Hangover : హ్యోంగోవర్ తగ్గించే పానీయాలు .. దెబ్బకు దిగిపోద్ది

అబ్బా తల పగిలిపోయేంత తలనొప్పి..భరించలేకుండా ఉన్నా..అంటూ హ్యాంగోవర్ బాధితులు పొద్దు పొద్దున్నే లేచి అనే మాట. దీంతో ఏంట్రా రాత్రి తాగింది ఇంకా దిగలేదా..?హ్యాంగోవర్ లోనే ఉన్నావా..అని ఆటపట్టిస్తుంటారు.మరి ఈ హ్యాంగోవర్ తగ్గాలంటే ఈ సింపుల్ చిట్కాలు ఫోలో అయిపోండి..

Hangover with alcohol

Hangover with alcohol : రిలాక్స్ కోసం ఓ పెగ్ వేస్తే ఫరవాలేదంటారు డాక్టర్లు. కానీ అదేపనిగా ఆల్కాహాల్ తాగితే మాత్రం ఆరోగ్యానికి ప్రమాదమేనని హెచ్చరిస్తుంటారు. కూర్చుని అదేపనిగా మద్యం తాగితే హ్యాంగోవర్ తప్పదు.హ్యాంగోవర్ అంటే మద్యం తాగిన తరువాత వచ్చే శఆరీరక, మానసిక ఇబ్బంది. ఇది వచ్చిందంటే ఒక్కొక్కరి గంటా రెండు గంటల్లో ఉపశమనం కలగొచ్చు.మరికొంతమంది రోజంతా ఈ హ్యాంగోవర్ తో ఇబ్బంది పడుతుంటారు. విపరీతమైన తలనొప్పితో నానా తిప్పలు పడాల్సిందే. దీంతో ఏంట్రా రాత్రి తాగింది ఇంకా దిగలేదా..?హ్యాంగోవర్ లోనే ఉన్నావా..అని ఆటపట్టిస్తుంటారు.

పెగ్ మీద పెగ్ వేశారా..?ఇక హ్యాంగోవర్ తగులుకున్నట్లే.. అటువంటి హ్యాంగోవర్‌ నుంచి ఉపశమనం కలగాలంటే కొన్ని పానీయాలు తీసుకోవాలని నిపుణులు సూచిస్తున్నారు. మద్యం ద్వారా వచ్చే ఇబ్బందుల నుంచి ఈ పానీయాలు ఉపశమనం కలిగించటమే కాదు ఆ సమస్యల నుంచి విముక్తిచేస్తాయి. రాత్రి ఫుల్ గా మందుకొట్టి ఉంటే ఉదయం లేవటం ఆలస్యమవుతుంది. అలా ఆలస్యంగా లేచినప్పటినుంచి ఈ హ్యోంగోవర్ ప్రభావం బాగా కనిపిస్తుంది. లేవటం లేవటమే తల పట్టుకుని లేస్తారు. అబ్బా తలనొప్పి..తల పగిలిపోయేంత అంటూ మొహం ఒకలా పెడతారు. అలా హ్యోంగోవర్ సమస్యలో ఉన్నవారికి ఉదయం ఏమీ తినాలని అనిపించదు. కానీ అలా తినకుండా ఉండటం ఏమాత్రం మంచిదికాదని చెబుతున్నారు నిపుణులు. తప్పకుండా బ్రేక్ ఫాస్ట్ తినాలని సూచిచస్తున్నారు.హ్యాంగోవర్ నుంచి బ్రేక్ ఫాస్ట్ ఉపశమనం కలిగిస్తుందని చెబుతున్నారు.
మరి ఏం తినాలి..?

అరటిపండు, పీనట్స్‌ బట్టర్‌ బెటర్..
రాత్రి అధికగా మద్యం తాగటం..దాంతో బాగా లేట్ గా పడుకోవటంతో మెదడుకు విశ్రాంతి ఉండదు. శరీరానికి విశ్రాంతి ఉండదు. పైగా అధికంగా సేవించిన మద్యం వల్ల తలనొప్పి లేదా హ్యాంగోవర్
వస్తుంది. అటువంటి సమయంలో ఉదయం లేవగానే బ్రేక్ ఫాస్ట్ లో అరటిపండు, పీనట్స్‌ బట్టర్‌తో బ్రెడ్‌ తినాలని పోషకాహార నిపుణులు సూచిస్తున్నారు. ఇవి తలనొప్పి, అలసటను తొలగిస్తాయంటున్నారు.

నిమ్మరసం..
హ్యాంగోవర్ తగ్గాలంటే గోరువెచ్చని నీటిలో నిమ్మరసం కలుపుకుని తాగాలి.మద్యం తాగి లేచిన మరుసటి రోజు ఉదయం నిమ్మరసం తయారు చేసుకుని తాగాలి. దీనివల్ల వికారం, వాంతులు వంటి సమస్యలు తగ్గుతాయి.
టీ, కాఫీలు..
టీ లేదా కాఫీ.. టీ, కాఫీలలో ఉండే కెఫిన్ శరీరాన్ని అప్రమత్తం చేసే ఉద్దీపనగా పనిచేస్తుంది. దీంతో హ్యాంగోవర్ నెర్వస్‌నెస్‌ని తగ్గిస్తుంది. శరీరాన్ని రిలాక్స్ గా ఉండేలా చేస్తుంది.

పెరుగు..
మద్యం తాగటం వచ్చే హ్యాంగోవర్ తగ్గించుకోవడానికి పెరుగు తీసుకోవాలి.. ఉత్త పెరుగు మాత్రమే తీసుకోవాలి. దీంట్లో చక్కెర అస్సలు వేయ్యొద్దు. పెరుగు శరీరంలోని మంచి బ్యాక్టీరియాను కమ్యూనికేట్ చేసి..బాడీని బ్యాలెన్స్ చేస్తుంది.
అల్లం టీ..
అల్లంలో యాంటీఆక్సిడెంట్ గుణాలు మద్యం తాగటం వల్ల వచ్చే హ్యాంగోవర్ నుంచి ఉపశమనంకలిగిస్తుంది. అల్లం టీ తాగడం వల్ల డయేరియా, వికారం, వాంతులు వంటి
సమస్యల నుంచి ఉపశమనం లభిస్తుంది.

అలాగే కొబ్బ‌రి నీరు, మ‌జ్జిగ‌, పళ్ల రసాలు, వాట‌ర్ వంటివి ద్రవపదార్థాలు ఎక్కువ‌గా తీసుకుంటే హ్యాంగోవ‌ర్ ను తగ్గిస్తాయి.

 

ట్రెండింగ్ వార్తలు