర్ ప్రొఫిషియెన్సీ టెస్ట్ లో కూడా అర్హత సాధించాల్సి ఉంటుంది.
ఆన్లైన్ దరఖాస్తు తేదీలు – చివరి తేది ఎప్పుడంటే?
అర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థులు APPSC(APPSC Notification) అధికారిక వెబ్సైట్ ద్వారా మాత్రమే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. ఆన్లైన్ దరఖాస్తు ప్రక్రియ అక్టోబర్ 6, 2026న ప్రారంభమవుతుంది. దరఖాస్తు దాఖలు చేయడానికి అక్టోబర్ 27, 2026 రాత్రి 11:59 గంటల వరకు గడువు ఇచ్చారు. దరఖాస్తులు చేసుకునే ముందు అభ్యర్థులు వయోపరిమితి, ఫీజు, పూర్తి సిలబస్ కోసం అధికారిక నోటిఫికేషన్ను పరిశీలించాలని కమిషన్ సూచించింది.
