Landlords Murder: మందు తాగొద్దన్నందుకు ఇంటి యజమాని హత్య.. మృతదేహంతో సెల్ఫీ వీడియో తీసుకున్న నిందితుడు

తన ఇంట్లో అద్దెకుండే వ్యక్తిని తాగి ఇంటికి రావొద్దని హెచ్చరించాడు యజమాని. దీంతో కక్ష పెంచుకున్న అతడు, యజమానిని హత్య చేశాడు. అనంతరం మృతదేహంతో సెల్ఫీ వీడియో తీసుకుని, పరారయ్యాడు.

Landlords Murder: తన ఇంట్లో మందు తాగొద్దన్నందుకు ఇంటి యజమానినే హత్య చేశాడు అద్దెకుంటున్న వ్యక్తి. ఈ ఘటన ఢిల్లీలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బిహార్‌కు చెందిన పంకజ్ కుమార్ అనే వ్యక్తి ఇటీవల ఢిల్లీలోని సురేష్ అనే వ్యక్తి ఇంట్లో అద్దెకు దిగాడు. అయితే, పంకజ్ రోజూ తాగి వస్తుండేవాడు. ఇటీవల కూడా అలాగే తాగి రావడంతో సురేష్.. దీనిపై పంకజ్‌ను ప్రశ్నించాడు. దీంతో ఇద్దరిమధ్యా వాగ్వాదం జరిగింది.

MLAs son-in-law: ఆర్థిక ఇబ్బందులు, కుటుంబ కలహాలతో ఎమ్మెల్యే అల్లుడు ఆత్మహత్య

ఈ సందర్భంగా పంకజ్‌ను సురేష్ తీవ్రంగా అవమానించాడు. చివరకు పంకజ్.. సురేష్‌కు క్షమాపణ చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. దీంతో కక్ష పెంచుకున్న పంకజ్, ఇటీవల సురేష్‌ను హత్య చేశాడు. సురేష్ తలపై సుత్తితో కొట్టడంతో అక్కడికక్కడే అతడు ప్రాణాలు కోల్పోయాడు. సురేష్ మరణించిన తర్వాత పంకజ్, అతడి మృతదేహంతో సెల్ఫీ తీసుకున్నాడు. ఒక వీడియో కూడా తీసుకున్నాడు. తర్వాత అక్కడ్నుంచి పారిపోయాడు. ఈ సందర్భంగా సురేష్ మొబైల్ ఫోన్, ఐడీ కార్డు, ఇతర వస్తువుల్ని కూడా తీసుకెళ్లాడు. మరుసటి రోజు సురేష్ కొడుకు జగదీష్‌కు ఫోన్ చేశాడు. తాను ఇంటి నుంచి వెళ్లిపోతున్నానని, సురేష్ తనను తిట్టడం వల్ల బాధ కలిగిందని, వాటిని భరించలేకపోతున్నానని చెప్పాడు.

Survey: పురుషులకంటే మహిళలకే శృంగార భాగస్వాములు ఎక్కువ… తెలుగు రాష్ట్రాల్లో మాత్రం..

అయితే, అతడి మాటలు విన్న తర్వాత అనుమానం వచ్చిన జగదీష్.. తన తండ్రి ఉంటున్న పై అంతస్తుకు వెళ్లి చూశాడు. అప్పటికే అతడు చనిపోయి ఉన్నాడు. వెంటనే జగదీష్ పోలీసులకు సమాచారం అందించాడు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు సురేష్ మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, పోస్టుమార్టమ్ కోసం ఆస్పత్రికి తరలించారు. నిందితుడిని పట్టుకునేందుకు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. 24 గంటల్లోనే పోలీసులు నిందితుడిని పట్టుకున్నారు.

 

ట్రెండింగ్ వార్తలు