CM Chandrababu: డబుల్ ఇంజిన్ సర్కార్ జెట్ స్పీడ్.. పల్లెల ప్రగతికి రూ.11,085 కోట్ల నిధులు.. ఉదయగిరి సభలో సీఎం కీలక వ్యాఖ్యలు!
కేంద్ర ప్రభుత్వ సహకారంతో ఆంధ్రప్రదేశ్ అభివృద్ధిపథంలో దూసుకుపోతోందని ముఖ్యమంత్రి చంద్రబాబు(CM Chandrababu) స్పష్టం చేశారు.
andhra pradesh cm chandrababu naidu pawan kalyan launch palle panduga 3 0 in nellore
CM Chandrababu: కేంద్ర ప్రభుత్వ సంపూర్ణ సహకారం, అండదండలతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అభివృద్ధిపథంలో శరవేగంగా దూసుకుపోతోందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గ పరిధిలోని రామాపురంలో అత్యంత వైభవంగా నిర్వహించిన ‘పల్లె పండుగ 3.0’ ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్‌లతో కలిసి సీఎం పాల్గొన్నారు. డబుల్ ఇంజిన్ సర్కార్ ఆధ్వర్యంలో రాష్ట్రం జెట్ వేగంతో పురోగమిస్తోందని, గ్రామీణ ప్రాంతాల స్వరూపాన్ని మార్చేందుకే ఈ భారీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టామని పేర్కొన్నారు.
KTR: రూ. 3,800 బొగ్గు వద్దని రూ. 9,000 బొగ్గా? ఇది తుగ్లక్ నిర్ణయం.. జెన్కో నిర్ణయంపై కేటీఆర్ ఫైర్
గ్రామీణాభివృద్ధికి రూ.11,085 కోట్లు – పవన్ కల్యాణ్‌పై సీఎం ప్రశంసలు:
గ్రామాల సమగ్ర ప్రగతిని కాంక్షిస్తూ ‘పల్లె పండుగ 3.0’ ద్వారా ఏకంగా రూ.11,085 కోట్ల భారీ నిధులను కేటాయిస్తున్నట్లు ముఖ్యమంత్రి(CM Chandrababu) ప్రకటించారు. ప్రతి పల్లెలోనూ సిమెంట్ రోడ్లు, డ్రైనేజీ వ్యవస్థ, వీధిలైట్లు, రక్షిత తాగునీరు వంటి మౌలిక సదుపాయాలను వేగవంతంగా ఏర్పాటు చేస్తున్నామని తెలిపారు. గ్రామీణాభివృద్ధి, పంచాయతీరాజ్ శాఖల మంత్రిగా పవన్ కల్యాణ్ శాఖా పరంగా విప్లవాత్మక మార్పులు తీసుకొచ్చారని, క్షేత్రస్థాయిలో నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ గ్రామాల్లో కొత్త వెలుగులు నింపుతున్నారని కొనియాడారు.
ఉదయగిరిని పండ్లతోటల హబ్‌గా మారుస్తాం – పేదరిక నిర్మూలనే ధ్యేయం:
ఉదయగిరి ప్రాంతం నుంచి గ్రామీణ నవోదయానికి నాంది పలికామని, త్వరలోనే ఈ నియోజకవర్గాన్ని రాష్ట్రంలోనే అతిపెద్ద పండ్లతోటల హబ్‌గా తీర్చిదిద్దుతామని చంద్రబాబు హామీ ఇచ్చారు. గత పాలకుల హయాంలో గ్రామాలు ఎదుర్కొన్న దారుణమైన పరిస్థితులను ప్రజలంతా ఒకసారి గుర్తుచేసుకోవాలని సూచించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక గ్రామాల్లో ఆర్థిక అసమానతలను తొలగించి పేదరికాన్ని నిర్మూలించడమే లక్ష్యంగా అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను అమలు చేస్తున్నామని వివరించారు.
హామీలు నెరవేర్చాం – స్థానిక సంస్థల్లోనూ అండగా నిలవాలి:
ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ కచ్చితంగా నిలబెట్టుకున్నామని, ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికీ సూపర్‌సిక్స్ పథకాలను సమర్థవంతంగా అమలు చేస్తున్నామని చెప్పారు. ‘తల్లికి వందనం’, ‘స్త్రీశక్తి’ వంటి పథకాల ద్వారా మహిళలకు ఆర్థికంగా కొండంత అండగా నిలిచామని గుర్తుచేశారు. మాట ఇచ్చిన విధంగానే సంక్షేమాన్ని అందిస్తున్న తమ కూటమి ప్రభుత్వానికి రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ ప్రజలంతా పూర్తిస్థాయిలో అండగా నిలవాలని సీఎం చంద్రబాబు పిలుపునిచ్చారు.
