Jawa 42 Bobber Launch : యువత కోసం అదిరే బైక్ వచ్చేసింది.. రాయల్ ఎన్‌ఫీల్డ్ మించిన ఫీచర్లు.. ధర ఎంతంటే?

Jawa 42 Bobber Launch : ఈ కొత్త కలర్ స్కీమ్, అల్లాయ్ వీల్స్, ఇతర డిజైన్‌ మార్పులతో అడుగుపెట్టనుంది. ముంబైలో జరిగిన ఆల్ యూ కెన్ స్ట్రీట్ (AYCS) ఫెస్టివల్‌లో ఈ జావా బైక్‌ని లాంచ్ చేసింది.

Jawa 42 Bobber Launch : యువత కోసం అదిరే బైక్ వచ్చేసింది.. రాయల్ ఎన్‌ఫీల్డ్ మించిన ఫీచర్లు.. ధర ఎంతంటే?

Jawa 42 Bobber Red Sheen Debuts at Rs 2.29 Lakh ( Image Credit : Google )

Jawa 42 Bobber Launch : కొత్త బైక్ కోసం చూస్తున్నారా? ప్రముఖ జావా యెజ్డీ క్లాసిక్‌ బైకులను భారత మార్కెట్లోకి ప్రవేశపెట్టింది. లేటెస్టుగా జావా 42 బాబర్‌ మోడల్‌ బైక్ ప్రవేశపెట్టింది. ఈ కొత్త ‘రెడ్ షీన్’ వేరియంట్‌ మార్కెట్లో లాంచ్ చేసింది. ఈ కొత్త కలర్ స్కీమ్, అల్లాయ్ వీల్స్, ఇతర డిజైన్‌ మార్పులతో అడుగుపెట్టనుంది. ముంబైలో జరిగిన ఆల్ యూ కెన్ స్ట్రీట్ (AYCS) ఫెస్టివల్‌లో ఈ జావా బైక్‌ని లాంచ్ చేసింది.

Read Also : TVS Apache RTR 160 Series : సరికొత్త బ్లాక్ ఎడిషన్‌తో టీవీఎస్ అపాచీ RTR 160 సిరీస్ బైక్ వచ్చేసింది.. ధర ఎంతంటే?

ఈ జావా బైక్‌.. రెడ్ షీన్ డ్యూయల్‌ టోన్‌ కలర్‌ రెడ్‌, క్రోమ్‌లలో వస్తుంది. లోయర్ బాడీ ఫుల్ బ్లాక్ కలర్ ఆప్షన్లలో ఉండనుంది. ట్యూబ్ లెస్ డైమండ్-కట్ అల్లాయ్ వీల్స్‌ కలిగి ఉంది. అంతేకాదు. ఫుల్ ప్రీమియం బైక్‌ డిజైన్ రెడ్‌ షీన్‌ మెరిసిపోతుంది. జావా యెజ్డీ 42 మోడల్, బాబర్ రెడ్ షీన్ 334cc సింగిల్ సిలిండర్, లిక్విడ్-కూల్డ్ ఇంజిన్‌తో వస్తుంది. ఈ బైక్‌ ఫర్ఫామెన్స్‌ 29.5bhp, 30ఎన్ఎమ్ టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది.

ఈ సరికొత్త జావా బైక్‌ ఇంజిన్ 6-స్పీడ్ గేర్ బాక్స్‌తో వస్తుంది. స్లిప్పర్ క్లచ్‌, అసిస్ట్‌తో వస్తుంది. ఈ జావా మోటార్ సైకిల్‌లో ఇతర మోడల్స్ కన్నా ఆకర్షణీయమైన స్మార్ట్‌ ఫీచర్లను అందించనుంది. అంతేకాదు.. ప్రీ-లోడ్ అడ్జస్టబుల్ 7 స్టెప్స్‌ రియర్ మోనో-షాక్, టూ-స్టెప్ అడ్జస్టబుల్ సీటుతో పాటు యూఎస్‌బీ ఛార్జింగ్ పోర్ట్, ఫుల్ ఎల్ఈడీ లైటింగ్, డిజిటల్ కన్సోల్ వంటి అనేక ఫీచర్లను కలిగి ఉంది. ఈ కొత్త బైక్‌ లాంచ్ అయిన తర్వాత నుంచి ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్‌ అయ్యాయి.

ఈ కొత్త జావా మోటార్ సైకిల్ బ్లాక్ మిర్రర్ ఎడిషన్‌తో రూ. 2.29 లక్షలు (ఎక్స్-షోరూమ్) ధరకు లాంచ్ అయింది. ఈ వేరియంట్ లైనప్‌ అధిక ధరను కలిగి ఉంది. ఈ రెడ్ షీన్ వేరియంట్ జాస్పర్ రెడ్ వేరియంట్ కన్నా రూ .9,550 ఖరీదైనదిగా చెప్పొచ్చు. ఈ కొత్త బైక్ పూర్తిగా అందుబాటులోకి వచ్చిన తర్వాత బైక్ డిమాండ్‌ పెరిగే ఛాన్స్ ఉంది. యూత్ ఆకర్షించేలా డిజైన్‌, అద్భుతమైన ఫీచర్లతో జావా 42 బాబర్ రెడ్ షీన్‌ ప్రవేశపెట్టింది. టూవీలర్ మార్కెట్‌లో ఈ కొత్త జావా బైక్‌లకు ఫుల్ డిమాండ్‌ ఉండనుందని కంపెనీ అంచనా. కొత్తగా రిఫ్రెష్ చేసిన జావా పెరాక్, జావా 42 బాబర్‌ మోడల్‌తో పాటు, జావా యెడ్జీ మోటార్ సైకిల్స్ ప్రస్తుత ‘ఫ్యాక్టరీ కస్టమ్’ పోర్ట్ ఫోలియోను విస్తరించింది.

ప్రస్తుతం జావా 350 బైక్ మోడల్, జావా 42 మోడల్, యెజ్డీ స్క్రాంబ్లర్ యెజ్డీ అడ్వెంచర్‌, యెజ్డీ రోడ్ స్టర్ అనేక కొత్త మోడల్స్ ఉన్నాయి. జావా 42 బాబర్ బైక్ మోడల్ ఎంతో పాపులర్ అయింది. ఆ తర్వాత రెడ్ షీన్‌ బైక్ కూడా ప్రవేశపెట్టింది. టూవీలర్ మార్కెట్‌లో వాటాను విస్తరించేందుకు రెడ్‌ షీన్‌ రానుందని తెలిపారు. ఈ కొత్త వేరియంట్ బాబర్ సెగ్మెంట్‌ సెక్షన్ టాప్‌లో నిలవనుంది. ఆల్ యూ కెన్ స్ట్రీట్ (AYCS) ఫెస్టివల్‌లో ఈ సరికొత్త బైక్‌ని లాంచ్ చేయడం చాలా సంతోషంగా ఉందని కంపెనీ ప్రతినిధి ఒకరు తెలిపారు.

జావా 42 బాబర్ వేరియంట్‌ల ధర (ఎక్స్-షోరూమ్ ఢిల్లీ) వివరాలు :

  • జావా పెరాక్ : రూ. 2,13,187
  • జావా 42 బాబర్ – మూన్‌స్టోన్ వైట్ : రూ. 2,09,500
  • జావా 42 బాబర్ – మిస్టిక్ కాపర్ స్పోక్ వీల్ : రూ. 2,12,500
  • జావా 42 బాబర్ – మిస్టిక్ కాపర్ అల్లాయ్ వీల్ : రూ 2,18,900
  • జావా 42 బాబర్ – జాస్పర్ రెడ్ డ్యూయల్ టోన్ స్పోక్ వీల్ : రూ. 2,15,187
  • జావా 42 బాబర్ – జాస్పర్ రెడ్ డ్యూయల్ టోన్ అల్లాయ్ వీల్ : రూ. 2,19,950
  • జావా 42 బాబర్ – బ్లాక్ మిర్రర్ : రూ. 2,29,500
  • కొత్త జావా 42 బాబర్ -రెడ్ షీన్ : రూ. 2,29,500

Read Also : JioCinema Premium Plan : జియోసినిమా.. ప్రీమియం వార్షిక ప్లాన్‌ సైలెంట్‌గా వచ్చేసింది.. ఈ ప్లాన్ ధర ఎంతో తెలుసా?