Australian PM Scott Morrison: వికలాంగ చిన్నారులపై ఆస్ట్రేలియా ప్రధాని వివాదాస్పద వ్యాఖ్యలు..

వికలాంగ చిన్నారులపై ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు.

australian pm Scott Morrison:  అంగ వైకల్యంతో జన్మించిన చిన్నారులపై ఆస్ట్రేలియా ప్రధాని స్కాట్ మోరిసన్ నోరుజారారు.  వివాదాస్పద వ్యాఖ్యలు చేసి చిరవరకు క్షమాపణ చెప్పారు. అంగవైకల్యం లేని పిల్లలు పుట్టటం తనకు దేవుడి ఆశీర్వాదమేనంటూ వ్యాఖ్యానించారు. ఆయన చేసిన ఈ వ్యాఖ్యలు వివాదాస్పదమయ్యాయి. వికాలాంగ పిల్లలు లేనందున తనకు అంగ వైకల్య బీమా పథకం పొందాల్సిన అవసరం లేదంటూ వ్యాఖ్యానించారు.

ఆస్ట్రేలియాలో మే నెలలో ఎన్నికలు జరగనుండగా.. ప్రధాని స్కాట్ మోరిసన్ ప్రచారం నిర్వహిస్తున్నారు. దీంట్లో భాగంగా బుధవారం (ఏప్రిల్ 20,2022) టౌన్ హాల్ డిబేట్‌లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆటిజంతో బాధపడుతున్న ఓ బిడ్డ తల్లి.. అంగ వైకల్య బీమా పథకం గురించి స్కాట్ మోరిసన్‌తో పాటు ఆయన ప్రత్యర్థి ఆంథోనీ అల్బనీస్‌‌‌ను కొన్ని ప్రశ్నలు వేశారు. అంగ వైకల్య బీమా పథకం కింద దేశంలో ఆటిజంతో బాధపడుతున్న చిన్నారులకు అందిస్తున్న సాయంలో కోత విధిస్తున్నారని ఇది సరైంది కాదని దీనిపై మీరు ఏం సమాధానం చెబుతారు? అంటూ ప్రశ్నించింది.

Also read : Peru Country: మైనర్‌పై అత్యాచారంకు పాల్పడితే రసాయన కాస్ట్రేషన్‌.. పెరూ ప్రభుత్వం కీలక నిర్ణయం..

దీనికి సమాధానం చెపుతున్న సమయంలో మోరిసన్ నోరు జారారు. సదరు తల్లి వేసిన ప్రశ్నకు సమాధానం చెబుతు మోరిసన్ ‘‘ దేవుడి ఆశీస్సులతో నాకు అంగ వైకల్యం లేని ఇద్దరు పిల్లలు కలిగారు..అంగ వైకల్య బీమా పథకం నాకు అవసరం లేదు అంటూ నోరు జారారు. ఆ తరువాత మోరిసన్ అంగ వైకల్య బాధితులకు అందిస్తున్న ప్రభుత్వ సాయంలో కోతపై బాధితుల తల్లిదండ్రుల అభ్యంతరాలను తాను అర్థం చేసుకోగలనని తెలిపారు.

అంగ వికలాంగ చిన్నారులపై ప్రధాని మోరిసన్ చేసిన వ్యాఖ్యలను ఆయన రాజకీయ ప్రత్యార్థులతో పాటు వికలాంగ హక్కుల సంఘాలు తీవ్ర అభ్యంతరం వ్యక్తంచేశాయి. దేవుడి ఆశీస్సులు లేనందునే అంగ వైకల్యం కలిగిన పిల్లలు పుట్టారు అన్నట్లు ప్రధాని స్కాట్ మోరిసన్ వ్యాఖ్యలు చేయడం సరికాదంటూ ఏకి పారేశారు. అంగ వైకల్యం కలిగిన పిల్లలు జన్మించడం దేవుడి శాపం అన్నట్లుగా ఆయన వ్యాఖ్యలు ఉన్నాయని ఇలా మాట్లాడటం సరైంది కాదు అంటూ విమర్శలు సంధించారు. మోరిసన్ వ్యాఖ్యలపై లేబర్ పార్టీ నేత బిల్ షార్టెన్ మాట్లాడుతూ..ప్రతి బిడ్డ దేవుడి ఆశీస్సేనని అంగవైకల్యం లేని బిడ్డల గురించే కాకుండా పిల్లలందరు దేవుడు ఆశీశులతో పుట్టినవారేనని అన్నారు.

Also read :  Mystery Disease‌ : అంతు చిక్కని వ్యాధితో కుప్పకూలిపోతున్న చిన్నారులు..ఐదు దేశాల్లో 100 కేసులు

అంగ వైకల్య బీమా పథకం కింద అందజేసే సాయాన్ని మోరిసన్ ప్రభుత్వం తగ్గించడం సరికాదని.. దీన్ని మా పార్టీ అధికారంలోకి వస్తే పరిష్కరిస్తుందని హామీ ఇచ్చారు. అంగ వైకల్యంతో జన్మించిన వారు సంపూర్ణంగా జీవించేందుకు NDIA (నేషనల్ డిసేబిలిటీ ఇన్సూరెన్స్ స్కీమ్) దోహదపడుతుందని చెప్పారు. తన వ్యాఖ్యలు వివాదం కావటంతో మోరిసన్ క్షమాపణ చెప్పారు. తన ఉద్ధేశ్యన్ని తప్పుగా అర్థం చేసుకున్నారంటూ వివరణ ఇచ్చుకుంటూ..తన మాటలు ఏ బిడ్డను తక్కువ చేసి మాట్లాడటం కాదని..తన మాటల వల్ల ఎవరైనా మనస్సుని బాధ కలిగిస్తే క్షమించాలంటూ కోరారు.

ట్రెండింగ్ వార్తలు