Chennai Metro Recruitment
Chennai Metro Recruitment : చెన్నై కేంద్రంగా ఉన్న మెట్రో రైల్ లిమిటెడ్ (సీఎంఆర్ ఎల్)లో పలు పోస్టుల భర్తీ చేపట్టనున్నారు. ఈ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 17 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి, అర్హత కలిగిన అభ్యర్ధుల నుండి దరఖాస్తులు కోరుతున్నారు.
READ ALSO : Kafal Fruit : ఉత్తరాఖండ్ అడవి పండు బేబెర్రీ ఆరోగ్య ప్రయోజనాలు… ఉపయోగాలు !
ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, రోలింగ్ స్టాక్, పవర్ సిస్టమ్స్ తదితర విభాగాల్లో ఈ ఖాళీలు ఉన్నాయి. భర్తీ చేయనున్న పోస్టుల్లో జనరల్ మేనేజర్, జాయింట్ జనరల్ మేనేజర్, మేనేజర్, డిప్యూటీ జనరల్ మేనేజర్ తదిర పోస్టులు ఉన్నాయి.
READ ALSO : Cholesterol : కొలెస్ట్రాల్ అధికంగా ఉండే ఆహారాలు తినటం అనారోగ్యకరమా? వాస్తవాలు, అపోహలు..
దరఖాస్తుచేసుకునే అభ్యర్ధుల విషయానికి వస్తే పోస్టును అనుసరించి సంబంధిత స్పెషలైజేషన్ లో బీఈ, బీటెక్, సీఏ, ఎంబీఏ ఉత్తీర్ణత సాధించి ఉండాలి. అభ్యర్ధుల వయస్సు 30 నుండి 55 సంవత్సరాల లోపు ఉండాలి. పని అనుభవం కలిగి ఉండాలి.
READ ALSO : High Yielding Rice Varieties : రైతులకు అందుబాటులో నూతన వరి రకాలు
అభ్యర్ధుల ఎంపిక ఇంటర్వ్యూ అధారంగా ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు వేతనంగా 60,000రూ నుండి 2.3లక్షలు చెల్లిస్తారు. అభ్యర్ధులు ఆన్ లైన్ లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునేందుకు 4 ఆగస్టు 2023 తుదిగడువుగా నిర్ణయించారు. పూర్తి వివరాలకు వెబ్ సైట్ ; https://chennaimetrorail.org/ పరిశీలించగలరు.