Neuralink Bionic Eyes : చిప్‌తో చూపు.. ఎలన్‌ మస్క్‌ న్యూరాలింక్‌ మరో ఆవిష్కరణ..

Neuralink Bionic Eyes : బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ కంపెనీ న్యూరాలింక్ మరో అద్భుత ఆవిష్కరణపై దృష్టి పెట్టింది. అనుకోని ప్రమాదాల్లో చూపు కోల్పోయిన వారు, పుట్టుకతో చూపు లేనివారు పూర్తిగా చూడగలిగే పరికరం తయారీపై దృష్టి పెట్టింది.

Neuralink Bionic Eyes : టెక్నాలజీ సృష్టిస్తున్న అద్భుతాల గురించి ఎంత చెప్పినా తక్కువే.. అసాధ్యం అనుకున్నవి ఎన్నో సుసాధ్యం చేస్తోంది. అలాంటిదే మానవ మెదడులో చిప్ అమర్చి ఆలోచనలతోనే కంప్యూటర్, మౌస్‌ని నియంత్రించడం.. ఆవిష్కరణలకు పెద్ద పీట వేసే టెస్లా కంపెనీ అధినేత ఎలన్ మస్క్ ఆధ్వర్యంలోని న్యూరోలింగ్ కంపెనీ ఈ ప్రక్రియను విజయవంతం చేసింది. తదుపరి ఆవిష్కరణగా కంటిచూపు కోల్పోయిన వారు శాశ్వతంగా చూడగలగడంపై పరిశోధనలు చేస్తుంది. వివాటెక్‌లో ఈ విషయాన్ని ప్రకటించారు.

బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్ కంపెనీ న్యూరాలింక్ మరో అద్భుత ఆవిష్కరణపై దృష్టి పెట్టింది. అనుకోని ప్రమాదాల్లో చూపు కోల్పోయిన వారు, పుట్టుకతో చూపు లేనివారు పూర్తిగా చూడగలిగే పరికరం తయారీపై దృష్టి పెట్టింది. మెదడు నుంచి కంటికి సంకేతాలు అనే ప్రాంతంలో ఏర్పాటు చేసే ఈ చిప్ అంధులకు మళ్లీ ఈ ప్రపంచాన్ని చూసే అందరిలా జీవించే అవకాశం కల్పిస్తుంది. బ్రెయిన్ లోని ఆప్టికల్ ప్రాసెసింగ్ ప్రాంతాలతో ఇది నేరుగా అనుసంధానమై ఉంటుందని వివాటెక్‌లో మస్క ప్రకటించారు. మెదడు లేదా వెన్నెముక గాయాలను పూర్తిస్థాయిలో నయం చేయడం ద్వారా అంధులు తిరిగి చూడగలుగుతారని తెలిపారు.

దశాబ్దాలుగా చీకట్లో మగ్గుతున్న వారి జీవితాల్లో వెలుగు నింపడమే ఈ పరిశోధన ఉద్దేశమని న్యూరాలింపు పరిశోధకులు గతంలో చెప్పారు. రెండు నెలల క్రితమే మస్క్ చూపు తెప్పించే ఈ బ్రెయిన్ చిప్ గురించి మాట్లాడారు. కళ్లు లేని కోతులకు ఈ చిప్ అమర్చగా అవి చూడగలుగుతున్నాయని తెలిపారు. ప్రస్తుతానికి విజన్ అస్పష్టత ఉన్నప్పటికీ మనిషి మెదడులో ఈ చిప్ అమర్చే సమయానికి నాణ్యత మెరుగుపడుతుందన్నారు. ఈ చిప్ అమర్చిన తర్వాత ఏ కోతి చనిపోవడం గానీ తీవ్రంగా గాయపడటం కాని జరగలేదన్నారు. మస్క్ చెప్పినట్లుగా ఈ చిప్ అందుబాటులోకి వస్తే అభిప్రాయం వ్యక్తం అవుతుంది.

చిప్‌తో అంధులు సాధారణ మనుషుల్లా చూడొచ్చు :
చూపును తెప్పించే బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ ఫెస్ పరికరంపై చాలా ఏళ్లుగా పరిశోధనలు జరుగుతున్నాయి. బ్రెయిన్ ఇంప్లాంట్ ద్వారా 2020లో ఆస్ట్రేలియా శాస్త్రవేత్తలు బయోనిక్ ఐ రూపొందించారు. 2021లో స్పెయిన్ శాస్త్రవేత్తలు ఆర్టిఫిషియల్ రెటీనా అమర్చారు. కళ్ళజోడుకు అమర్చిన ఈ ఆర్టిఫిషియల్ రెటినా గుర్తించి ఎలక్ట్రికల్ సిగ్నల్స్ ద్వారా సమాచారాన్ని మెదడుకు అందిస్తుంది. అయితే మస్క్ అభిప్రాయం ప్రకారం. ఈ పరికరాల వల్ల కలుగుతున్న ఉపయోగం చాలా తక్కువ. న్యూరాలింక్ తయారు చేసిన చిప్‌తో అంధులు సాధారణ మనుషుల్లా చూడొచ్చు అన్నది మస్క్ చెబుతున్న మాట. అయితే ఈ చిప్‌పైన ప్రపంచవ్యాప్తంగా అనేక సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పుట్టుకతోనే చూపు లేదా మధ్యలో చూపు కోల్పోయాయా? చిప్ అమర్చిన కోతులు ఇక ఎప్పటికీ చూపుకోల్పోయే ప్రమాదం లేదా? వంటి సందేహాలు కలుగుతున్నాయి.

బ్లైండ్ సెట్ చిప్ ఎలా పనిచేస్తుంది అనేది ఇప్పటికైతే స్పష్టత లేదు. అయితే, మెదడు నుంచి కంటికి సంకేతాలు పంపగలడం ద్వారా సాధ్యమైతే కనుక కోట్ల మంది అందులో జీవితాలలో వెలుగు వచ్చినట్టే. సైన్స్ ఫిక్షన్ కథలకు సాంకేతిక ఆవిష్కరణలకు మధ్య దూరం జరిగిపోతున్న కాలమిది. ఈ దూరాన్ని చెరిపేయడంలో మస్క్ ముందున్నారు. ఈ క్రమంలోని ఆయన న్యూరాలింక్‌లో భారీగా పెట్టబడులు పెట్టారు. న్యూరాలింక్ ఆవిష్కరణలు మనుషుల జీవితాలను మెరుగుపరిచేలా చేయడంపైనే దృష్టి పెడుతున్నాయని మస్క్ అంటున్నారు. ఇదే సమయంలో ఆయన ఓ హెచ్చరిక కూడా చేస్తున్నారు. ఏఐ కాలంలో బ్రెయిన్ కంప్యూటర్ ఇంటర్ఫేస్‌ను జాగ్రత్తగా నైతిక నిబంధనలకు అనుగుణంగా ఉపయోగించాల్సి ఉందన్నారు.

ఆలోచనలతో కంప్యూటర్ ఆపరేటింగ్ :
బ్లైండ్ సైడ్ షిప్ ఆవిష్కరణకు ముందు న్యూరాలిక్ మెదడులో చీఫ్ అమర్చే ప్రయోగం విజయవంతంగా పూర్తి చేసింది. ఈ జనవరిలో ఓ వ్యక్తికి అమర్చిన న్యూరోచిప్ ఆధారంగా అతను ఆలోచనల ద్వారా కంప్యూటర్ ఆపరేట్ చేయగలుగుతున్నారు. పక్షవాతం వచ్చిన రోగుల్లో వెన్నెముక బలహీనత ఉన్న రోగుల్లో ఈ చిప్ అమర్చుట వల్ల అద్భుతాలు సృష్టించవచ్చని మస్క్ అంటున్నారు. మెదడు వెన్నెముక గాయాలని సరి చేసే ఈ సాంకేతికతతో మానవజాతికి గొప్ప మేలు జరుగుతుందని మస్క్ నమ్ముతున్నారు. 8 ఏళ్ల క్రితం ఓ ప్రమాదంలో ఆయన వెన్నుముకకు గాయమైంది. ఆసుపత్రి నుంచి డిశ్చార్జ్ అయ్యారు.

అప్పటినుంచి ఇప్పటివరకు ఎలాంటి సమస్యలు రాలేదని ఎవరితో పని లేకుండా తన పనులు తానే చేసుకో గలుగుతున్నారు. ఆలోచనలను నియంత్రించే ఈ చిప్ టెలిపతిగా పిలుస్తున్నారు. ఈ చిప్ అమర్చిన వ్యక్తులు ఆలోచనల ద్వారా ఫోన్లు కంప్యూటర్లను నియంత్రించగలరు. పక్షవాతం రోగుల్లో శరీరా నియంత్రణ వ్యవస్థను పునరుద్ధరించడంలో ఈ చిప్ అద్భుతంగా పనిచేస్తుందని మస్క్ అంటున్నారు. వీలైనప్పుడల్లా మస్క్ వివరిస్తున్నారు. పుర్రెలో చిన్న భాగాన్ని తొలగించి అమర్చిన ఈ ఎలక్ట్రోలను మెదడులోకి చొప్పిస్తారు.

మెదడులోని న్యూరాల మధ్య ప్రచారం అవుతున్న సందేశాలను గుర్తించి ఆదేశాలిస్తోంది. మెదడు వెన్నుముక గాయాలను సరిచేయడం మనుషులను ఆర్టిఫిషియల్ ఇంటెలిజెంట్‌తో అనుసంధానించడం న్యూరాలింక్ అసలు ఏమని మస్క్ అంటున్నారు. 2016 నుంచి న్యూరాలింక్ ప్రయోగాలు చేస్తోంది మనిషిని రక్షించడమే తన లక్ష్యమని మాస్క్ అంటున్నారు మెదడు మిషన్ కలయికతో అద్భుతాలు సృష్టించవచ్చన్నది ఆయన అభిప్రాయం.

Read Also : Prateek Suri Success Story : దుబాయ్‌‌లో మనోడు.. రూ.15వేల కోట్ల వ్యాపారం.. ప్రతీక్ సూరి సక్సెస్ స్టోరీ!

ట్రెండింగ్ వార్తలు