Heart Disease : యువతలో గుండె జబ్బులు పెరగడానికి 4 కారణాలు !

యువతలో అధిక రక్తపోటు, మధుమేహం ,అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతున్నాయి. ధూమపానం, పొగాకు వాడకం, మాదకద్రవ్యాల వినియోగం మొదలైన చెడు అలవాట్లు వల్ల గుండె సమస్యలు అధికమవుతున్నాయి.

Heart Disease

Heart Disease : గుండెపోటు అన్నది వృద్ధాప్యంలో ఉన్నవారికి వచ్చే వ్యాధిగా చెప్తుంటారు. ప్రస్తుతం 40 సంవత్సరాల కంటే తక్కువ వయస్సు ఉన్నవారు గుండెపోటుకు గురికావడం చాలా అరుదు. అయితే ఇది ఒకప్పటి మాట. ప్రస్తుతం 30-40 సంవత్సరాల మధ్య వయస్సు గల యువకులు గుండెపోటుతో బాధపడుతున్నారు. ఆరోగ్య నిపుణుల అభిప్రాయం ప్రకారం, ఒత్తిడి, నిశ్చల జీవనశైలి, శారీరక శ్రమ లేకపోవడం, నిద్ర లేకపోవడం వల్ల గుండెపై ప్రభావం పడుతుంది.

READ ALSO : High Blood Pressure : హైబీపీ మీ గుండెను మాత్రమే కాదు.. మూత్రపిండాలు, కాలేయంపై కూడా ప్రభవం చూపిస్తుంది

యువతలో అధిక రక్తపోటు, మధుమేహం ,అధిక కొలెస్ట్రాల్ స్థాయిలు పెరుగుతున్నాయి. ధూమపానం, పొగాకు వాడకం, మాదకద్రవ్యాల వినియోగం మొదలైన చెడు అలవాట్లు వల్ల గుండె సమస్యలు అధికమవుతున్నాయి. వీటిని దూరంగా ఉంచడానికి సమతుల్య జీవనశైలిని అనుసరించడం చాలా ముఖ్యం.

యువకులలో గుండెపోటు వెనుక 4 కారణాలు;

1. మధుమేహం: రక్తంలో అధిక చక్కెర స్థాయిలు రక్తనాళాలను దెబ్బతీస్తాయి, ఇది ధమనులలో కొవ్వు నిక్షేపణకు దారి తీస్తుంది. అడ్డంకులను కలిగిస్తుంది.

2. హైపర్ టెన్షన్ ; గుండె కండరాలను చిక్కగా చేసి, గుండె పనితీరుపై ప్రభావం చూపుతుంది. గుండెపోటు వచ్చే అవకాశాలను పెంచుతుంది.

READ ALSO : Children Heart Health : మీ పిల్లల గుండె ఆరోగ్యం పట్ల ఎలాంటి జాగ్రత్తలు పాటించాలంటే ?

3. ఊబకాయం: అధిక బరువు, ఊబకాయం గుండెకు హానికరం. మద్యం త్రాగడం, క్రమరహిత నిద్ర కారణంగా యువతలో కొవ్వు పేరుకుపోతుంది. ఇలాంటి వారు బరువు తగ్గించుకుని గుండెను కాపాడుకోవడం మంచిది.

4. చెడు అలవాట్లు ; మద్యం సేవించటం, ధూమపానం వంటి అలవాట్లు గుండె ఆరోగ్యంపై తీవ్రమైన ప్రభావం చూపిస్తాయి. గుండె తోపాటు శరీరంలోని ఇతర అవయవాలపైనా వీటి ప్రభావం ఉంటుంది. కాబట్టి యువత ఈ దురల్వాట్లను మానుకోవటం మంచిది. వాటికి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండే గుండెను కాపాడుకోవచ్చు.

ట్రెండింగ్ వార్తలు