Telangana : ఇంటర్ విద్యా సంవత్సరం ఖరారు, పరీక్షల తేదీలు

తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ మీడియట్ విద్యా సంవత్సరం (2021-22) ఖరారైంది. ఆన్ లైన్ తరగతులతో కలిసి మొత్తం...220 పని దినాలు ఉన్నాయి.

Telangana Inter : తెలంగాణ రాష్ట్రంలో ఇంటర్ మీడియట్ విద్యా సంవత్సరం (2021-22) ఖరారైంది. ఆన్ లైన్ తరగతులతో కలిసి మొత్తం…220 పని దినాలు ఉన్నాయి. ఇంటర్ పరీక్షల నిర్వహణలో కూడా కీలక మార్పులు చేసింది. హాఫ్ ఇయర్, ప్రి ఫైనల్ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయం తీసుకుంది. దసరా, ఆదివారంతో కలిపి 5 రోజులు, సంక్రాంతికి జనవరి 13వ తేదీ నుంచి 15 వరకు సెలవులుంటాయని వెల్లడించింది. 17వ తేదీన ఆదివారం కావడంతో 18వ తేదీ నుంచి క్లాసులు ప్రారంభం కానున్నాయి.

Read More : Very Funny : ఆడవాళ్ల బ్రాలు, అండర్ వేర్లు ఎత్తుకుపోయిన దొంగ

ముఖ్యమైన తేదీలు ఇలా ఉన్నాయి :-
2021, డిసెంబర్ 13 నుంచి డిసెంబర్ 18వ తేదీ వరకు హాఫ్ ఇయర్ పరీక్షలు
2021, ఫిబ్రవరి 10వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ప్రి ఫైనల్ ఎగ్జామ్స్.
2021, ఫిబ్రవరి 23వ తేదీ నుంచి మార్చి 15వ తేదీ వరకు ఇంటర్ ప్రాక్టికల్స్ పరీక్షలు.

Read More : Reliance : కొత్త వ్యాపారం.. త్వరలో చీరల దుకాణం

– 2021, మార్చి 23వ తేదీ నుంచి ఇంటర్ వార్షిక పరీక్షలు.
2021, మే లాస్ట్ వీక్ లో అడ్వాన్స్ డ్ సప్లిమెంటరీ పరీక్షలు.
2021, ఏప్రిల్ 14వ తేదీ నుంచి మే 31 వరకు వేసవి హాలీడేస్.
2021, జూన్ 01వ తేదీ నుంచి ఇంటర్ కాలేజీలు పున:ప్రారంభం.

ట్రెండింగ్ వార్తలు