Glenn McGrath: ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ గ్లెన్ మెక్‌గ్రాత్ ఇంట్లోకి చొరబడ్డ పైథాన్.. తోకపట్టుకొని బయటపడేసిన క్రికెటర్.. వీడియో వైరల్

మెక్‌గ్రాత్ ఇటీవల పోస్టు చేసిన వీడియోలో తన ఇంట్లోకి చొరబడిన కొండ చిలువను జాగ్రత్తగా బయటపడేస్తున్నట్లుగా ఉంది. వీడియో ప్రకారం..

Glenn McGrath

Python In Glenn McGrath Home: భారత్ వేదికగా అక్టోబర్‌లో ఐసీసీ పురుషుల వన్డే ప్రపంచ కప్ 2023 ప్రారంభం కానుంది. అక్టోబర్ 5 నుంచి నవంబర్ 19వ తేదీ వరకు ఈ మెగా టోర్నీ జరుగుతుంది. ఆస్ట్రేలియా దిగ్గజం గ్లెన్ మెక్‌గ్రాత్ ఇటీవల ప్రపంచ కప్ కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు తెలిపారు. 1999, 2003, 2007 సంవత్సరాల్లో ఆస్ట్రేలియా జట్టు ప్రపంచ కప్ ట్రోఫీని గెలుచుకుంది. ఈ మూడు మెగా టోర్నీల్లో మెక్‌గ్రాత్ కీలక ప్లేయర్ గా ఉన్నారు. మరికొద్ది రోజుల్లో ప్రపంచ కప్ టోర్నీ ప్రారంభం కానున్న నేపథ్యంలో క్రికెట్ విషయాలకు సంబంధించి మెక్‌గ్రాత్ సోషల్ మీడియాలో సందడి చేస్తారని అందరూ భావిస్తారు. కానీ, మెక్‌గ్రాత్ మాత్రం పైథాన్ (కొండ చిలువ)తో ఆడుకుంటూ కనిపించాడు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

Python : ఇంటి పైకప్పు మీద భారీ కొండచిలువ ప్రత్యక్షం.. ఎంత పొడుగు ఉందో చూశారా?

మెక్‌గ్రాత్ ఇటీవల పోస్టు చేసిన వీడియోలో తన ఇంట్లోకి చొరబడిన కొండ చిలువను జాగ్రత్తగా బయటపడేస్తున్నట్లుగా ఉంది. వీడియో ప్రకారం.. మెక్‌గ్రాత్ ఇంట్లోకి పైథాన్ దూరింది. దానిని గమనించిన క్రికెటర్.. ఇంటిని ఊడ్చే కర్రతో ఫైథాన్ ను జాగ్రత్తగాపట్టుకొనేందుకు ప్రయత్నించాడు. కానీ అది ఒక్కసారిగా బుసలు కొట్టింది. మెక్ గ్రాత్ బయపడకుండా పైథాన్ తోకను చేతితో పట్టుకొని జాగ్రత్తగా ఇంటి బయటకు తీసుకెళ్లడం వీడియోలో కనిపిస్తోంది. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.

 

 

వీడియోను వీక్షించిన నెటిజన్లు ఆసక్తికర కామెంట్లు చేస్తున్నారు. మెక్ గ్రాత్ జాగ్రత్త అంటూ పలువురు నెటిజన్లు సూచించగా.. బాబోయ్.. మెక్ గ్రాత్‌కు ధైర్యం ఎక్కువే అంటూ మరికొందరు రాశారు.

ట్రెండింగ్ వార్తలు