వామ్మో.. గాల్లో విమానం పక్కనే ఏంటిది? వీడియో వైరల్
Viral Video: నల్లటి వస్తువు 2500 అడుగుల ఎత్తులో ఎగురుతూ కనపడినట్లు ఒహియో మ్యూచువల్ యూఎఫ్‌వో నెట్‌వర్క్ డైరెక్టర్ థామస్
- T Venkateshwarlu
- Updated on- April 27, 2024 / 04:27 PM IST
విమానంలో వెళ్తున్న ఓ మహిళకు గుర్తుతెలియని ఎగిరే వస్తువు-యూఎఫ్‌వో కనపడింది. దాన్ని వీడియో తీసింది ఆ మహిళ. అది పక్షా? యూఎఫ్‌వోనా? అన్న సందేహాలు కూడా వ్యక్తమవుతున్నాయి. మార్చి 25న మిచెల్ రేయెస్ అనే మహిళ కమర్షియల్ ఫ్లైట్‌లో ప్రయాణిస్తున్న సమయంలో ఈ వింత వస్తువు కనపడింది.
ఆమె న్యూయార్క్‌లోని లాగార్డియా ఎయిర్‌పోర్ట్ సమీపంలో విమానం కిటికీ నుంచి దీన్ని వీడియో తీసింది. దీని గురించి ఫేస్‌బుక్ లో పోస్ట్‌లో స్పందిస్తూ.. ఎగిరే సిలిండర్ ని చూశానని పేర్కొంది. తాను ఫెడరల్ ఏవియేషన్ అడ్మినిస్ట్రేషన్‌ను దీనిపై సంప్రదించానని తెలిపింది. భద్రతకు ఏదైనా ప్రమాదం పొంచి ఉంటుందా? అన్న సందేహాలు వచ్చాయని చెప్పింది.
ఆమెకు అధికారుల నుంచి ఇంకా స్పందన రాలేదు. ఓ నల్లటి వస్తువు 2500 అడుగుల ఎత్తులో ఎగురుతూ కనపడినట్లు ఒహియో మ్యూచువల్ యూఎఫ్‌వో నెట్‌వర్క్ డైరెక్టర్ థామస్ చెప్పారు. ఆ సమయంలో విమానం దానికి దగ్గరలోనే ఉందని తెలిపారు. విమానాశ్రయంలో విమానం దిగే సమయంలో ఈ ఘటన చోటుచేసుకుందని వివరించారు.
ALSO READ: వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీలో చేరిన టీడీపీ సీనియర్ నేత యనమల కృష్ణుడు
