Apollo-15: చంద్రయాన్-3 కంటే ముందే.. 1971లోనే చంద్రుడి మీద కారు నడిపారు. ఆ విషయం తెలుసా మీకు?

లూనార్ మాడ్యూల్ ఫాల్కన్ నుంచి వ్యోమగాములు చంద్రుని ఉపరితలంపై 28 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. అనంతరం అపోలో మిషన్ 15 చంద్రుడి నుంచి 76 కిలోల బరువున్న రాళ్లతో భూమికి చేరుకుంది

Chandrayaan-3: భారత అంతరిక్ష పరిశోధన సంస్థ ఇస్రో రూపొందిన చంద్రయాన్-3 మిషన్ బుధవారం సాయంత్రం 6:40 గంటలకు చంద్రుని ఉపరితలంపై ల్యాండ్ అయింది. చంద్రుని దక్షిణ ధ్రువంపై చంద్రయాన్-3 ఈ ల్యాండింగ్ అయింది. దీంతె ప్రపంచంలోనే ఈ ఘనత సాధించిన తొలి దేశంగా భారత్‌ అవతరించింది. అయితే చంద్రునిపై విజయవంతమైన ల్యాండింగ్‌కు సంబంధించిన 1971 సంవత్సరం నాటి ఒక సందర్భాన్ని గుర్తు చేసుకోవాలి. ఆ సమయంలోనే చంద్రుడి మీద ఓ వ్యక్తి కారు నడిపారు.

Chandrayaan3: చంద్రయాన్-3కి విదేశీ నిధులెందుకంటూ బ్రిటన్ న్యూస్ ఛానల్ అక్కసు.. అదే స్టైల్లో తిరిగిచ్చేస్తున్న ఇండియన్లు

జూలై 20, 1969న నాసా శాస్త్రవేత్త నీల్ ఆర్మ్‌స్ట్రాంగ్ చంద్రునిపై మొదటి అడుగు వేశారు. నాసాకు చెందిన అపోలో మిషన్ 15ని 1971లో విజయవంతంగా పూర్తి చేశారు. ఆ సమయంలో అపోలో-15లో పాల్గొన్న వ్యోమగాములు డేవిడ్ స్కాట్, జేమ్స్ ఇర్విన్ చంద్రునిపై మొదటి లూనార్ రోవింగ్ వెహికల్‌ను నడిపారు.

Chess World Cup 2023 Final : చెస్‌ వరల్డ్ కప్‌ విజేతగా మాగ్న‌స్ కార్ల్‌సన్‌.. పోరాడి ఓడిన ప్రజ్ఞానంద

లూనార్ మాడ్యూల్ ఫాల్కన్ నుంచి వ్యోమగాములు చంద్రుని ఉపరితలంపై 28 కిలోమీటర్ల దూరం ప్రయాణించారు. అనంతరం అపోలో మిషన్ 15 చంద్రుడి నుంచి 76 కిలోల బరువున్న రాళ్లతో భూమికి చేరుకుంది. ఈ నాసా మిషన్ ప్రధాన లక్ష్యం హ్యాడ్లీ అపెనైన్ ప్రాంతాన్ని అన్వేషించడం. చంద్రుని ఉపరితలంపై శాస్త్రీయ ప్రయోగాలను ఏర్పాటు చేయడం, సక్రియం చేయడం కూడా ఇందులో ఉంది. మిషన్ సమయంలో స్కాట్, ఇర్విన్ చంద్రునిపై మొదటి కారును నడిపారు. ఆ సమయంలో ఇద్దరు వ్యోమగాములు 18 గంటల 37 నిమిషాల రికార్డు సమయంలో శోధన పనిని పూర్తి చేశారు.

Harsh Goenka : తమ కంపెనీలో నైపుణ్యం ఉన్న ఉద్యోగుల కొరత ఉందంటూ హర్ష్ గోయేంకా చేసిన ట్వీట్ వైరల్

న్యూయార్క్ టైమ్స్‌లోని ఒక నివేదిక ప్రకారం, జూలై 19 1971 రోజున ఆ చారిత్రాత్మక ఘట్టం ఆవిష్కృతమైంది. డేవిడ్ స్కాట్, అతని తోటి యాత్రికుడు జేమ్స్ ఇర్విన్ చంద్రునికి ప్రయాణించిన ఆ కారు.. అమెరికాలో తయారు చేశారు. చంద్రుని ఉపరితలంపై ఉపయోగించిన కారు రకం సాధారణంగా భూమిపై పని చేయదు.

ట్రెండింగ్ వార్తలు