Day time sleep : పగటి పూట నిద్ర మెదడుకి మంచిదట.. పరిశోధకులు ఏమన్నారంటే..

పగలు నిద్రపోవడం అంటే అందరికీ కుదరదు. ఉద్యోగాలకు వెళ్లేవారికి అస్సలు వీలు పడదు. అయితే పగటిపూట 30 నిముషాల నిద్ర మెదడుని ఆరోగ్యంగా ఉంచుతుందట. మతిమరుపు రాకుండా కాపాడుతుందట. తాజా పరిశోధనలు ఈ విషయాన్ని వెల్లడిస్తున్నాయి.

Dayaytime sleep

Day time napping : ఉద్యోగాలకు వెళ్లే వారి సంగతి ఎలా ఉన్నా.. ఇంట్లో ఉండేవారు పనులు పూర్తయ్యాక కాసేపు కునుకు తీస్తారు. ఇలా రెగ్యులర్‌గా పగటిపూట నిద్రపోయే వారి మెదడు ఆరోగ్యంగా ఉంటుందని పరిశోధకులు చెబుతున్నారు.

Walking 3 to 4 miles a day: వృద్ధులు రోజుకి 3-4 మైళ్లు నడిస్తే..? పరిశోధనలో తేలింది ఏంటంటే?

యూనివర్సిటీ కాలేజ్ లండన్ మరియు రిపబ్లిక్ ఆఫ్ ఉరుగ్వే విశ్వ విద్యాలయ పరిశోధనల ప్రకారం పగటి పూట నిద్ర మంచిదట. పగలు నిద్రించేవారిలో మతిమరపు వచ్చే ప్రమాదం ఉండదట. నాపర్స్ – నాన్ నాపర్స్ మద్య మెదడు పరిమాణంలో 2.5 సంవత్సరాల నుండి 6.5 సంవత్సరాల వయస్సుతో సమానమని పరిశోధకులు చెబుతున్నారు. కనీసం పగటిపూట 30 నిముషాల నిద్ర మంచిదని శాస్త్రవేత్తలు తెలిపారు.

Cow Urine: గోమూత్రం మనుషులకు హానికరం.. ఐవీఆర్ఐ పరిశోధనలో వెల్లడి

ఈ అధ్యయనం కోసం 40 నుంచి 69 సంవత్సరాల వ్యక్తుల నుంచి డేటాను సేకరించారట. 35,080 మంది వ్యక్తుల DNA నమూనాలు మరియు మెదడు స్కాన్‌ను విశ్లేషించడానికి ‘మెండెలియన్ రాండమైజేషన్’ అనే టెక్నాలజీని కూడా వాడారట. పగటిపూట నిద్ర అలవాటు లేని వారు ముందు 5 నుండి 15 నిముషాలు అలవాటు చేసుకోవడం వల్ల ప్రయోజనం చేకూరుతుందని కూడా ఈ పరిశోధన సూచిస్తోంది. అయితే పగటిపూట అస్తమాను నిద్రపోవడం వృద్ధులలో ముందస్తు మతిమరపుకి సూచన అని గత పరిశోధనల్లో వెల్లడైంది.

ట్రెండింగ్ వార్తలు