Indian Bank Apprentice Posts : ఇండియన్ బ్యాంక్ అప్రెంటీస్ రిక్రూట్‌మెంట్.. 1500 పోస్టులకు దరఖాస్తు చేసుకోండి.. పూర్తి వివరాలివే..!

Indian Bank Apprentice Recruitment 2024 : అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులను ఆన్‌లైన్ రాత పరీక్ష, స్థానిక భాషా నైపుణ్యం పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. సాధారణ ఇంగ్లీషు మినహా ప్రధాన ప్రాంతీయ భాషలలో పరీక్ష నిర్వహిస్తారు.

Indian Bank Apprentice Recruitment 2024 ( Image Source : Google )

Indian Bank Apprentice Recruitment 2024 : ఇండియన్ బ్యాంక్ అప్రెంటీస్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది. అర్హత గల అభ్యర్థులు ఇండియన్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్ (indianbank.in) ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ రిక్రూట్‌మెంట్ డ్రైవ్ సంస్థలో 1500 అప్రెంటీస్ పోస్టులను భర్తీ చేస్తుంది. రిజిస్ట్రేషన్ ప్రక్రియ ఈరోజు (జూలై 10న) ప్రారంభమైంది. జూలై 31, 2024న దరఖాస్తు ప్రక్రియ ముగుస్తుంది. అర్హత, ఎంపిక ప్రక్రియతో పాటు ఇతర వివరాలు ఈ కింది విధంగా ఉన్నాయి.

అర్హత :
పోస్టులకు దరఖాస్తు చేసుకోవాలనుకునే అభ్యర్థులు గుర్తింపు పొందిన యూనివర్శిటీ నుంచి ఏదైనా విభాగంలో గ్రాడ్యుయేట్ డిగ్రీని లేదా కేంద్ర ప్రభుత్వంచే గుర్తించిన ఏదైనా సమానమైన అర్హతలను కలిగి ఉండాలి. అభ్యర్థులు 31.03.2020 తర్వాత గ్రాడ్యుయేషన్ పూర్తి చేసి ఉత్తీర్ణత సర్టిఫికేట్ కలిగి ఉండాలి. అభ్యర్థి వయస్సు పరిమితి 20 నుంచి 28 ఏళ్ల మధ్య ఉండాలి. అయితే, ప్రభుత్వం ప్రకారం.. SC/ST/OBC/PWBD మొదలైన కేటగిరీలకు గరిష్ట వయోపరిమితిలో సడలింపు ఉంటుంది.

ఎంపిక ప్రక్రియ :
అప్రెంటీస్ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులను ఆన్‌లైన్ రాత పరీక్ష, స్థానిక భాషా నైపుణ్యం పరీక్ష ద్వారా ఎంపిక చేస్తారు. సాధారణ ఇంగ్లీషు మినహా ప్రధాన ప్రాంతీయ భాషలలో (బ్యాంక్ నిర్ణయించినట్లుగా) పరీక్ష నిర్వహిస్తారు. అది ఇంగ్లీష్‌‌లోనే ఉంటుంది. ఆబ్జెక్టివ్ పరీక్షల్లో తప్పు సమాధానాలకు నెగెటివ్ మార్కులు వస్తాయి.

ప్రతి ప్రశ్నకు కేటాయించిన మార్కులో నాల్గవ వంతు ప్రతి తప్పు సమాధానానికి తొలగిస్తారు. పరీక్షకు సంబంధించిన కాల్ లెటర్‌లు అభ్యర్థులకు ఇమెయిల్ ద్వారా లేదా బ్యాంక్ వెబ్‌సైట్ లేదా https://apprenticeshipindia.org/ లేదా https://nsdcindia.org/apprenticeship లేదా http://bfsissc.com ద్వారా జారీ అవుతాయి.

దరఖాస్తు రుసుము :
జనరల్/ ఓబీసీ/ ఈడబ్ల్యూఎస్ కేటగిరీకి దరఖాస్తు రుసుము రూ. 500/, ఎస్సీ/ఎస్టీ/పీడబ్ల్యూబీడీ కేటగిరీ అభ్యర్థులకు దరఖాస్తు రుసుము చెల్లింపు నుంచి మినహాయింపు ఉంది. దరఖాస్తు ఫీజు/ఇంటిమేషన్ ఛార్జీల ఆన్‌లైన్ పేమెంట్ కోసం అభ్యర్థి బ్యాంక్ లావాదేవీ ఛార్జీలను భరించాల్సి ఉంటుంది. ఫీజును ఆన్‌లైన్‌లో చెల్లించాలి. మరిన్ని వివరాల కోసం అభ్యర్థులు ఇండియన్ బ్యాంక్ అధికారిక వెబ్‌సైట్‌ను చెక్ చేయవచ్చు.

Read Also : AI Taking Over Jobs : కృత్రిమ మేధతో ఉద్యోగాల వెల్లువ.. ఏఐపై అనవసర భయాలు.. అపోహలు వీడాల్సిందే..!

ట్రెండింగ్ వార్తలు