Putin and Kim: బాబోయ్, పలకరింపు మరీ ఇంత వైలెంటుగానా? తుపాకులతో షేక్ హ్యాండ్ ఇచ్చుకున్న పుతిన్, కిమ్ జోంగ్

రష్యాకు చెందిన అత్యాధునిక రైఫిల్‌తో పాటు స్పేస్ గ్లోవ్‌ను కిమ్ జోంగ్ ఉన్ కు పుతిన్ బహుమతిగా ఇచ్చారని, దీనిని చాలాసార్లు అంతరిక్షంలోకి తీసుకెళ్లారని డిమిత్రి పెస్కోవ్ తెలిపారు.

Russia Tour: ఉత్తర కొరియా నియంత కిమ్ జోంగ్ ఉన్ రష్యా పర్యటనలో ఉన్నారు. రష్యా అధ్యక్షుడు వ్లాదిమిర్ పుతిన్‌తో సమావేశమైన ఆయన, ఇరు దేశాల మధ్య పలు అంశాలపై చర్చించారు. పుతిన్‌ను కలువుకోవడం ఒకటైతే, తన సాయుధ రైలులో ఉత్తర కొరియా నుంచి రష్యాకు ప్రయాణించి వార్తల్లో నిలిచారు కిమ్ జోంగ్. రష్యా ఫార్ ఈస్ట్‌లోని అముర్ ప్రాంతంలోని వోస్టోచ్నీ కాస్మోడ్రోమ్‌లో బుధవారం పుతిన్‌తో కిమ్ సమావేశమై 40 సెకన్ల పాటు కరచాలనం చేశారు. సాధారణంగా ఎవరు కలుసుకోగానే పుష్పగుచ్చాలో, బహుమతులో ఇచ్చుకోవడం ఆనవాయితీ. అయితే ఈ ఇద్దరు నేతలు కలుసుకోగానే ఇచ్చుకున్న బహుమతులు చాలా చిత్రంగా ఉన్నాయి. పుతిన్, కిమ్ జోంగ్ ఉన్ ఒకరికొకరు తుపాకీలను బహుమతిగా ఇచ్చుకున్నట్లు క్రెమ్లిన్ ప్రతినిధి డిమిత్రి పెస్కోవ్ తెలిపారు.

Ramcharitmanas: రామచరితమానస్‭లో పొటాషియం సైనైడ్.. మరోసారి దుమారం లేపిన బిహార్ విద్యా మంత్రి

రష్యాకు చెందిన అత్యాధునిక రైఫిల్‌తో పాటు స్పేస్ గ్లోవ్‌ను కిమ్ జోంగ్ ఉన్ కు పుతిన్ బహుమతిగా ఇచ్చారని, దీనిని చాలాసార్లు అంతరిక్షంలోకి తీసుకెళ్లారని డిమిత్రి పెస్కోవ్ తెలిపారు. ఇక ఉత్తర కొరియాలో తయారు చేసిన తుపాకీని పుతిన్‌కు బహుమతిగా కిమ్ జాంగ్ ఉన్ అందించారు. ఉత్తర కొరియాను సందర్శించాలన్న కిమ్ ఆహ్వానాన్ని పుతిన్ అంగీకరించారని క్రెమ్లిన్ తెలిపింది. పుతిన్ పర్యటనకు ముందు రష్యా విదేశాంగ మంత్రి సెర్గీ లావ్‌రోవ్‌ను ఉత్తర కొరియాకు పంపుతామని, దాని సన్నాహాలు వీలైనంత త్వరగా పూర్తి చేస్తామని డిమిత్రి పెస్కోవ్ చెప్పారు.

Elon Musk: అంబర్ హర్డ్‭తో డేటింగ్, మాజీ భార్యతో రహస్యంగా 10వ బిడ్డ.. ఎలాన్ మస్క్ జీవితంలోని సంచలన రహస్యాల్ని బయటపెట్టిన జీవిత చరిత్ర!

రెండు దేశాలు అంతర్జాతీయ స్థాయిలో అనేక ఆంక్షలను ఎదుర్కొంటున్నాయి. ఇలాంటి పరిస్థితుల్లో ఇరు దేశాలు తమ పరస్పర అవసరాలను తీర్చుకునేందుకు కలిసి రావాలని ఒప్పందం చేసుకున్నట్లు తెలుస్తోంది. బీబీసీ ప్రకారం, ఉక్రెయిన్ యుద్ధాన్ని దృష్టిలో ఉంచుకుని, రష్యా కొత్త స్నేహితులను ఎంచుకోవడం ప్రారంభించింది. ఉక్రెయిన్ యుద్ధం కారణంగా రష్యాకు ఆయుధాలు అవసరం. ఉత్తర కొరియా విస్తృతంగా ఆయుధాలను ఉత్పత్తి చేస్తోంది. అందుకే కిమ్‌, పుతిన్‌లు ఒకరినొకరు కలిశారు. ఉత్తర కొరియాలో ఆహార సంక్షోభం సమస్య ఉంది. దీని కారణంగా కిమ్ జోంగ్ ఉన్ ఆయుధాలకు బదులుగా ఆహార సహాయాన్ని డిమాండ్ చేస్తున్నారట.

Anurag Thakur: ‘సనాతన ధర్మం’ కామెంట్స్ వేడి ఇప్పట్లో చల్లారేటట్లు లేదు.. అనురాగ్ ఠాకూర్ ఏమన్నారంటే?

వ్లాదిమిర్ పుతిన్ చివరిసారిగా ఉత్తర కొరియాను 23 సంవత్సరాల క్రితం (జూలై 2000) సందర్శించారు. ఆ సమయంలో కిమ్ జాంగ్ ఉన్ తండ్రి దేశాన్ని పరిపాలించేవారు. కిమ్ చివరిసారిగా 2019లో రష్యాకు వచ్చారు.

ట్రెండింగ్ వార్తలు