Retail Price Of Rice Rises: ఇప్పటికే గోధుమ ధరల పెరుగుదల.. ఇప్పుడు బియ్యం ధరలూ ఆ బాటలోనే..

దేశంలో బియ్యం ధరలు కూడా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే గోధుమ ధరలు పెరిగిన విషయం తెలిసిందే. బియ్యం రీటైల్ ధరలు కూడా గత ఏడాదితో పోల్చితే 6.31 శాతం పెరిగాయి. సగటు రిటైల్‌ ధర ఈనెలలో కిలో రూ.37.70గా ఉంది. ఇందుకు వరి దిగుబడులు తగ్గుతాయన్న ఆందోళనలే కారణం. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఖరీఫ్‌ సీజన్‌లో ఏడు రోజుల క్రితం నాటికి వరి నాట్లు 8.25 శాతం తక్కువగా పడినట్లు తెలుస్తోంది.

Retail Price Of Rice Rises: దేశంలో బియ్యం ధరలు కూడా పెరిగిపోతున్నాయి. ఇప్పటికే గోధుమ ధరలు పెరిగిన విషయం తెలిసిందే. బియ్యం రీటైల్ ధరలు కూడా గత ఏడాదితో పోల్చితే 6.31 శాతం పెరిగాయి. సగటు రిటైల్‌ ధర ఈనెలలో కిలో రూ.37.70గా ఉంది. ఇందుకు వరి దిగుబడులు తగ్గుతాయన్న ఆందోళనలే కారణం. కేంద్ర వినియోగదారుల వ్యవహారాల మంత్రిత్వశాఖ తెలిపిన వివరాల ప్రకారం.. ఈ ఖరీఫ్‌ సీజన్‌లో ఏడు రోజుల క్రితం నాటికి వరి నాట్లు 8.25 శాతం తక్కువగా పడినట్లు తెలుస్తోంది.

ఈ ఏడాది ఖరీఫ్‌ సీజన్‌లో వరి దిగుబడి 112 మిలియన్‌ టన్నులుగా ఉండాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అయితే, వరి దిగుబడి తగ్గే అవకాశం ఉంది. ఉష్ణోగ్రతలు పెరగడంతో పంజాబ్, హరియాణా వంటి రాష్ట్రాల్లో వరి దిగుమతి పడిపోవడంతో ధరలు పెరుగుతున్నాయి. అయినప్పటికీ ఇప్పటికే పెరిగి గోధుమల ధరలతో పోల్చితే బియ్యం ధర మాత్రం తక్కువే పెరిగిందని నిపుణులు చెబుతున్నారు.

గోధుమల సగటు రీటైల్‌ ధర గత ఏడాది కిలోకు రూ.25.41గా ఉండగా, ఇప్పుడు అది 22 శాతం మేర పెరిగింది. అంటే, ప్రస్తుతం అది రూ.31.04కు పెరిగింది. దేశంలో గోధుమ పిండి ధర గత ఏడాది కిలోకు రూ.30.04గా ఉండా ఇప్పుడు 17 శాతం మేర పెరిగింది. అంటే, రూ.35.17గా ఉంది. దేశంలో నిత్యావసర ధరల పెరుగుదలతో ఇబ్బందులు పడుతోన్న సామాన్యుడి నెత్తిపై గోధుమ, బియ్యం ధరల పెరుగుదలతో మరో పిడుగు పడినట్లయింది.

COVID-19: దేశంలో కరోనా కేసులు తగ్గుముఖం.. నిన్న 10,649 కేసులు నమోదు

ట్రెండింగ్ వార్తలు