Indian-Origin CEO : బరువు తగ్గడం అంటే అంతా ఈజీ కాదు.. శారీరక శ్రమ కన్నా చాలా కష్టమైనది. ఫుడ్ డైట్ నుంచి లైఫ్ స్టైల్ మార్పుల వరకు బరువు తగ్గేందుకు అనేక మార్గాలు ఉన్నాయి. భారత సంతతికి చెందిన ఫైనల్‌మైల్ కన్సల్టింగ్ సహ వ్యవస్థాపకుడు, సీఈఓ అయిన రామ్ ప్రసాద్.. కొన్ని ప్రత్యేకమైన అలవాట్లతో దాదాపు 45 కిలోల బరువు తగ్గారు. బరువు తగ్గడానికి తన అలవాట్లు ఏ విధంగా సాయపడ్డాయో వివరించే పోస్ట్‌ను లింక్డ్‌ఇన్ వేదికగా పోస్టు చేశారు. తన బరువు తగ్గించే ప్రయాణం ఎవరినీ ప్రేరేపించే లక్ష్యంతో లేదని పోస్ట్ ద్వారా తెలిపారు.
Read Also : TVS Apache RTR 160 : కొత్త బైక్ చూశారా? టీవీఎస్ అపాచీ RTR 160 రేసింగ్ ఎడిషన్.. ధర ఎంతో తెలుసా?
“నేను దాదాపు 45 కిలోల (100 పౌండ్లు) తగ్గాను. ఇది ప్రేరణ కలిగించే పోస్ట్ కాదు. నేను ఈ అలవాట్లతో ఫైనల్‌మైల్ కన్సల్టింగ్ (ఎ ఫ్రాక్టల్ కంపెనీ) సహ-వ్యవస్థాపకుడిగా అనేక ప్రాజెక్ట్‌లకు నాయకత్వం వహించాను. నా సొంత ప్రవర్తనను మార్చుకోవడంలో ఈ అభ్యాసాలు ఎంతో ఉపయోగపడ్డాయి. ప్రారంభంలో చాలా కష్టంగా అనిపించేది.
ఈ అలవాట్లతో అనుకున్న విధంగా బరువు తగ్గగలనా? అనే సందేహం కలిగింది. అయినప్పటికీ, ఒకసారి ప్రయత్నించాను. ఫలితాలు ఒకసారి కాకపోయినా రానురాను అద్భుతమైన ఫలితాలను పొందాను” అంటూ లింక్డ్‌ఇన్ పోస్ట్‌లో భారత సంతతి సీఈఓ పేర్కొన్నారు. అప్పుడు తనకు సాయపడిన నాలుగు పద్ధతులను జాబితాగా వివరించాడు.
కొన్ని అంశాలను కూడా ప్రస్తావించాడు. ఒకసారి ఒక అలవాటుగా ప్రయత్నించిన తర్వాత మాత్రమే మరో అలవాటుకు మారాలని ప్రసాద్ చెప్పుకొచ్చారు. రెండు నెలల పాటు డైట్‌లో షుగర్‌ను వాడొద్దు, ఏడాదిపాటు రోజూ గంటపాటు వాకింగ్ చేయడం, నాలుగైదు నెలల పాటు అవసరమైనవి తినడం వంటి అలవాట్లతో తన సమయాన్ని వెచ్చించానని సీఈఓ చెప్పుకొచ్చారు.
రాత్రి భోజనం తినాలనే కోరికలను వాయిదా వేసాను. ఆ రోజు తాను ఎక్కువగా కోరుకున్నది మాత్రమే తిన్నానని ప్రసాద్ రాసుకొచ్చాడు. “ఎక్స్‌ప్లోర్ వర్సెస్ ఎక్స్‌ప్లోయిట్” అనే చివరి అలవాటును ప్రయత్నించే ముందు వివిధ విధానాలను పరీక్షించాలని సూచించారు. కేలరీల పరిమితి విషయంలో కూడా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. సీఈఓ పోస్ట్‌ను షేర్ చేసినప్పటి నుంచి సోషల్ మీడియాలో నెటిజన్ల నుంచి విశేష స్పందన వచ్చింది.
Read Also : Elon Musk Omelettes : అలా అయితే.. వారం పాటు ఆమ్లెట్ తినడమే మానేస్తా: మస్క్ మామ!