Anurag Thakur: ‘సనాతన ధర్మం’ కామెంట్స్ వేడి ఇప్పట్లో చల్లారేటట్లు లేదు.. అనురాగ్ ఠాకూర్ ఏమన్నారంటే?

వారు ప్రేమను పంచే దుకాణాన్ని తెరిచారో లేదో నాకు తెలియదు. కానీ,

Anurag Thakur

Anurag Thakur – Sanatana Dharma: సనాతన ధర్మం మలేరియా, డెంగీలాంటిదంటూ, దాన్ని నిర్మూలించాలంటూ తమిళనాడు మంత్రి ఉదయనిధి స్టాలిన్ (Udhayanidhi Stalin) చేసిన వ్యాఖ్యల దుమారం ఇప్పటికీ కొనసాగుతూనే ఉంది. తాజాగా దీనిపై కేంద్ర మంత్రి అనురాగ్ ఠాకూర్ స్పందించారు. అలాగే, దేశంలో బీజేపీ విద్వేష దుకాణాన్ని తెరచి ఆ చెడును వ్యాప్తి చేస్తోందని, తాము ప్రేమను పంచే దుకాణాన్ని తెరిచామని కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ (Rahul Gandhi) చేసిన వ్యాఖ్యలకూ అనురాగ్ ఠాకూర్ కౌంటర్ ఇచ్చారు.

‘ సనాతన ధర్మాన్ని నిర్మూలించాలని కొందరు నాయకులు అనుకుంటున్నారు. వారు ప్రేమను పంచే దుకాణాన్ని తెరిచారో లేదో నాకు తెలియదు. కానీ, విద్వేష మెగా మాల్‌ను మాత్రం తెరిచారు.

సనాతన ధర్మాన్ని నిర్మూలించాలనుకుంటున్నామని విపక్ష కూటమి ఇండియా నేతలు అంటున్నారు. దీన్ని బట్టే తెలిసిపోతుంది.. విద్వేష దుకాణాన్ని తెరిచే లైసెన్సును ఇప్పటికే వారికి రాహుల్ గాంధీ ఇచ్చేశారు ’ అని అనురాగ్ ఠాకూర్ అన్నారు.

కాగా, ప్రతిపక్షాల ఇండియా కూటమికి రహస్య అజెండా ఉందని, వారు దేశ సంస్కృతి, సనాతన ధర్మంపై దాడి చేయాలనుకుంటున్నారని ప్రధాని నరేంద్ర మోదీ కూడా తాజాగా విమర్శలు గుప్పించారు. ఉదయనిధి స్టాలిన్ వ్యాఖ్యలను ఇండియా కూటమి మొత్తానికి అంటగడుతూ బీజేపీ నేతలు విమర్శలు చేస్తున్నారు. వచ్చే ఏడాది లోక్‌సభ ఎన్నికలు ముగిసేవరకు ఈ దుమారం కొనసాగుతూనే ఉండే అవకాశం ఉంది.

Women Priests : దేవాలయాల్లో ఇక మహిళా పూజారులు

ట్రెండింగ్ వార్తలు