Bangladesh: బంగ్లాదేశ్‌లో పడవ మునిగి 24 మంది మృతి.. పలువురు గల్లంతు.. మృతులంతా హిందువులే

బంగ్లాదేశ్‌లో ఆదివారం జరిగిన పడవ ప్రమాదంలో 24 మంది మరణించారు. మరో 30 మందికిపైగా గల్లంతయ్యారు. మహాలయ అమావాస్య సందర్భంగా దేవాలయంలో ప్రత్యేక పూజలు చేసేందుకు వీళ్లంతా పడవలో బయల్దేరగా, ఈ ఘటన జరిగింది.

Bangladesh: బంగ్లాదేశ్‌లో ఆదివారం జరిగిన పడవ ప్రమాదంలో 24 మంది మరణించారు. పలువురు గల్లంతయ్యారు. ఈ ఘటన బంగ్లాదేశ్, ఉత్తర పంచఘర్ జిల్లా, ఆలియార్ ఘాట్ పరిధిలో, కరటోయా నదిలో ఆదివారం జరిగింది.

Indrakeeladri: నేటి నుంచి ఇంద్రకీలాద్రిపై శరన్నవరాత్రులు.. పది రోజులు పది అవతారాల్లో అమ్మవారి దర్శనం

మహాలయ అమావాస్య సందర్భంగా బోడా, పంచ్ పిర్, మేరియా, బంఘారి ప్రాంతాలకు చెందిన పలువురు హిందువులు బోటులో కరటోయ నదీ ప్రాంతంలో ఉన్న బదేశ్వర్ దేవాలయానికి బయల్దేరారు. ప్రత్యేక పూజలు నిర్వహించేందుకు వీరంతా వెళ్లారు. అయితే, పడవలో నిర్దిష్ట ప్రయాణికులకంటే ఎక్కువ సంఖ్యలో ప్రయాణికుల్ని ఎక్కించుకున్నారు నిర్వాహకులు. పరిమితికంటే ఎక్కువ మంది ఉండటం, బరువు ఎక్కువ కావడం వల్ల కరటోయ నది మధ్యలోకి వెళ్లిన తర్వాత పడవ తిరగబడింది. దీంతో పడవలోని వాళ్లంతా నదిలో పడిపోయారు. కొద్ది మంది మాత్రమే ఈదుకుంటూ ఒడ్డుకు చేరగలిగారు.

BiggBoss 6 Day 21 : నేహా చౌదరి ఎలిమినేట్.. బాలాదిత్య బెస్ట్ కంటెస్టెంట్.. గీతూకి నోటిదూల ఎక్కువ..

మిగతా అందరూ గల్లంతయ్యారు. ఈ ఘటనలో 24 మంది వరకు మరణించారు. మరికొందరు గల్లంతయ్యారు. సమాచారం అందుకున్న అధికారులు సహాయక చర్యలు చేపట్టారు. 24 మంది మృతదేహాల్ని వెలికి తీశారు. మిగిలిన వారి కోసం గాలిస్తున్నారు. గల్లంతైన వాళ్లు 30 మందికిపైగా ఉంటారని సమాచారం. మృతుల్లో మహిళలు, పిల్లలు కూడా ఉన్నారు.

 

ట్రెండింగ్ వార్తలు