US president Joe Biden: ఇండియా నుంచి వెళ్లగానే కష్టాల్లో చిక్కుకున్న అమెరికా అధ్యక్షుడు.. ఇంగ్లాండు ప్రధానికీ ఇదే అనుభవం

అమెరికా అధ్యక్షుడు బైడెన్‌పై అభిశంసన విచారణ అమెరికా పార్లమెంట్ స్పీకర్ కెవిన్ మెక్‌కార్తీ నుంచి ఆమోదం పొందింది. అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో బైడెన్ తన కుమారుడికి విదేశీ వ్యాపారంలో బెనిఫిట్స్ ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి

USA Politics: జీ-20 సదస్సు ముగించుకుని అమెరికాకు తిరిగి వచ్చిన వెంటనే అధ్యక్షుడు జో బైడెన్ చిక్కుల్లో పడ్డారు. బైడెన్‌పై అభిశంసన విచారణ ప్రారంభమైంది. ఇక అదే సమయంలో ఆయన కుమారుడు హంటర్ బైడెన్‌పై డ్రగ్స్ కేసు ఆరోపణలు నిజమని తేలాయి. ఈ కేసులో హంటర్‌కు శిక్ష పడింది. హంటర్‌పై చాలా కాలంగా విచారణ కొనసాగుతోంది. అధ్యక్షుడు జో బైడెన్‌పై అభిశంసన విచారణను అమెరికా పార్లమెంట్ స్పీకర్ కెవిన్ మెక్‌కార్తీ ప్రకటించారు. తాజా కేసు డెలావేర్ ఫెడరల్ కోర్టుకు సంబంధించింది.

Putin and Kim: బాబోయ్, పలకరింపు మరీ ఇంత వైలెంటుగానా? తుపాకులతో షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న పుతిన్, కిమ్ జోంగ్

కోర్టులో దాఖలు చేసిన అభియోగపత్రం ప్రకారం.. హంటర్‌పై డ్రగ్స్ స్మగ్లింగ్ ఆరోపణలు ఉన్నాయి. ఇది 2018 నాటి విషయం. హంటర్ డెలావేర్‌లోని ఒక దుకాణం నుంచి కోల్ట్ కోబ్రా అనే తుపాకీని కొనుగోలు చేశారు. ఆ సమయంలో కొకైన్‌కు బానిసైనట్లు హంటర్ అంగీకరించినట్లు సమాచారం. కొనుగోలు సమయంలో అక్రమంగా పనులు జరిగాయని ఆరోపణలు వచ్చాయి. అదే సమయంలో అనేక వ్యాపార ఒప్పందాలకు సంబంధించి అనుమానాలు ఉన్నాయి. వీటిపై విచారణ చేయవచ్చు. ఈ విషయంలో ప్రత్యేక న్యాయవాది పలు సూచనలు కూడా చేశారు.

Elon Musk: అంబర్ హర్డ్‭తో డేటింగ్, మాజీ భార్యతో రహస్యంగా 10వ బిడ్డ.. ఎలాన్ మస్క్ జీవితంలోని సంచలన రహస్యాల్ని బయటపెట్టిన జీవిత చరిత్ర!

ఈ ఒప్పందాలు కాలిఫోర్నియా లేదా వాషింగ్టన్‌కు సంబంధించినవి. విదేశాల్లో వ్యాపారాన్ని విస్తరించేందుకు తన తండ్రి పేరు, బ్రాండ్‌ను ఉపయోగించుకుని భారీ లాభాలు గడించాడన్న ఆరోపణలు కూడా హంటర్‌పై ఉన్నాయి. ఆయనపై కూడా అక్రమాస్తుల ఆరోపణలు వచ్చాయి. అమెరికా అధ్యక్షుడు బైడెన్‌పై అభిశంసన విచారణ అమెరికా పార్లమెంట్ స్పీకర్ కెవిన్ మెక్‌కార్తీ నుంచి ఆమోదం పొందింది. అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్న సమయంలో బైడెన్ తన కుమారుడికి విదేశీ వ్యాపారంలో బెనిఫిట్స్ ఇచ్చారని ఆరోపణలు వచ్చాయి. బైడెన్ 2009 నుంచి 2017 వరకు అమెరికా ఉపాధ్యక్షుడిగా ఉన్నారు.

UAE Kashmir Map: దేశం బయట ఇదే తొలిసారి.. పీఓకే భారత్‌లో అంతర్భాగంగా చూపిస్తూ మ్యాప్‌ విడుదల చేసిన యూఏఈ

ఇలాంటి కష్టాలనే బ్రిటన్ ప్రధాని రిషి సునాక్ సైతం ఎదుర్కొన్నారు. హౌస్ ఆఫ్ కామన్స్‌లోని (యూకే దిగువ సభ) ఎంపీలు జీ20 సమావేశంలో రష్యాకు (Russia) వ్యతిరేకంగా బలమైన స్టాండ్ తీసుకోలేదని ప్రధాని రిషి సునాక్ మీద తీవ్రంగా విరుచుకుపడ్డారు. చారిత్రాత్మక కొత్త ఆర్థిక కారిడార్ ఒప్పందం నుంచి బ్రిటన్‭ను దూరంగా ఉంచినందున ప్రధానిని కూడా విమర్శిస్తున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రతిపక్షం కూడా దీనిపై ప్రశ్నలు సంధిస్తోంది. దీనితో పాటు, స్కాటిష్ సిక్కు జగ్తార్ సింగ్ జోహల్‌ను విడుదల చేయాలని ప్రధాని నరేంద్ర మోదీని అడిగారా అని ప్రతిపక్షాలు కూడా సునక్‌ను పదేపదే అడుగుతున్నారు. రష్యా నుంచి భారత్ చమురు కొనుగోలు చేస్తోందన్న వాస్తవాన్ని ఆయన తనతో లేవనెత్తారా లేదా అనే ప్రశ్నలు కూడా లేచాయి.

ట్రెండింగ్ వార్తలు