Prateek Suri Success Story : దుబాయ్‌‌లో మనోడు.. రూ.15వేల కోట్ల వ్యాపారం.. ప్రతీక్ సూరి సక్సెస్ స్టోరీ!

Prateek Suri Success Story : అలాంటి వారిలో ప్రతీక్ సూరి ఒకరు. దుబాయ్‌లో ఈయన ఏం చదివారు? ఏ వ్యాపారంలో ఎలా రాణించారు అనే పూర్తి విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకునే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

Prateek Suri Success Story : దుబాయ్‌‌లో మనోడు.. రూ.15వేల కోట్ల వ్యాపారం.. ప్రతీక్ సూరి సక్సెస్ స్టోరీ!

Success Story Meet Indian Prateek Suri ( Image Credit : Google )

Prateek Suri Success Story : అందరూ చదువుతారు. కానీ, కొంతమంది మాత్రమే వ్యాపారంలో రాణిస్తారు. చదువులో కన్నా వ్యాపారంలో రాణించాలంటే అంత ఈజీ కాదనే చెప్పాలి. ప్రస్తుత రోజుల్లో చాలామంది భారతీయులు చదువు కోసం విదేశాలకు వెళ్తున్నారు. అక్కడే చదివి ఏదో ఒక ఉద్యోగంలో స్థిరపడుతున్నారు. కానీ, వారిలో కొంతమంది భారతీయులు మాత్రమే వ్యాపార రంగంలో ఎదుగుతున్నారు. అలాంటి వారిలో ప్రతీక్ సూరి ఒకరు. దుబాయ్‌లో ఈయన ఏం చదివారు? ఏ వ్యాపారంలో ఎలా రాణించారు అనే పూర్తి విషయాలను ఇప్పుడు వివరంగా తెలుసుకునే తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..

Read Also : JioCinema Premium Plan : జియోసినిమా.. ప్రీమియం వార్షిక ప్లాన్‌ సైలెంట్‌గా వచ్చేసింది.. ఈ ప్లాన్ ధర ఎంతో తెలుసా?

ప్రస్తుత పోటీ వ్యాపార ప్రపంచంలో తనదైన ముద్ర వేసి సెల్ఫ్ మేడ్ ఎంటర్‌ప్రెన్యూర్‌గా మారిన ప్రతీక్ సూరి స్టోరీ అలాంటిదే. మిడిల్ ఈస్ట్, ఆఫ్రికాలో ప్రముఖ ఎలక్ట్రానిక్స్ కంపెనీ అయిన మాసర్ గ్రూప్ వ్యవస్థాపకుడు. ప్రస్తుతం యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్, ఆఫ్రికాలో ఉన్న స్మార్ట్ టీవీ తయారీదారు మాసర్ గ్రూప్ సీఈఓగా పనిచేస్తున్నారు. ఢిల్లీకి చెందిన ప్రతీక్ సూరి తన స్కూల్ ఎడ్యుకేషన్‌ను బరాఖంబా రోడ్‌లోని మోడరన్ స్కూల్‌లో పూర్తి చేశాడు. 2006లో దుబాయ్‌లోని (BITS) పిలానీలో మెకానికల్ ఇంజనీరింగ్‌ను చదివేందుకు యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (UAE)కి వెళ్లాడు.

ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తుల్లో దూసుకెళ్లిన మాసర్ కంపెనీ :
చదువుకునే సమయంలో వృత్తిపరమైన రంగానికి చెందిన రెండు కీలకమైన విషయాల గురించి లోతుగా విశ్లేషించాడు. దాదాపు 200 విభిన్న దేశాలకు చెందిన వ్యక్తులతో కూడిన యూఏఈ జనాభాలోని అపారమైన వైవిధ్యం అతన్ని ఆకర్షించింది. ఈ గ్లోబల్ కమ్యూనిటీలో లీనమవ్వడం వల్ల అపరిమితమైన అవకాశాల గురించి కూడా తెలుసుకున్నాడు. గ్రాడ్యుయేషన్ తర్వాత సూరి సొంత వ్యాపారంపై ఆలోచన వచ్చింది. 2012లో హై క్వాలిటీ కలిగిన యూజర్ ఎలక్ట్రానిక్స్ ఉత్పత్తులను ఉత్పత్తి చేసే మాసర్ అనే స్మార్ట్‌టీవీ సంస్థను స్థాపించాడు. కొద్దికాలంలోనే ఆఫ్రికన్ మార్కెట్‌ సహా ప్రపంచవ్యాప్తంగా ఇతర మార్కెట్లో కూడా మాసర్‌ కంపెనీ విస్తరించింది.

8 లక్షల యూనిట్లకు పైగా విక్రయాలు :
స్థానిక అవసరాలపై మంచి అవగాహనతో ఆఫ్రికాలో విజయవంతమైన ఉత్పత్తులను సూరి ప్రారంభించారు. కంపెనీ ఫ్లాగ్‌షిప్ ఉత్పత్తి అయిన స్మార్ట్ టెలివిజన్ ఆఫ్రికన్ మార్కెట్‌లో అనూహ్యంగా మంచి ఆదరణ పొందింది. ఈ ప్రాంతం అంతటా 8లక్షల యూనిట్లకు పైగా విక్రయించింది. ఆఫ్రికన్ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్, పెట్టుబడుల ద్వారా మాసర్ కంపెనీ వృద్ధిని సాధించింది. బిజినెస్ అండ్ ఫైనాన్షియల్ టైమ్స్ ప్రకారం.. మాసర్ గ్రూప్ 2023లో 1.9 బిలియన్ డాలర్లు (సుమారు రూ. 15780 కోట్లు) విలువను చేరుకుంది.

Read Also : Jawa 42 Bobber Launch : యువత కోసం అదిరే బైక్ వచ్చేసింది.. రాయల్ ఎన్‌ఫీల్డ్ మించిన ఫీచర్లు.. ధర ఎంతంటే?