Harsh Goenka : జుకర్‌బర్గ్ సక్సెస్ ఫార్మూలాను షేర్ చేసిన హర్ష్ గోయెంకా

హర్ష్ గోయెంకా సోషల్ మీడియాలో చాలా యాక్టివ్‌గా ఉంటారు. తాజాగా 'జుకర్‌బర్గ్ సక్సెస్ ఫార్ములా‌' అంటూ ఆయన షేర్ చేసిన వీడియో వైరల్ అవుతోంది.

Harsh Goenka

Harsh Goenka : వ్యాపార దిగ్గజం హర్ష్ గోయెంకా మార్క్ ‘జుకర్‌బర్గ్ సక్సెస్ ఫార్మూలా’ అంటూ షేర్ చేసిన వీడియో ఇంటర్నెట్‌లో వైరల్ అవుతోంది. ఆ వీడియోలో జుకర్‌బర్గ్ కంపెనీ స్ధాపించడంలో ఎదురయ్యే సవాళ్లు.. గుర్తుంచుకోవాల్సిన ముఖ్య సూత్రాల గురించి మాట్లాడారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్ అవుతోంది.

Advice from Harsh Goenka : మీరు మంచి పని చేస్తున్నారా? దయచేసి దానిని కెమెరాలో బంధించకండి.. ఈ సలహా ఇచ్చిందెవరంటే?

హర్ష్ గోయేంకా సోషల్ మీడియాలో యాక్టివ్‌గా ఉంటారు. నెటిజన్లతో టచ్‌లో ఉంటారు. తాజాగా మెటా సీఈవో మార్క్ జుకర్‌బర్గ్‌కి సంబంధించిన పాత వీడియోను ఆయన షేర్ చేశారు. ఆ క్లిప్‌లో జుకర్‌బర్గ్ ఏదైనా కొత్త పని ప్రారంభించేటపుడు ఎదురయ్యే కష్టాలను వివరిస్తున్నట్లు ఉంది.

 

హర్ష్ గోయేంకా షేర్ చేసిన వీడియోలో ‘ఏదైనా ఒక పనిని ప్రారంభించేటపుడు దానిని గట్టిగా నమ్మాలి. సవాళ్లు ఎదురౌతాయి. అయినా మీరు చేపట్టిన పనిని వదిలిపెట్టకూడదని నేను భావిస్తున్నాను’ అని జుకర్‌బర్గ్ వీడియోలో చెప్పారు. ‘ప్రంపంచంలో మార్పు తీసుకురావాలని, ప్రజలకు సాయం చేయాలని కోరుకునే వారు తాను కలుసుకున్న అత్యుత్తమ వ్యాపారవేత్తలు’ అని కూడా జుకర్‌బర్గ్ ఈ వీడియోలో చెప్పడం కనిపిస్తుంది. హర్ష్ గోయేంకా ఈ వీడియోకి ‘జుకర్‌బర్గ్ సక్సెస్ ఫార్ములా’ అనే శీర్షికతో షేర్ చేశారు.

Harsh Goenka : సెల్ ఫోన్లో గేమ్‌లు కాదు.. ఈ స్ట్రీట్ గేమ్ ఆడండి.. హర్ష్ గొయెంకా షేర్ చేసిన వీడియో వైరల్

ఈ పోస్టు వైరల్ అవుతోంది.  ప్రపంచంలో మార్పు తీసుకురావడమే లక్ష్యం అయితే కష్టాలు, ఇబ్బందులు చిన్నవిగా కనిపిస్తాయని నెటిజన్లు స్పందించారు.

ట్రెండింగ్ వార్తలు