Hijab ban case in India: హిజాబ్ వివాదం… ఎలా మొదలైంది?.. ఏ రోజు ఏం జరిగింది?

హిజాబ్ వివాదంపై సుప్రీంకోర్టు ఇద్దరు న్యాయమూర్తులు వేర్వేరు తీర్పులు ప్రకటించడంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. కర్ణాటక హైకోర్టు తీర్పుపై అప్పీళ్లను జస్టిస్ హేమంత్ డిస్మిస్ చేస్తూ, ఆ కోర్టు తీర్పును సమర్థించగా, హైకోర్టు తీర్పును జస్టిస్ దులియా తప్పుబట్టారు. సరైన ఆదేశాల కోసం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)కు సిఫార్సు చేయాలని జస్టిస్ హేమంత్ గుప్తా చెప్పారు. అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైంది? అలాగే, ఇది ఎలా సుప్రీంకోర్టు వరకు వెళ్లిందో చూద్దాం..

Hijab ban case: హిజాబ్ వివాదంపై సుప్రీంకోర్టు ఇద్దరు న్యాయమూర్తులు వేర్వేరు తీర్పులు ప్రకటించడంతో ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. కర్ణాటక హైకోర్టు తీర్పుపై అప్పీళ్లను జస్టిస్ హేమంత్ డిస్మిస్ చేస్తూ, ఆ కోర్టు తీర్పును సమర్థించగా, హైకోర్టు తీర్పును జస్టిస్ దులియా తప్పుబట్టారు. సరైన ఆదేశాల కోసం సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి (సీజేఐ)కు సిఫార్సు చేయాలని జస్టిస్ హేమంత్ గుప్తా చెప్పారు. అసలు ఈ వివాదం ఎక్కడ మొదలైంది? అలాగే, ఇది ఎలా సుప్రీంకోర్టు వరకు వెళ్లిందో చూద్దాం..

2021, జూన్ 1.. యూనిఫాం డ్రెస్ కోడ్ విషయంలో ఉడుపి పీయూ కాలేజ్ మార్గదర్శకాలు జారీ చేసింది
2021 డిసెంబరు 27.. ఎనిమిది మంది విద్యార్థినులు ప్రభుత్వ కాలేజీలోకి హిజాబ్ ధరించి వస్తుండడంతో వారిని కళాశాలలోకి రానివ్వలేదు
2022, జనవరి 4.. హిజాబ్‌కు వ్యతిరేకంగా హిందూ విద్యార్థులు కాషాయ శాలువాలతో కాలేజీకి వచ్చారు
2022, జనవరి 31.. హిజాబ్ పై విధించిన నిషేధానికి వ్యతిరేకంగా కొందరు అమ్మాయిలు కర్ణాటక హైకోర్టులో పిటిషన్ వేశారు
2022, ఫిబ్రవరి 5.. యూనిఫాం డ్రెస్ కోడ్ ను పాటించాల్సిందేనంటూ కర్ణాటక ప్రభుత్వం ఆదేశాలు జారీచేసింది
2022, ఫిబ్రవరి 8.. ఈ కేసును విస్తృత ధర్మానానికి అప్పగించారు. అన్ని పాఠశాలలు, కాలేజీలకు ప్రభుత్వం మూడు రోజుల పాటు సెలవులు ఇచ్చింది
2022, ఫిబ్రవరి 10.. మతపర దుస్తులు ధరించి విద్యాలయాలకు వెళ్లకూడదన్న విషయంపై హైకోర్టు మధ్యంతర ఉత్వర్వులు ఇచ్చింది
2022, మార్చి 15… ఇస్లాంలో హిజాబ్ తప్పనిసరేమీకాదని హైకోర్టు తీర్పు ఇచ్చింది
2022, మార్చి 15.. హైకోర్టు తీర్పును సవాలు చేస్తూ ముస్లిం విద్యార్థులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు
2022, సెప్టెంబరు 5.. హిజాబ్ నిషేధంపై సుప్రీంకోర్టులో విచారణ ప్రారంభమైంది
2022, సెప్టెంబరు 22.. హిజాబ్ పై తీర్పును సుప్రీంకోర్టు రిజర్వు చేసింది
2022, అక్టోబరు 13.. ఇద్దరు సుప్రీంకోర్టు న్యాయవాదులు వేర్వేరు తీర్పు ఇచ్చారు. ఇప్పుడు ఈ కేసు సీజేఐ ముందు ఉంది. విస్తృత ధర్మాసనానికి ఈ కేసును బదిలీ చేయడంపై ఆయన నిర్ణయం తీసుకుంటారు

10 TV live: “నాన్ స్టాప్ న్యూస్ అప్ డేట్స్ కోసం 10TV చూడండి”..

ట్రెండింగ్ వార్తలు