Man Consumed Only Cold Drinks : అతను ఏమీ తినడు.. 17 ఏళ్లుగా కూల్ డ్రింక్స్ లీటర్లు లీటర్లు తాగేస్తున్నాడు.. కారణం ఏంటంటే?

అతనికి ఆకలి వేస్తే అన్నం తినడు.. శక్తి కోసం కూల్ డ్రింక్స్ తాగుతాడు. రోజుకు 3 లీటర్ల కూల్ డ్రింక్స్ తాగేస్తున్నాడు. ఇదేం అలవాటు అంటారా? అతనికో వింత సమస్య ఉంది. డాక్టర్లు కూడా దానిని కనిపెట్టలేకపోయారు.

Viral News : ఇరాన్ కి చెందిన ఓ వ్యక్తి ఆకలి వేస్తే కూల్ డ్రింక్స్ మాత్రమే తాగుతాడు. అసలు అతనికి ఆకలే వేయదట. బాగా అలసట అనిపించినపుడు మాత్రం కూల్ డ్రింక్స్ తాగుతాడు. విచిత్రంగా అనిపిస్తోంది కదూ.

సమ్మర్‌లో కూల్ డ్రింక్స్ తెగ తాగుతున్నారా? బీ కేర్‌ఫుల్

ఇరాన్‌కు చెందిన ఘోలమ్రేజా అర్దేషిరి అనే వ్యక్తి 17 సంవత్సరాలుగా కూల్ డ్రింక్స్ మాత్రమే తాగుతూ జీవనం గడుపుతున్నాడు. అతనికి ఆకలి ఉండదట. శక్తిని పొందడానికి పెప్సీ లాంటి కార్బోనేటెడ్ డ్రింక్స్ తాగుతాడు. ఎందుకలా అని అడిగితే అతను తనకు ఎదురైన వింత అనుభూతిని చెబుతాడు.

 

అతనికి తన నోటిలో వెంట్రుక ఒకటి అడ్డంగా ఉన్నట్లు అనిపిస్తుందట. అది కడుపు చివర వరకూ ఉన్నట్లు అనుభూతి కలుగుతుందట. అది లాగుతున్నట్లు.. ఊపిరాడనట్లు కూడా అవుతుందట. వైద్యుల్ని సంప్రదించినా ఆ సమస్యను ఏంటో వారు కూడా నిర్ధారించలేకపోయారట. అలా అతని వింత అనుభూతికి కారణం తెలియలేదు.

Cool Drinks: కరోనా దెబ్బకు పడిపోయిన కూల్ డ్రింక్స్ డిమాండ్

ఈ అనుభూతి కారణంగానో లేక నిజంగా ఏదైనా విపరీతమైన సమస్య కారణంగానో ఘోలమ్రేజా భోజనం చేయడం మానేశాడు. ఒకవేళ తిన్నా అతనికి వికారంగా ఉంటుందట. ఇక  శక్తి కోసం రోజుకు మూడు లీటర్ల ఫిజీ డ్రింక్స్ తీసుకుంటాడట. అలాగే రాత్రి కూడా నాలుగు గంటలు మాత్రమే నిద్రపోతాడట. ఇలా మొత్తానికి ఘోలమ్రేజా విచిత్రమైన పరిస్థితి ఎదుర్కుంటున్నాడు.

 

ట్రెండింగ్ వార్తలు