Corona New Zealand: మరోసారి పెళ్లిని వాయిదా వేసుకున్న న్యూజిలాండ్ మహిళా ప్రధాని

"ఓమిక్రాన్ తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం విధించిన ఆంక్షలకు కట్టుబడి మరో మారు పెళ్లిని వాయిదా వేసుకుంటున్నాం" అంటూ జసిండా ఆర్డెర్న్ ఆదివారం ప్రకటించారు

Corona New Zealand: ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు విపరీతంగా పెరుగుతున్నాయి. ఓమిక్రాన్ వ్యాప్తితో టీకా తీసుకున్నవారు సైతం కరోనా భారిన పడుతున్నారు. అయితే మూడో దశలో ప్రాణాపాయం లేకపోయినప్పటికీ, ఇబ్బడిముబ్బడిగా కేసులు పెరిగిపోవడం కొంత ఆందోళన కలిగిస్తుంది. ఇక ఆస్ట్రేలియా ఖండంలోనూ కరోనా వ్యాప్తి అధికంగా ఉంది. ప్రధాన దేశాలైన ఆస్ట్రేలియా, న్యూజిలాండ్ లో కరోనా కేసులు అధికంగా నమోదు అవుతున్నాయి. న్యూజిలాండ్ లో ఓమిక్రాన్ వ్యాప్తి తీవ్రంగా ఉన్నట్లు ఆదేశ ప్రభుత్వం ప్రకటించింది. దీంతో దేశ వ్యాప్తంగా కఠిన ఆంక్షలు విధించింది న్యూజిలాండ్ ప్రభుత్వం. జన సమూహాలను నియంత్రించి కఠిన లాక్ డౌన్ అమలు చేశారు అక్కడి అధికారులు.

Also read: Subhash Chandra Bose: నేతాజీ జన్మదినాన్ని జాతీయ సెలవు దినంగా ప్రకటించాలన్న మమతా బెనర్జీ

ఇక న్యూజిలాండ్‌లో కరోనా ఆంక్షలు కఠినతరం చేయడంతో ఆ దేశ ప్రధాని జసిండా ఆర్డెర్న్ తన పెళ్లిని మరోమారు రద్దు చేసుకున్నారు. “ఓమిక్రాన్ తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో ప్రభుత్వం విధించిన ఆంక్షలకు కట్టుబడి మరో మారు పెళ్లిని వాయిదా వేసుకుంటున్నాం” అంటూ జసిండా ఆర్డెర్న్ ఆదివారం ప్రకటించారు. న్యూజిలాండ్ మహిళా ప్ర‌ధానమంత్రి జ‌సిండా ఆర్డెర్న్..క్లార్క్ గేఫోర్డ్‌ అనే వ్యక్తితో చాలాకాలంగా కలిసి ఉంటున్నారు. 2019లోనే వీరికి ఎంగేజ్మెంట్ కాగా.. మూడేళ్ళ పాప కూడా ఉంది. గతేడాది న్యూజీలాండ్ లో కరోనా నియంత్రణలో ఉన్నపుడు వీరిద్దరూ పెళ్లి చేసుకుంటున్నట్లు ప్రకటించగా, కరోనా తిరిగి విజృంభిస్తుండడంతో తమ పెళ్లిని వాయిదా వేసుకున్నారు. తాజాగా మరోసారి పెళ్లిని వాయిదా వేసుకున్నామని తెలిపారు.

Also read: Fever Survey: తెలంగాణలో మూడో రోజుకు చేరుకున్న ఫీవర్ సర్వే

ట్రెండింగ్ వార్తలు