Harsh Goenka : తమ కంపెనీలో నైపుణ్యం ఉన్న ఉద్యోగుల కొరత ఉందంటూ హర్ష్ గోయేంకా చేసిన ట్వీట్ వైరల్

ఓ వైపు సరైన ఉద్యోగం రావట్లేదని యువతీ,యువకులు ఆందోళన పడుతుంటే..తమ కంపెనీలో నైపుణ్యం ఉన్న సిబ్బంది కొరతతో ఇబ్బంది పడుతున్నామని RPG గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయెంకా ట్వీట్ చేయడం చర్చకు దారి తీసింది.

Harsh Goenka

Harsh Goenka : ఓ వైపు నిరుద్యోగం పెరిగిపోతోందని జనం ఫిర్యాదు చేస్తుంటే తమ కంపెనీ నైపుణ్యం ఉన్న ఉద్యోగుల కొరత ఎదుర్కుంటోందని RPG గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయెంకా అంటున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉండే హర్ష్ గోయేంకా చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది.

Harsh Goenka : జుకర్‌బర్గ్ సక్సెస్ ఫార్మూలాను షేర్ చేసిన హర్ష్ గోయెంకా

నిరుద్యోగం అనేది మన దేశ ఆర్ధిక రంగాన్ని సవాలు చేస్తూనే ఉన్నప్రధాన సమస్య. దేశ జనాభా, ఆర్ధిక వ్యవస్థ విస్తరిస్తున్నా నిరుద్యోగం రేటు కూడా పెరిగిపోతోంది. చాలామంది యువతీ, యువకులు సరైన ఉద్యోగాలు పొందలేకపోతున్నారు. అయితే RPG గ్రూప్ చైర్మన్ హర్ష్ గోయెంకా అందుకు విరుద్ధంగా కామెంట్ చేశారు. భారతదేశంలో కంపెనీలు నైపుణ్యం ఉన్న ఉద్యోగుల కొరతను ఎదుర్కుంటున్నాయని వ్యాఖ్యానించారు. హర్ష్ గోయేంకా (@hvgoenka) ‘మాకు నిర్మాణ కార్మికులు కావాలి.. తగినవారు దొరకట్లేదు. మాకు ట్రక్ డ్రైవర్లు కావాలి.. భారీ కొరత ఉంది. మాకు తోట కార్మికులు కావాలి.. వారు అందుబాటులో లేరు. పరిష్కారం తెలియట్లేదు. ప్రజల అవసరాలను తగ్గించడానికి మనం యంత్రాలతో పనిచేయించాల్సిన అవసరం ఉందా?  ప్రజలకు కష్టపడి పనిచేస్తే వచ్చే డబ్బులతో జీవించాలని లేదా? స్కిల్ డెవలప్ మెంట్ కోసం మనం మరింత చేయాల్సిన అవసరం ఉందా? ఉద్యోగులు, యజమానులతో సమర్థవంతంగా పనిచేయగలిగే డిజిటల్ ప్లాట్‌ఫారమ్ మనకు అవసరమా?’ అంటూ ట్వీట్ చేశారు.

Harsh Goenka : సెల్ ఫోన్లో గేమ్‌లు కాదు.. ఈ స్ట్రీట్ గేమ్ ఆడండి.. హర్ష్ గొయెంకా షేర్ చేసిన వీడియో వైరల్

ఆయన ట్వీట్ ఆన్‌లైన్‌లో చర్చకు దారి తీసింది. ‘చేదు నిజం ఏంటంటే మన యువతకు వైట్ కాలర్ ఉద్యోగాలు కావాలి. మంచి జీతం ఇచ్చినా బ్లూ కాలర్ ఉద్యోగాలు లేవు. ప్యూన్ లేదా క్లర్క్ కోసం ప్రకటన చేయండి. వేల సంఖ్యలో దరఖాస్తులు వస్తాయి’ అని ఒకరు.. ‘అవసరమైన స్కిల్స్ నేర్పడానికి, శిక్షణ ఇవ్వడానికి, అభివృద్ధి చేయడానికి కాలేజీలను, పాలిటెక్నిక్‌లను దత్తత తీసుకోండి. లేదంటే వాటితో కలిసి పనిచేసే కంపెనీలు ఒకచోట చేరి దేశ వ్యాప్తంగా స్కిల్ ట్రైనింగ్ సెంటర్స్ ప్రారంభించి వాటి ద్వారా ఉద్యోగులను పరిశ్రమలకు తీసుకోండి’ అంటూ కామెంట్లు పెట్టారు. ఇంటర్నేషనల్ లేబర్ ఆర్గనైజేషన్ (ILO) ప్రకారం 2030 నాటికి ఇండియా 29 మిలియన్ల నైపుణ్యం కలిగిన సిబ్బంది కొరతను ఎదుర్కొనబోతోందట.

ట్రెండింగ్ వార్తలు