Viral Video : అమ్మ బాబోయ్.. రోడ్డుపై 10 అడుగుల భారీ మొసలి.. గజగజ వణికిపోతున్న జనం.. వైరల్ వీడియో!

Viral Video : నదిలోకి పోయేందుకు మొసలి దారి తెలియక రోడ్డుపై సంచరిస్తూ ఇలా కనిపించింది.

Viral Video : భారీ మొసలి.. చూస్తేనే ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. దాదాపు 10 అడుగులు ఉంటుంది. నీళ్లలో ఉండాల్సిన మొసలి రోడ్డుపైకి రావడంతో అక్కడి జనమంతా భయంతో పరుగులు పెట్టారు. జనావాసాల్లోకి వచ్చిన మొసలి ఎటు పోవాలో తెలియక గందరగోళానికి గురైంది. ఈ క్రమంలో నదికి పక్కనే ఉన్న రెయిలింగ్ ఎక్కేందుకు ప్రయత్నించింది. అయినప్పటికీ దాని ప్రయత్నాలు ఫలించలేదు. నదిలోకి పోయేందుకు మొసలి దారి తెలియక రోడ్డుపై సంచరిస్తూ ఇలా కనిపించింది.

రెయిలింగ్ ఎక్కే సమయంలో మొసలికి గాయలయ్యాయి. సమాచారం అందుకున్న పోలీసులు, ఫారెస్ట్ అధికారులు ఎట్టకేలకు ఆ మొసలిని బంధించి పట్టుకున్నారు. అనంతరం పక్కనే ఉన్న నదిలోకి వదిలిపెట్టారు. ఈ ఘటన ఉత్తర్‌ప్రదేశ్‌లో జరిగింది. బులంద్ షహర్‌లో గంగా నదిలో భారీ మొసలి దారితప్పి రోడ్డుపైకి వచ్చింది. నరోరా ఘాట్ దగ్గర నీళ్లలో నుంచి మొసలి బయటికి రావడంతో స్థానికులు భయాందోళనకు గురయ్యారు.

రోడ్డుపై నుంచి నీళ్లలోకి తిరిగి వెళ్లేందుకు ప్రయత్నించింది. కానీ, నరోరా ఘాట్‌పై ఇనుప రేలింగ్ ఎక్కింది. ఈ క్రమంలోనే మొసలికి గాయమైంది. రంగంలోకి దిగిన అటవీశాఖ అధికారులు మొసలి మొహంపై గుడ్డను చుట్టి కళ్లు కనిపించకుండా చేసి బంధించారు. తాళ్ల సాయంతో దాన్ని బంధించారు. మొసలిని పట్టుకోవడంతో స్థానికులంతా ఊపిరిపీల్చుకున్నారు. మొసలి రేలింగ్ ఎక్కేందుకు ప్రయత్నించినా వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.

Read Also : Trending Words: ట్రెండింగ్‌లోని ఇంగ్లీష్ పదాలు.. మీకు తెలుసా

ట్రెండింగ్ వార్తలు