Indonesia: ఫుట్‌బాల్ మ్యాచ్‌ అనంతరం విధ్వంసానికి పాల్పడ్డ అభిమానులు.. 174 మంది మృతి

ఈ దారుణ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. పరిస్థితులు అదుపులోకి వచ్చేంతవరకూ ఎలాంటి ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లు నిర్వహించవద్దని ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌కు సూచించారు. అయితే ఇండోనేసియాలో మ్యాచ్‌ల సమయంలో ఘర్షణలు తలెత్తడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఈ తరహా పలు ఘటనలు చోటుచేసుకున్నాయి

Indonesia: అమెరా ఎఫ్‌సీ, పెర్సెబయ సురబయ జట్ల మధ్య మ్యాచ్ తీవ్ర విషాధాన్ని మిగిల్చింది. ఈ మ్యాచ్‭లో అమెరా ఎఫ్‌సీ ఓటమి పాలు కావడాన్ని జీర్ణించుకోలేని అభిమానులు పిచ్‌మీదకు దూసుకెళ్లి విధ్వంసానికి పాల్పడ్డారు. అనంతరం జరిగిన తొక్కిసలాటలో 174 మంది ప్రాణాలు కోల్పోగా మరో 180 మంది గాయాలపాలయ్యారు. ఇండోనేషియాలోని మలంగంలో ఉన్న కంజురహాన్ స్టేడియంలో శనివారం రాత్రి జరిగిన దుర్ఘటన ఇది. క్రీడా ప్రపంచంలో జరిగిన అత్యంత బాధాకరమైన దుర్ఘటనల్లో ఇది ఒకటని అంటున్నారు.

అభిమానులు పిచ్‌మీదకు దూసుకెళ్లి విధ్వంసానికి పాల్పడుతుండగా.. పోలీసు బలగాలు భాష్పవాయుగోళాలను ప్రయోగించడంతో పాటు లాఠీఛార్జ్‌ చేశారు. దీంతో ఒక్కసారిగా తొక్కిసలాట జరగడం, టీయర్ గ్యాస్ ప్రభావంతో పలువురు ఊపిరి పీల్చుకోలేక మృత్యువాతపడ్డారని ఈస్ట్ జావా పోలీస్ చీఫ్ నికో అఫింటా మీడియాకు వెల్లడించారు. ఈ దుర్ఘటనపై విచారణ మొదలుపెట్టామని తెలిపారు. దీంతో ఇండోనేసియా టాప్ లీగ్ ‘బీఆర్ఎల్ లీగా 1’ మ్యాచ్‌లను వారం రోజులపాటు రద్దు చేస్తున్నట్టు ఫుట్‌బాల్ అసోసియేషన్ ఆఫ్ ఇండోనేసియా వెల్లడించింది.

Bullet Hit Flight : గాలిలో ఎగురుతున్న విమానంలోకి చొచ్చుకెళ్లిన బుల్లెట్‌.. తర్వాత ఎమైందో తెలుసా!

అయితే, స్టేడియంలో ఎటువంటి అల్లర్లు జరగలేదని, పోలీసులు ఎందుకు టియర్‌ గ్యాస్‌ ప్రయోగించారో తెలియదని కొందరు ప్రేక్షకులు పేర్కొన్నారు. చిన్నారులు, మహిళలు ఉన్నారనే విషయాన్ని చూడకుండా భద్రతా సిబ్బంది దారుణంగా వ్యవహరించారని వాపోయారు. ఘటన సమయంలో దాదాపు మూడువేల మంది మైదానంలోనికి చొచ్చుకువచ్చారని, వారిని అదుపు చేసేందుకే టియర్‌ గ్యాస్‌ ప్రయోగించామని పోలీసులు తెలిపారు. ఈ ఘటన అనంతరం స్టేడియం బయట ఆందోళనకారులు పోలీసు వాహనాలను ధ్వంసం చేశారు.

ఈ దారుణ ఘటనపై తీవ్ర విచారం వ్యక్తం చేసిన ఇండోనేషియా అధ్యక్షుడు జోకో విడోడో పూర్తిస్థాయి విచారణకు ఆదేశించారు. పరిస్థితులు అదుపులోకి వచ్చేంతవరకూ ఎలాంటి ఫుట్‌బాల్‌ మ్యాచ్‌లు నిర్వహించవద్దని ఫుట్‌బాల్‌ అసోసియేషన్‌కు సూచించారు. అయితే ఇండోనేసియాలో మ్యాచ్‌ల సమయంలో ఘర్షణలు తలెత్తడం ఇదే తొలిసారి కాదు. గతంలోనూ ఈ తరహా పలు ఘటనలు చోటుచేసుకున్నాయి. క్లబ్ జట్ల మధ్య ప్రత్యర్థి జట్ల అభిమానులు పలుమార్లు ఘర్షణలకు పాల్పడ్డ సందర్భాలు ఉన్నాయి.

Kerala: కేంద్ర విద్యావిధానం ‘కాషాయం’ అంటూ మండిపడ్డ తమిళనాడు సీఎం స్టాలిన్

ట్రెండింగ్ వార్తలు