పాతబస్తీలో రాత్రివేళల్లో పోలీసుల పహారా.. అసదుద్దీన్ ఒవైసీ ట్వీట్ వైరల్

పాతబస్తీలో రాత్రి వేళల్లో పోలీసుల పహారా, స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుంది. చాంద్రాయణగుట్టలో ..

Police Checks At Night in Old City : పాతబస్తీలో రాత్రి వేళల్లో పోలీసులు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. రాత్రి 11గంటల వరకు కమర్షియల్ దుకాణాలు బంద్ చేయిస్తున్నారు. పాతబస్తీలో వరుస ఘటనల నేపథ్యంలో తనిఖీలు చేస్తున్నారు. పుడ్ ఐటమ్స్ కు మాత్రమే మినహాయింపు ఉందని, మిగిలిన వాణిజ్య దుకాణాలన్నీ మూసివేయాలని పోలీసులు ఆదేశాలుజారీ చేసినట్లు తెలిసింది. అయితే, రాత్రివేళల్లో దుకాణాల మూసివేతపై ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. నో ఫ్రెండ్లీ పోలీస్.. ఓన్లీ లాఠీ పోలీస్ వైరల్ వీడియో పై స్పందించారు.

Also Read : సారు మైండ్‌గేమ్‌ను సీఎం రేవంత్‌ ప్లే చేస్తున్నారా? ఇంతకీ కాంగ్రెస్ వ్యూహం ఏంటి?

ఇరానీ ఛాయ్ హోటళ్లు, పాన్ షాపులు, కమర్షియల్ ఎస్టాబ్లిష్‌మెంట్స్‌ను కనీసం రాత్రి 12 గంటల వరకు తెరుచుకునేలా అనుమతి ఇవ్వాలి. అందరికీ ఒకటే రూల్ ఉండాలని డిమాండ్ చేశారు. జూబ్లీహిల్స్‌లో ఇలాంటి అనౌన్స్‌మెంట్ చేయగలరా? అంటూ అసదుద్దీన్ ట్విటర్ వేదికగా ప్రశ్నించారు. దేశ వ్యాప్తంగా పెద్ద మెట్రో నగరాల్లో షాపులను రాత్రి వేళ తెరవడానికి అనుమతి ఇస్తాయని..హైదరాబాద్‌లో ఎందుకు భిన్నంగా ఉందని అసదుద్దీన్ ప్రశ్నించారు.

Also Read : ‘పూర్తిగా రద్దు చేయండి’ అంటూ దేశంలో జరుగుతోన్న ఈ గందరగోళంపై మోదీకి మమతా బెనర్జీ లేఖ

పాతబస్తీలో రాత్రి వేళల్లో పోలీసుల పహారా, స్పెషల్ డ్రైవ్ కొనసాగుతుంది. చాంద్రాయణగుట్టలో సోమవారం రాత్రి పోలీసులు వాహనాలను తనిఖీలు చేశారు. ఎలాంటి పత్రాలులేని వాహనాలు సీజ్ చేశారు. రాత్రి సమయంలో సమయం ముగిసినప్పటికీ.. తెరిచిఉన్న హోటల్స్ మూసేయిస్తున్న సందర్భంలో పోలీసులతో స్థానిక వ్యాపారులు గొడవకు దిగారు. పాతబస్తీలో ఇటీవల వరుస ఘటనల నేపథ్యంలో పోలీసులు తనిఖీలు చేస్తున్నారు. లా అండ్ ఆర్డర్ కు విఘాతం కల్గిస్తే కఠిన చర్యలు తప్పవని సిటీ పోలీసులు హచ్చరించారు.

 

 

ట్రెండింగ్ వార్తలు